గడిచిన రెండేళ్లుగా సానియా మీర్జా(Sania Mirja) షోయబ్ మాలిక్(Shoyab Malik) విడివిడిగా ఉంటున్నారు, వారి వైవాహిక జీవితం సాఫీగా సక్రమంగా సాగడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి.
అయినా వారి వైవాహిక జీవితం ఎలా ఉంటె మీకేంటి ఇబ్బంది, దాని వల్ల దేశానికేమైనా నష్టమా అని ప్రశ్నించేవారూ లేకపోలేదు.
నష్టమా అంటే నష్టమే లేదు, కానీ సెలెబ్రెటీల జీవితంలో ఎం జరుగుతుందో తెలుసుకోవడానికి సామాన్య ప్రజానీకం ఎల్లప్పుడూ ఆశక్తి చూపెడుతూనే ఉంటుంది. అసలు సానియా మీర్జా, షోయబ్ మాలిక్ నుండి విడిపోయిందా ? లేదంటే షోయబ్ మాలిక్ సానియా మీర్జా నుండి విడిపోయాడా ? ఈ రెండిటిలో ఏది నిజమో చాల మందికి సందేహంగానే ఉంది.
ఈ వ్యవహారంలో సామాజిక మాధ్యమాలలో రకరకాల కధనాలు ప్రచారంలో ఉన్నాయి. అందుకే సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ మీర్జా స్వయంగా స్పందించాడు. తన కుమార్తె కాపురం విషయానికి సంబంధించి కోన్ని వివరాలు మీడియా ఎదుట వెల్లడించాడు.
సానియా పెడుతున్న పోస్టులే చెబుతాయి : Sania Posts Speak The Truth
సానియా మీర్జా – షోయబ్ మాలిక్ ల వివాహం 2010 సంవత్సరంలో జరిగింది. వీరి వివాహాన్ని హైదరాబాద్(Hyderabad) లోనే ఘనంగా నిర్వహించారు.
పెళ్లి తరువాత వీరు దుబాయ్(Dubai) లో కాపురం పెట్టారు. వీరి కాపురం కొన్నేళ్ల పాటు మూడుపువ్వులు ఆరు కాయలుగా సాగినప్పటికీ ఆతరువాత నుండి కలతల కాపురంగా మారిపోయింది. అన్నట్టు వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు.
ఇక తన వైవాహిక బంధం విచ్ఛిన్నం అయింది అన్న విషయాన్నీ సానియా నేరుగా ఎప్పుడు చెప్పకపోయినా ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇస్తూ ఉండేది. ఆమె తన సామజిక మాధ్యమాలలో పెడుతున్న పోస్టులు వ్యక్తిగత జీవితంలో మనస్సంతి లోపించింది అన్న విషయాన్నీ స్పష్టంగా తెలియజేసేవి.
సానియా ఖులా చెప్పేసిందా ? Sania Asked For Khulaa ?
సానియా మీర్జా నేరుగా మీడియా ముందుకు వచ్చిన చెప్పకపోయినా తన తండ్రి మాత్రం ఆమె కాపురం గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. సానియా మీర్జా తన భర్త నుండి ఖులా కోరుకున్నది అని అన్నాడు. ఖులా అంటే తలాఖ్(Talakh) వంటిదే.
తలాఖ్ అనేది ముస్లిం లలో భర్తలు భార్య నుండి విడిపోవడానికి చెప్పేది. అయితే ఖులా అనేది భార్యలు భర్త నుండి విడిపోవడానికి చెప్పేది. సానియా షోయబ్ నుండి విడిపోవడానికి ఖులా(Khulaa) చెప్పిందని తన తండ్రి మతాల ద్వారా నే తెలుస్తోంది.
ఇక ఖులా చెప్పిన తరువాత పిల్లలు ఉంటె వారు తండ్రి వద్ద కాకుండా తల్లి వద్దే పెరుగుతారు. కొడుకు అయితే ఏడేళ్ల వయసు వచ్చే వరకు తల్లి వద్ద ఆతరువాత నుండి తండ్రి వద్ద పెరుగుతాడు. కుమార్తె అయితే యుక్త వయసు వచ్చే వరకు తల్లి వద్దే పెరుగుతుంది. ఖులా చెప్పినప్పటికీ భార్య, బిడ్డల పోషణ పిల్లల చదువుల నిమిత్తం తండ్రి తప్పకుండ ఆర్ధిక సహాయం చేసి తీరాల్సిందే.