Sankranthi special Pooja in Srisailam : శ్రీశైలం లో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

website 6tvnews template 3 Sankranthi special Pooja in Srisailam : శ్రీశైలం లో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

Sankranthi special Pooja in Srisailam : శ్రీశైలం లో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

భ్రమరాంబిక మల్లికార్జున స్వామివార్లు కొలువై ఉన్న ప్రముఖ పుణ్య క్షేత్రం శ్రీశైలం(Srisailam), తెలుగు రాష్ట్రాల(Telugu States) నుండే కాకుండా దేశం లోని అనేక ప్రాంతాల నుండి వచ్చే భక్తులు స్వామి వారిని దర్శించుకుని తరిస్తూ ఉంటారు. ఎంతో చరిత్ర కలిగిన ఈ ఆలయంలో మల్లన్న వేల సంవత్సరాలుగా పూజలు అందుకుంటున్నాడు. నమ్మి కొలిచే వారి కొంగు బంగారంగా కోరిన వరాలు ఇస్తుంటాడు.

భోళా శంకరుడైన ఆ శివుడిని దర్శించుకుంటే మనసులోని కోర్కెలు తప్పక తీరుతాయని భక్తుల విశ్వాసం. ఇక ఈ సంక్రాంతికి శ్రీశైలం కి భక్త జనం మరింత ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అందుకు తగ్గట్టే ఆలయ అధికారులు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.

ఈ నెల అంటే జనవరి 12వ తేదీ నుండి శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. పంచాహ్నిక దీక్షతో జరిగే ఈ ఉత్సవాలు ఈనెల 18వ తేదీ వరకు కొనసాగుతాయి.

ఏయే పూజలు నిలిపివేస్తారంటే .. What Type Of Pooja Is Stopping In Srisailam

ఇక స్వామి వారికి జరిగే ప్రత్యేక పూజల విషయానికి వస్తే 12వ తేదీన స్వామివారు యాగశాలకు ప్రవేశిస్తారు, ఆతరువాత అంకురార్పణ, అగ్ని ప్రతిష్టాపన, ధ్వజపటం ఆవిష్కరణ కార్యక్రమాలను నిర్వహిస్తారు.

ఇక 13వ తేదీన భ్రమరాంబిక మల్లికార్జున స్వామివార్లకు(Bramaramba Mallikarjuna) విశేష పూజలు చేస్తారు, అలాగే వాహన సేవలు కూడా నిర్వహిస్తారు. వివిధ రకాల వాహనాలపై ఉత్సవ విగ్రహాలను ఉంచి ఊరేగిస్తారు. ఇక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీశైలం ఆలయంలో(Srisailam Temple) రుద్ర హోమం, చండీ హోమం, మృత్యుంజయ హోమం, ఏకాంత సేవ వంటి వాటిని నిలిపివేయనున్నారు.

సంక్రాంతి సమయంలో జరిగే ఈ ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది, పాఠశాలలు, కళాశాలలే, ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలకు కూడా సెలవులు ఉండటం వల్ల పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయాలను సందర్శిస్తూ ఉంటారు.

అందుకే భక్తుల రాకను దృష్టిలో పెట్టుకుని భద్రతా పరమైన ఏర్పాట్లను కూడా కట్టుదిట్టం చేస్తున్నారు అధికారులు.

Leave a Comment