History of Sankranti and why do we celebrate Sankranti, Bhogi and kanuma,: సంక్రాంతి ఇది తెలుగింటి పండుగ..ఎంతో వైభవంగా చేసుకునే పండుగ.

Sankranti is a festival of Telugu.

సంక్రాంతి ఇది తెలుగింటి పండుగ, తెలుగు రాష్ట్రాల్లో ఎంతో వైభవంగా చేసుకునే పండుగ. సంక్రాంతి అంటే కొత్త గా ఇంటికి వచ్చే పంటలు, సంక్రాంతి అంటే రంగవల్లులు, సంక్రాంతి అంటే ముద్దుగుమ్మలు, సంక్రాంతి అంటే గంగిరెద్దులు, సంక్రాంతి అంటే గొబ్బెమ్మలు.

సంక్రాంతి అంటే భోగి మంటలు, సంక్రాంతి అంటే పిండి వంటలు, సంక్రాంతి అంటే కొత్త అల్లుళ్ళు, సంక్రాతి అంటే కొంటె మరదలు, సంక్రాంతి అంటే గాలిలో ఎగిరే పతంగులు, సంక్రాతి అంటే కోడి పందాలు, సంక్రాంతి అంటే గంగిరెద్దులు, సంక్రాంతి అంటే హరిదాసుల పాటలు.

అన్నిటికి మించి సంక్రాంతి అంటే సరదాల తో అలరాడే తెలుగు లోగిళ్ళు. సంక్రాంతి రోజున ఎం చేస్తామో చెప్పాము కానీ అసలు సంక్రాంతి ఎందుకు చేస్తాము, ఎలా చేసుకోవాలి అన్నది తక్కువ మందికి తెలుసు.

ముఖ్యంగా ఇప్పటి తరంలోని టీనేజర్స్ ను సంక్రాంతి ఎందుకొస్తుంది అని అడిగితె సెలవుల కోసం అని సెటైరికల్ గా పంచ్ డైలాగ్ కొట్టినా కొడతాడు. అందుకు కారణం ఏమిటంటే వారిలో కొంత మందికి నిజంగా సంక్రాంతికి పూర్తి అర్ధం తెలీకపోవడమే.

కొత్త ధాన్యాల కళ:

తన కష్టాన్ని చూస్తూ. పైకి వచ్చాను 16 History of Sankranti and why do we celebrate Sankranti, Bhogi and kanuma,: సంక్రాంతి ఇది తెలుగింటి పండుగ..ఎంతో వైభవంగా చేసుకునే పండుగ.

సంక్రాంతి అంటే నూటికి నూరుపాళ్లు తెలుగు వారి పండుగ, సంక్రాతి పండుగ అచ్చమైన పల్లెటూరి పండుగ, ఇది అసలు సిసలైన వ్యవసాయదారుడి పండుగ, పల్లెటూళ్లలో కులాలకు అతీతంగా చేసుకునే పండుగ.

అనాదిగా వ్యవసాయం చేసే వారికి ఈ విషయాలు బాగా తెలుసు, ప్రతి ఏటా జనవరి మాసంలో వారి ధాన్యం ఇంటికి వస్తుంది.

అంటే జనవరి కన్నా ముందే వరి కోత కోయడం, పంట ఆరబెట్టి కుప్ప వేయడం, ఆతరువాత వాటిని నూర్పిడి చేయడం వంటివన్నీ జరిగిపోతాయి. ఇక జనవరి నెల మొదటి వారానికే ఇంటికి కొత్త ధాన్యం వచ్చేస్తుంది.

బంగారు వర్ణంలో కళకళలడే ధాన్యం ఇంట్లోకి చేరిందంటే సిరిసంపదలు వచ్చినట్టే. కొత్త ధాన్యాన్ని దంచి ఆ బియ్యంతోనే సంక్రాతి నాడు పొంగలి వండుతారు, ఆ పొంగలిని దేవుడికి నైవేద్యంగా పెడతారు.

ఇక కొత్త ధాన్యం వస్తే వాటిని ఏడాది పొడవునా మన ఆహారానికి సరిపడా నిల్వ చేసుకుని మిగిలిన వాటిని విక్రయిస్తారు రైతులు, అయితే అందరూ ధాన్యాన్ని అమ్మేయాలని ఏమి లేదు, కొంత మంది నిల్వ చేసుకుని ఇంకాస్త మెరుగైన ధర వచ్చినప్పుడు అమ్ముకుంటారు. కొంతమంది మాత్రం వారి అవారి అవసరాల నిమిత్తం అమ్మేస్తారు.

కొత్త అల్లుళ్ళ కు బహుమానాలు:

తన కష్టాన్ని చూస్తూ. పైకి వచ్చాను 17 History of Sankranti and why do we celebrate Sankranti, Bhogi and kanuma,: సంక్రాంతి ఇది తెలుగింటి పండుగ..ఎంతో వైభవంగా చేసుకునే పండుగ.

అయితే అసలు సంక్రాంతి సమయంలో అవసరాలు ఎక్కువగా ఏముంటాయి అనే కదా మీ అనుమానం, సంక్రాంతి సమయం లో కొత్తగా పెళ్ళైన అల్లుళ్ళు అత్తారింటికి వస్తారు.

మరి అత్తారింటికి వచ్చిన అల్లుళ్ళకి కూతురికి కొత్త బట్టలు కొనివ్వాలి, అలాగే ఇంట్లోవారికి కూడా కొత్త బట్టలు తప్పనిసరే, ఇవి కాకుండా కొత్త అల్లుడికి సైకిలో స్కూటరో ఎదో ఒకటి బహుమానంగా ఇచ్చేవారు. ఇప్పుడు అల్లుళ్లయితే 200సీసీ బైకులో, లేదంటే బుల్లెట్ బండో కావాలని మొహమాటం లేకుండా అడిగేస్తున్నారు.

మరి అల్లుడిగారి గొంతెమ్మ కోరిక తీర్చకపోతే నామర్దా గా ఉంటుంది కాబట్టి మామగారు ఇంట్లో ఉన్న ధాన్యం బస్తాలు అమ్మాల్సిందే. ఇక సంక్రాతి నాడు ప్రతి ఇల్లు ఘుమ ఘుమ లాడుతూ ఉంటుంది. రకరకాల పిండి వంటలు ప్రతి ఇంట్లో కనిపిస్తాయి.

ఏ ఇంటికి వెళ్లినా ఆతిధ్యం తప్పక దొరుకుతుంది. ముఖ్యంగా ఈ సంక్రాతి సమయంలో కనిపించేవి నేతి అరిసెలు. ఈ వంటకం లేకుండా సంక్రాతి పూర్తవదు అంటే అతిశయోక్తి కానీ కాదు.

కొత్త బియ్యం నాన బోసి, ఆతరువాత వాటిని రోట్లో వేసి రోకలితో దంచి పిండిచేసి, మంచి బెల్లం తో పాకం పట్టి చేసే అరిసెలు ఎంతో రుచిని ఇస్తాయి. మనం విడి రోజుల్లో చేసుకునే అరిసెల కన్నా సంక్రాతి సమయంలో చేసుకునే అరిసెలకే ఎక్కువ రుచి.

గోదావరి జిల్లాలో చూడాలీ:

తన కష్టాన్ని చూస్తూ. పైకి వచ్చాను 18 History of Sankranti and why do we celebrate Sankranti, Bhogi and kanuma,: సంక్రాంతి ఇది తెలుగింటి పండుగ..ఎంతో వైభవంగా చేసుకునే పండుగ.

సంక్రాతి పండుగ పేరుచెప్తే గుర్తొచ్చేది ఉభయ గోదావరి జిల్లాలు, ఎందుకంటే ఆ ప్రాంతాల్లో సంక్రాతి నాడు వేసే కోడి పందాలు కానీ వివిధ రకాల పిండి వంటలకు గాని మరే ఇతర ప్రాంతము సాటి రాదు.

సంక్రాంతి సమయంలో గోదావరి జిల్లాలకు గనుక వెళితే అక్కడ కోడి పందాల జోరు, హోరెత్తిపోతూ ఉంటుంది. ఏడాది పొడవునా ఎంతో జాగ్రత్తగా తర్ఫీదు ఇచ్చి మంచి బలమైన ఆహారం పెట్టి పెంచిన జాతి కోడి పుంజును సంక్రాతి రోజున బరిలోకి దింపుతారు.

ఈ కోడి పందాలలో కూడా రెండు రకాల పందాలు ఉంటాయి. ఒకటి కోడి కాలికి కత్తి కట్టి వేసే పందెం ఒకటైతే ఇంకోరం కత్తి కట్టకుండా వేసే పందెం ఒకటి. అయితే ఈ కోడి పుంజుల మీద వేసే పందెం ఒకటైతే ఆ పందెం వేసిన వారిలో ఎవరు గెలుస్తారా అని వేసే పందాలు కూడా ఉంటాయి.

ఈ కోడి పుంజుల పందెం పెద్ద రగడే రేపుతోంది ప్రతి యేడు. మనుషుల సరదా కోసం మూగజీవాలను హింసించడం రెచ్చగొట్టి బరిలోకి దింపి వాటి ప్రాణాలతో చెలగాటం ఆడటం సమంజసం కాదని, అది చట్ట విరుద్ధమని కొంతమంది వాదిస్తూ ఉంటారు.

కొన్ని ప్రభుత్వాలు వీటిని నిషేధించగా కొన్ని ప్రభుత్వాలు ప్రత్యేకంగా బరులు, శిబిరాలు ఏర్పాటుచేసిమరీ ఈ కోడిపందాలు నిర్వహిస్తూ వచ్చాయి. అయితే ఆ కోడి పందాలు కేవలం సంక్రాతి సమయానికి మాత్రమే అనుకూడా చెబుతున్నాయి ప్రభుత్వాలు విడి సమయాల్లో కోడి పందాలు వేస్తె కటకటాలు లెక్కపెట్టాల్సిందే.

పోటేళ్ల పందెం చూశారా:

తన కష్టాన్ని చూస్తూ. పైకి వచ్చాను 19 History of Sankranti and why do we celebrate Sankranti, Bhogi and kanuma,: సంక్రాంతి ఇది తెలుగింటి పండుగ..ఎంతో వైభవంగా చేసుకునే పండుగ.

పల్లెటూళ్ళకి వెళితే మనకు కేవలం కోడి పందాలు మాత్రమే కాదు పోటేళ్ల పందాలు యడ్ల పందాలు కూడా కనబడతాయి. పోటేళ్ల పందెం అంటే రెండు పోటేళ్లను ఒకదానిపై ఒకటి ఎదురెదురుగా వెళ్లి ఢీకొనేలా చేస్తారు.

అలా ఒకసారి అవి సమరంలోకి దిగాయంటే ఎదో ఒకదాడిని తల పగిలి కిందకి ఒరిగిపోవాల్సిందే. అయితే ఎడ్ల పందాలు వేరుగా ఉంటాయి, వీటిలో ప్రాణాలు పోయే ప్రమాదం అస్సలు ఉండదనే చెప్పాలి. ఎడ్ల బండికి బదులుగా ఒక పెద్ద బాండ రాయికి ఎడ్ల జతను కట్టి పరుగులు పెట్టిస్తారు.

ఎవరి ఎడ్ల జత అయితే నిర్ణీత సమయంలో ఎక్కువ రౌండ్లు బండను లాగుతుందో ఆ యడ్ల జతకి బహుమానం అందజేస్తారు. ఈ యడ్ల పందాలు కేవలం సంక్రాంతి సిజన్ లో మాత్రమే వేయాలని లేదు. ఇందులో హింస తక్కువ కాబట్టి రైతులకు తీరిక దొరికిన సమయంలో ఎప్పుడైనా ఈ యడ్ల పందాలు నిర్వహించుకుంటూ ఉంటారు.

సంక్రాతి సీజన్ వచ్చిందట చాలు కోట్లల్లో వ్యాపారు జరుగుతాయి, ఈ సంక్రాతి సీజన్ లో మనకు ఎక్కువగా క్లియరెన్స్ సేల్, ఫెస్టివల్ ఆఫర్ అని మనకు బోర్డులు దర్శనమిస్తాయి.

అంటే షాపింగ్ కాంప్లెక్సుల వారు కూడా అప్పటి వరకు ఉన్న పాత స్టాకు మొత్తాన్ని క్లియర్ చేసేందుకు క్లియరెన్స్ సేల్ పెట్టేస్తారు. ఇలాంటి సమయంలోనే ఆఫర్లు పెట్టి కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు.

పాత వస్తువులు భోగి మంటల్లో:

తన కష్టాన్ని చూస్తూ. పైకి వచ్చాను 20 History of Sankranti and why do we celebrate Sankranti, Bhogi and kanuma,: సంక్రాంతి ఇది తెలుగింటి పండుగ..ఎంతో వైభవంగా చేసుకునే పండుగ.

పాత స్టాకు ఉంచిపెట్టుకోకుండా క్లియరెన్స్ సెల్ పెట్టి మరీ క్లియర్ చేయాల్సిన అవసరం ఏముంది అని చాల మందికి అనుమానం రావచ్చు.

సంక్రాతి నాటికి మన ఇంట్లో కూడా పాత వస్తువులు నిల్వ ఉచిపెట్టకూడదు అని అంటారు, అందుకే ఆ రోజు భోగి పండుగ నాడు పెద్దవాళ్ళు , చిన్నవాళ్లు అనే తేడా లేకుండా ఎవరి ఇంట్లో పాత వస్తువులు ఉన్నా వాటిని భోగి మంటల్లో వేసి నిప్పు పెడతారు. అదే భోగి మంటల్లో చలి కాగుతారు.

ఇక ఆ భోగి మంటల్లోనే కొంతమంది నీళ్ల కుండను పెట్టి నీళ్లు వేడి చేసి ఆ వేడి నీటిని ఇంట్లో చిన్న పిల్లలకు తలా స్నానం చేయించేందుకు ఉపయోగిస్తారు. అలా చేస్తే అది వారికి మంచిదని నమ్మకం. ఇక భోగి పండుగ రోజున చిన్నారులకు భోగి పళ్ళు పోస్తారు.

ఈ భోగిపళ్ళలో రాగి ఇత్తడి నాణాలతో పాటు, రూపాయి బిళ్లలు కూడా కలుపుతారు. అయితే భోగి పళ్ళు అనే పళ్ళు ఎక్కడ చూడలేదు అవి ఎక్కడ దొరుకుతాయి అనుకోకండి. భోగిపళ్లు అంటే రేగు పళ్లే, ఈ రేగు పళ్ళు కూడా సంక్రాతి సీజన్ టైం లోనే పండుతాయి కాబట్టి వాటిని భోగి పండుగనాడు ఉపయోగిస్తారు. అందుకే వాటిని భోగి పళ్ళు అని కూడా అంటారు.

భోగి పళ్ళు అంటే:

తన కష్టాన్ని చూస్తూ. పైకి వచ్చాను 21 History of Sankranti and why do we celebrate Sankranti, Bhogi and kanuma,: సంక్రాంతి ఇది తెలుగింటి పండుగ..ఎంతో వైభవంగా చేసుకునే పండుగ.

భోగి పండుగ తరువాత వచ్చేదే సంక్రాంతి, ఈ సంక్రాంతి నాడు సూర్యోదయానికన్నా నిద్ర లేచి, అభ్యంగ స్నానం చేసి, దేవుడికి పూజ చేస్తారు, అదే విధంగా దేవుడికి వివిధ రకాల వైవిద్యాలు నివేదన చేశారు. ముఖ్యంగా సంక్రాతి రోజున చేసే కొత్త బియ్యం పాయసాన్ని పొంగించి నైవేద్యం పెడతారు.

అదే విధంగా చనిపోయిన పూర్వీకుల పేరిట వారికి కొత్త బట్టలు పెట్టి ఆ బట్టలను వారికి ఇష్టమైన వారికి ఇస్తారు. ఎందుకంటే సంక్రాతి పండుగ అనెది పెద్దల పండుగ. ఇక ఇంటికి వచ్చిన బంధువులకు కూడా వివిధ రకాల పిండి వంటలతో రకరకాల భోజనాలు వడ్డిస్తారు.

మరీ ముఖ్యంగా గోదారి జిలాల్లో ఇంటికి వచ్చిన వారిని మర్యాదతో చంపేస్తారేమో అన్నట్టు ఉంటుంది. అయితే సంక్రాంతి అంటే ముక్క ఉండదా అంటే ఉంటుంది, ముక్క లేనిదే ముద్ద దిగని వారు ఎక్కువ మంది ఉంటారు.

కదా సాధారణంగానే, మరి సంక్రాంతి టైం లో నాన్ వెజ్ లేకపోతె ఎలా అంటారా ? అంతే కదా మరి, నాన్ వెజ్ ఉండాల్సిందే. అందుకే ఈ మూడు రోజుల పండుగ లో కనుమ నాడు నాన్ వెజ్ తో రక రకాల వంటలు తయారు చేస్తుంటారు. తాము తినడమే కాకుండా అతిధులకు కూడా ఆ రుచులు చూపెడతారు.

కనుమ రోజు అలా ఎందుకు చేయాలంటే:

తన కష్టాన్ని చూస్తూ. పైకి వచ్చాను 22 History of Sankranti and why do we celebrate Sankranti, Bhogi and kanuma,: సంక్రాంతి ఇది తెలుగింటి పండుగ..ఎంతో వైభవంగా చేసుకునే పండుగ.

ఇక ఈ కనుమ రోజున ఇంట్లో ఉండే పశువులకు కూడా కాస్త స్పెషల్ ఫుడ్ పెడతారు. మన ఇళ్లలో ఉండే గోమాతలకు ఇంట్లో తయారు చేసిన పొంగలిని తినిపిస్తారు. అలాగే పొలంలో పనిచేసే ఎడ్ల జాతికి అన్ని రకాల అలంకారాలు చేస్తారు.

ఎడ్ల కి అలంకారంగా ఎం చేస్తారు అని ఆశ్చర్యం వేస్తోందా, వాటి అలంకార వస్తువుల గురించి తెలియనివారికి ఈ మాట ఆశ్చర్యంగానే ఉంటుంది. మన ఇంట్లో ఉండే ఎడ్ల కొమ్ములకు రెండు వేస్తారు. అలాగే వారి మేడలో మువ్వల గంటలు కడతారు. తలపై వేలాడే కుచ్చులు కడతారు.

వారి నడుముకి బొడ్డు వారు తగిలిస్తారు. ఆలా అలంకరించిన ఎడ్ల జత బండిని లాగుతూ వెళుతూ ఉంటె ఎంత కళగానో ఉంటుంది. వీటికి ఇలా ప్రత్యేకంగా అలంకారాలు చేయడం అవసరమా అంటే, అవసరమే. వ్యవసాయం అంటే పాడి పంటా అంటారు. ఈ రెండిటిని వేరుగా చుడలేం.

ఎందుకంటే పాడి పరిశ్రమ అనేది ఆవులు గేదెలతో నడుస్తుంది. మరి పంట పండించాలంటే భూమిలో విత్తనం పెట్టేనాటి నుండి పంట నూర్చి ఇంటికి తీసుకొచ్చే వరకు పశువుల తోనే వ్యవసాయం చేసే వారు ఒకప్పుడు.

కానీ ఇపుడు యాత్రీకరణ వల్ల పశువులతో అంటే యాడ్లతో అవసరం లేకుండా పోయింది. కానీ ఈ ట్రాక్టర్లు వంటివి లెకప్పుడు ఎడ్లతోనే నెల దున్నేవారు, ఎడ్లను ఉపయోగించే కుప్పనూర్చేవారు. కాబట్టి కనుమ నాడు వాటిని ప్రత్యేకంగా చూసేవారు.

ఇక సరదాల సంక్రాంతి అంటే మనకి జ్ఞాపకంక్ వచ్చేది సినిమా, ఈ సంక్రాంతిని దృష్టిలో పెట్టుకునే దర్శక నిర్మాతలు వారి వారి ఇసినిమాలను ప్లాన్ చేసుకుంటారు. కొందరు దర్శకులైతే సంక్రాంతిని దృష్టిలో పెట్టుకునే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారు.

ఈ సంక్రాంతి రోజున ఏ హీరో సినిమా అయితే హిట్టవుతుందో ఆ హీరోనే సంక్రాతి హీరోగా పేరు దక్కించుకుంటాడు. దాదాపు మూడు రోజులు పాటు అన్ని రంగాల వారికి సెలవుగానే ఉంటుంది. కాబట్టి ఈ సెలవుల రోజుల్లో కుటుంబ సమేతంగా ఆనందంగా గడపడానికి ఎక్కువ మంది ఇష్టపడతారు.

ఆ సమయంలో సినిమాకి వెళ్ళడానికి కూడా ప్లాన్ చేసుకుంటారు. కాబట్టి సంక్రాంతిని సినిమాను వేరుగా చూడలేము. సంక్రాంతికి సినిమాలు రావడం అనేది ఇప్పటి మాట కాదు, అనాదిగా వస్తోంది.

వీరితో పాటు అనువాద చిత్రాలు కూడా అప్పుడప్పుడు ఆరాటపడుతూ ఉంటాయి. ఏది ఏమైనా సంక్రాంతి పండుగ అనేది తెలుగువారి పండుగ. మూడు రోజుల పటు నిర్వహించుకునే ముచ్చటైన పండుగ.

Leave a Comment