Sarandos meet Mahesh: మహేష్ ను కలిసిన సరండోస్..టాలీవుడ్ లో సరండోస్ సడన్ మీటింగ్స్.

Sarandos met Mahesh.. Sarandos sudden meetings in Tollywood.

Sarandos meet Mahesh: మహేష్ ను కలిసిన సరండోస్..టాలీవుడ్ లో సరండోస్ సడన్ మీటింగ్స్..

ఈ ప్రపంచంలో ఎవరికైనా కావలసింది ఎంటర్టైన్మెంట్, అది గాని లేకపోతె మనిషికి పిచ్చి పడుతుంది, ఆ ఎంటర్టైన్మెంట్ కోసం ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు, ఒకరు స్పోర్ట్స్ ఎంచుకుంటే, ఒకరు టూర్స్ అండ్ ట్రావెలింగ్ లో రిలాక్స్ అవుతారు.

ఇంకొంతమంది ఆధ్యాత్మిక లోకంలో విహరిస్తే కొందరు ఫ్రెండ్స్ తో గడుపుతారు. కానీ ఈ వరల్డ్ లో కామన్ ఎంటర్టైన్మెంట్ మాత్రం ఒకటి ఉంటుంది అదే సినిమా..ఒకప్పుడు ఈ సినిమా అనేది కేవలం వెండి తెర మీద మాత్రమే కనిపించేది, ఆటవువాత బుల్లి తేరా వచ్చేసింది.

బుల్లి తేరా వచ్చాక సీరియల్స్ హవా మొదలైంది. ఆతరవాత రియాలిటీ షోలు, కామెడీ షోలు, డాన్స్ షోలు అంటూ వరుసగా పుట్టుకొచ్చేశాయి. ఇప్పుడు వెబ్ సీరీస్ రాజ్యమేలుతోంది.

అయితే ఇవన్నీ ఒకప్పుడు టీవీల్లో టెలికాస్ట్ అయ్యేవి కానీ ఇప్పుడు టివి ని తలదన్నుతూ స్మార్ట్ ఫోన్ లోకి వచ్చేసింది ఎంటర్టైన్మెంట్.

వెండి తెరను మించి తేలి విజన్ వస్తే, తేలి విజన్ ను పక్కకి నెట్టేసి స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. పైగా కరోనా సమయం నుండి స్మార్ట్ ఫోన్ వాడే వారి సంఖ్య మరింత ఎక్కువైంది. అందుకే డిజిటల్ రంగం పై కన్నేశారు పెద్దవారు కూడా.

ప్రస్తుతం నడుస్తోంది డిజిటల్ యుగం ఒకప్పుడు సినిమా విడుదలైతే 100 రోజులు 150 రోజులు 175 రోజులు 200 రోజులు 250 రోజులు అంటూ సినిమాలు నెలల తరబడి ఆడుతూనే ఉండేవి, రీళ్లు ఆరిగిపోయినా సినిమా మాత్రం రన్ అవుతూనే ఉండేది.

Add a heading 2023 12 09T161714.610 Sarandos meet Mahesh: మహేష్ ను కలిసిన సరండోస్..టాలీవుడ్ లో సరండోస్ సడన్ మీటింగ్స్.

సరికొత్త ప్రింట్ తో రీరిలీజ్ అంటూ మైక్ సెట్ పెట్టి రిక్షా లో అనౌన్స్ చేసేవారు. కానీ ఇప్పుడు రోజులు మారాయి. సినిమా అయినా, టివి సీరియల్ అయినా, వెబ్ సీరీస్ అయినా, షార్ట్ ఫిలిం అయినా, న్యూస్ ఐటమ్స్ అయినా,

యూ ట్యూబ్ లో వచ్చే ప్రోగ్రామ్స్ అయినా సరే ఏదైనా స్మార్ట్ ఫోన్ లోనే. అందుకే నిర్మాతలు తాము పెట్టిన పెట్టుబడి వారం రోజుల్లో తిరిగి వచ్చేసే లా ప్లాన్ చేసుకుంటున్నారు.

తమ సినిమాను వందల కొద్దీ ప్రింట్లతో విడుదల చేసుకుని పెట్టిన పెట్టుబడిని తెలివిగా రాబట్టుకుంటున్నారు. అందుకు కారణం సినిమా థియేటర్ లో విడుదలైన మూడు రోజులకే పైరసీ బారిన పడటం, ఆ పైరసీ సినిమాలు స్మార్ట్ ఫోన్ లోకి ప్రత్యక్షమవడం.

అందుకే వారం రోజుల్లో వసూలు చేసుకోవాలి నిర్మాతలు.ఇక సినిమాను స్మార్ట్ ఫోన్ లో చూసే వారు కొందరైతే, ఇంట్లోని హోమ్ థియేటర్ లో కాలు మీద కాలువేసుకుని ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయాలనుకునే వారు మరికొందరు.

టీవీ లో సినిమా టెలికాస్ట్ అయ్యే వరకు వారు ఉండలేదు, పైగా యాడ్స్ బెడద ఒకటి. ఎందుకు ఇలాంటి సెట్ ఆఫ్ ఆడియన్స్ కోసమే ఓటిటీ ప్లాట్ ఫామ్ ఉద్భవించింది.

ఓటిటీ వేదికలు స్టార్ హీరోల సినిమాల నుండి చిన్న సినిమాలు, రియాలిటీ షోలు, సెలెబ్రెటీస్ తో చేసే ఇంటర్వ్యూ లు, టాక్ షోలు, కోకింగ్ షోలు, గేమ్ షోలు వెబ్ సీరీస్ లు, షార్ట్ ఫిలిం లు అన్ని టెలికాస్ట్ చేస్తుంటారు.

సినిమా థియేటర్ లో స్టార్ హీరో సినిమా వేస్తె చిన్న సినిమా ప్రసాదర్శించడానికి అవకాశం ఉండదు, కానీ ఈ ఓటిటీ లో ఎన్నైనా రిలీస్ చేసుకోవచ్చు, ఎంతమందైన రిలీజ్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా రిలీజ్ చేసుకోవచ్చు.

అందుకే ఈ ఓటిటీ అంటే సామాన్య ప్రేక్షకులే కాక స్టార్ హీరోలు కూడా ఇష్టపడుతున్నారు. మన సౌత్ లోని అందరి హీరోల సినిమాలు ఓటిటీ లోకి విడుదల అవుతున్నాయి.

వారి సినిమాలను ఓటిటీ వారు భారీ మొత్తం చెల్లించి రైట్స్ సొంతం చేసుకుంటున్నారు. దాని వల్ల నిర్మాతలకు మరింత లాభం చేకూరుతోంది. అందుకే కలుస్తున్నాడో, లేక మరేదైనా కారణం ఉందొ తెలీదు కానీ నెట్‌ఫ్లిక్స్ సీఈవో టెడ్ సరండోస్ హైదరాబాద్ లో తెగ తిరిగేస్తున్నారు.

మొన్న ఆమధ్య మెగా కాంపౌండ్ లోకి అడుగు పెట్టి మెగా హీరోస్ ని మీట్ అయ్యాడు. నిన్నటికి నిన్న నందమూరి హీరోస్ ని టచ్ చేశాడు, తాజాగా ఘట్టమనేని వారబ్బాయి, సూపర్ స్టార్ మహేష్ బాబు ను కలిశాడు.

త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ సెట్ కి వెళ్లి వారిని కలుసుకున్నాడు టెడ్ సరండోస్. ఆయన టీం మోనికా షెర్గిల్, అభిషేక్ గోరాడియా, మహేష్, త్రివిక్రమ్ కలిసి సెల్ఫీలు కూడా తీసుకున్నారు. ఆ ఫోటోలను మహేష్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు.

ఫ్యూచర్ ఎంటర్‌టైన్మెంట్‌కు సంబంధించి వారి మధ్య కొన్ని ఆశక్తికర విషయాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే సరండోస్ వరుస మీటింగులు మాత్రం ఇండస్ట్రీలో విపరీతమైన చర్చకు దారి తీస్తున్నాయి. ఈ మీటింగులు ఇక్కడితో ఆపుతాడా, లేదంటే పనిలో పనిగా తమిళ్ ఇండస్ట్రీ ని కూడా టచ్ చేస్తాడా అని చూడాలి.

Leave a Comment