SBI KYC update using YONO app : SBI యోనో యాప్ ఉపయోగించి KYC అప్డేట్ చెయ్యచ్చు

website 6tvnews template 33 SBI KYC update using YONO app : SBI యోనో యాప్ ఉపయోగించి KYC అప్డేట్ చెయ్యచ్చు

SBI KYC update using YONO app : కేవైసీ (Know Your Customer) వివరాలు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయమని ప్రతి బ్యాంక్‌ తన కస్టమర్లను అడగడం సర్వ సాధారణం.కేవైసీ అప్‌డేట్‌ చేయకపోతే కొన్ని చాలా ఇబ్బందులు వస్తాయి మనకి.

మీకు స్టేట్‌ బ్యాంక్‌లో అకౌంట్‌ ఉన్నట్లయితే, బ్యాంక్‌కు అందిచగలిగిన మీ వ్యక్తిగత సమాచారం లేదా వివరాలే కేవైసీ. ఒకవేళ మీరు వేరే ఇంటికి మారితే, కొత్త ఇంటి అడ్రస్‌ను మీ అకౌంట్‌ డిటైల్స్‌లో యాడ్‌ చేయాలి. ఇతర వివరాలు మారినా కూడా ఇలాగే చేయాలి.

ఒకవేళ ఏ వివరాలు మారకపోయినా, అదే విషయాన్ని బ్యాంక్‌కు చెప్పాలి.ఇదే కేవైసీ అప్‌డేషన్‌. బ్యాంక్‌ కి వెళ్లేంత తీరిక & ఓపిక మీకు లేకపోతే, ఎస్‌బీఐ యోనో యాప్‌ ద్వారా కూడా KYC అప్‌డేట్‌ చేయవచ్చు. మీ వివరాల్లో ఎలాంటి మార్పు లేకపోతేనే యోనో యాప్ ద్వారా KYC అప్‌డేట్ చేయడం వీలవుతుందని గుర్తుంచుకోవాలి.

YONO లో SBI KYCని ఎలా అప్‌డేట్ చేయాలి?

  • స్టెప్‌ 1: మీ అకౌంట్ యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ఉపయోగించి యోనో యాప్‌లోకి లాగిన్ అవ్వాలి.
  • స్టెప్‌ 2: హోమ్ స్క్రీన్ ఎగువ ఎడమ వైపున ఉన్న మెనులో SERVICE REQUEST మీద క్లిక్‌ చేయాలి. KYC అప్‌డేట్ గడువు ఉన్నవారికి మాత్రమే ఈ మెనూ కనిపిస్తుంది.
  • స్టెప్‌ 3: తర్వాత Update KYC మీద క్లిక్ చేయాలి.
  • స్టెప్‌ 4: ఇక్కడ, మీ ప్రొఫైల్ పాస్‌వర్డ్‌ను ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది.
  • స్టెప్‌ 5: తర్వాత మీ చిరునామాను ధృవీకరించాల్సి ఉంటుంది. అవసరం అనుకుంటే మీ వృత్తి, ఆదాయం కూడా అప్‌డేట్‌ చేయవచ్చు.
  • స్టెప్‌ 6: మీ చిరునామా వివరాలను అప్‌డేట్‌ చేయాలనుకుంటే, KYC చిరునామా వివరాల అప్‌డేషన్‌ ఆప్షన్‌లో YES మీద క్లిక్‌ చేయాలి.
  • స్టెప్‌ 7: కింద ఉన్న బాక్స్‌లో టిక్ చేసి, నెక్ట్స్‌ బటన్‌ మీద ప్రెస్ చేయాలి.
  • స్టెప్‌ 8: ఇప్పుడు, మీ రిజిస్టర్డ్ మొబైల్‌ నంబర్‌కు వచ్చిన OTPని అక్కడ నింపి, సబ్మిట్‌ బటన్‌ క్లిక్‌ చేయండి. అంతే, SBI KYC అప్‌డేషన్‌ పూర్తి అయినట్లే.

Leave a Comment