Sania mirza husband get married 3rd time: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా (Sania Mirza)గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. స్పోర్ట్స్ కెరీర్ లో ఎన్నో సక్సెస్‌లను సొంతం చేసుకున్న ఆమె..పాకిస్తాన్ (Pakishthan) క్రికెటర్ షోయబ్ మాలిక్ (Shoaib Malik)ని లవ్ మ్యారేజ్ చేసుకుంది.
పాక్ క్రికెటర్ తో వివాహం జరిగిన తర్వాత సానియా ఎన్నో సమస్యలను ఫేస్ చేసింది. అయినా వాటన్నింటిని ఎదుర్కొని భర్తతో కలిసి పాకిస్తాన్‌లోనే కాపురం పెట్టింది. ఈ స్పోర్ట్స్ కపుల్‌కి ఇజాన్ మీర్జా మాలిక్ (Izaan Mirza Malik) అనే కుమారుడు ఉన్నాడు.
కొన్నాళ్ళుగా ఈ కపుల్స్ మధ్య కలతలు ఏర్పడ్డాయని రూమర్స్ సోషల్ మీడియాలో వస్తున్నాయి. వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు ఈ రూమర్స్ ను ఈ మధ్యనే సానియా నిజం చేసింది. సోషల్ మీడియాలో ఎమోషనల్ స్టోరీ పోస్ట్ చేసింది.
తన భర్త ఫోటోలను సైతం తన అకౌంట్ నుంచి తొలగించింది. దీంతో సానియా, షోయబ్ విడాకులు తీసుకున్నట్లు అందరూ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే సోషబ్ అందరికీ షాక్ ఇచ్చాడు. మూడో పెళ్లి చేసుకుని తమ విడాకుల వార్తను నిజం చేశాడు.
Shoaib married a Pakistani actress : పాకిస్థాన్ నటిని పెళ్లాడిన షోయబ్
సానియా మీర్జా(Sania Mirza)ను పోయబ్ మాలిక్ (Shoaib Malik) ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లుగా వీరి కాపురం సాఫీగానే సాగింది. అయితే ఓ సంవత్సరకాలంగా ఈ జంట విడాకులు తీసుకోబోతోందంటూ వార్తలు నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి.
అయినా ఎక్కడా కూడా వీరిద్దరూ అధికారికంగా ఆ విషయాన్ని అనౌన్స్ చేయలేదు. ఈ టైమ్ లోనే షోయబ్ మాలిక్ మూడో పెళ్లి చేసుకోవడం ఆసక్తిర అంశంగా మారింది. అంతే కాదు ఈ పాక్ క్రికెటర్ తన ట్విటర్ అకౌంట్ లో పెళ్లి ఫోటోలను షేర్ చేశారు.
పాకిస్థాన్ కు చెందిన నటి సనా జావేద్ (Sana Javed)ను షోయబ్ వారి సంప్రదాయ పద్ధతుల్లో పెళ్లాడాడు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. షోయబ్ మాలిక్ 2002 లో ఆయేషా సిద్ధిఖీ (Ayesha Siddiqui)ని మొదటి వివాహం చేసుకున్నాడు.
ఆమె నుంచి 2010లో విడాకులు తీసుకుని ఆమె నుంచి విడిపోయాడు. 2010 ఏప్రిల్ 12న సానియా మీర్జాను రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికీ ఓ బాబు పుట్టాడు. ఇప్పుడేమో సానియాకు విడాకులు ఇచ్చి పాకిస్థాన్ నటి సనా జావేద్ ను మూడో పెళ్లి చేసుకున్నాడు.
Sania’s Instagram story viral : సానియా ఇన్ స్టా స్టోరీ వైరల్
మూడు రోజుల క్రితం సానియా మీర్జా (Sania Mirza)తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్టోరీ పోస్ట్ చేసింది. ” పెళ్లి కష్టం. డివోర్స్ తీసుకోవడం కష్టం. లైఫ్ లో ప్రతీది కష్టమైనదే. మీ కష్టాన్ని మీరే ఎంచుకోండి. మీ లైఫ్ లో ఎదురయ్యే ఛాలెంజులను ఎదుర్కోండి” అంటూ ఎమోషనల్ స్టోరీ షేర్ చేసింది.
సానియా షేర్ చేసిన ఈ స్టోరీ క్షణాల్లోనే నెట్టింట్లో వైరల్ అయ్యింది. దీంతో భర్తతో సానియా విడిపోయిందని ఆమె అభిమానులు డిసైడ్ అయ్యారు.
అందుకే ఇలాంటి పోస్ట్ పెట్టిందని కామెంట్స్ చేశారు. గతంలో షోయబ్ (Shoaib Malik) కూడా తన ట్విటర్ లో వీరి రిలేషన్‌షిప్ స్టేటస్ నుంచి భార్య సానియా మీర్జా పేరును తొలగించాడు. ఇక లేటెస్టుగా సానియా ఇన్‌స్టాలో భర్త ఫోటోలను డిలీట్ చేసింది.
సానియా షేర్ చేసిన పోస్ట్ తర్వాత ఇప్పుడు షోయబ్ అధికారికంగా తన మూడో భార్యను నెటిజన్స్ కు ఇంట్రడ్యూస్ చేశాడు.