ప్రజల అవసరాలే వారి టార్గెట్ : People Requirement Is Scammers target
Scammer Targeted Ram mandir Devotees: అగ్గిపుల్ల సబ్బు బిళ్ళ, కుక్కపిల్ల కాదేది కవితకు అనర్హం అని మహాకవి శ్రీశ్రీ అన్నట్టు, మోసాలకు కూడా కాదేదీ అనర్హం అనుకున్నారేమో చివరకు అయోధ్య రామ మందిరాన్ని(Ayodhya Rama mandir) కూడా వాడుకుంటున్నారు.
మనుషుల ఆశలను ఆకాంక్షలను టార్గెట్ చేస్తూ ఉంటారు ఈ అక్రమార్కులు. నిత్యం ప్రజలు ఎక్కువ దేని సెర్చ్ చేస్తున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నడుస్తున్న హాట్ టాపిక్స్ ఏంటి అన్న వాటిపై దృష్టి పెడతారు. తదనుగుణంగా వారి వ్యూహాలకు పదును పెట్టి అమాయకులను మోసం చేసి కాసులు దండుకుంటారు.
కాస్తంత పరాకుగా ఉంటె చాలు పాకెట్ కి చిల్లు పెట్టేస్తారు. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా సరే బ్యాంకు ఖాతా లో చిల్లి గవ్వ కూడా లేకుండా ఊడిచేస్తారు. ప్రస్తుతం ఈ దుర్మార్గుల కన్ను రామ మందిరం పై పడింది.
వీఐపీ టికెట్ల పేరుతి మెసేజులు : Messages On The name Of VIP Tickets
దేశ వ్యాప్తంగా ఎంతో మంది ఈ రామ మందిర నిర్మాణం ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా, రామచంద్రుడిని ఎప్పుడెప్పుడు దర్శించుకుందామా అని ఎదురుచూస్తున్నారు.
ఇలాంటి తరుణంలో రామమందిర ప్రారంభోత్సవానికి వెళ్లే వారిని లక్ష్యంగా చేసుకుని కొన్ని మెసేజులు పంపుతున్నారు. జనవరి 22వ తేదీన రామ మందిరంలో కొలువు కాబోతున్న రామ్ లల్లా ను దర్శించుకునేందుకు విఐపి టికెట్లను ఉచితంగా అందిస్తామని చెబుతూ మెసేజులు లింకులు పంపిస్తున్నారు.
మెసేజ్ ఓపెన్ చేసారంటే అంతే సంగతి : Harmfull Message Should Not Open
అమాయక ప్రజలను టార్గెట్ చేసుకుని వీరు పంపించే మెసేజుల్లో రామ్ జన్మభూమి గృహసంపర్క్ అభియాన్(Ram janmabhumi Gruhasampark Abhiyan) అని ఉంటుంది. పైగా APK అని లేబుల్ చేసి ఉంటుంది. APKఅంటే ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజీ(Android Aplication package) అని అర్ధం.
ఆతరువాత మరో మెసేజ్ లో ఏమని ఉంటుందంటే రామ్ జన్మభూమి గృహసంపర్క్ అభియాన్ ను ఇన్ స్టాల్ షెసుకోవాలని తద్వారా VIP యాక్సెస్ పొందండి అని ఉంటుంది. పైగా ఈ సందేశాన్ని మరికొంతమందికి షేర్ చేయండి అని సూచిస్తూ జై శ్రీ రామ్ అని ఉంటుంది.
దీంతో ఎప్పటికైనా ప్రమాదమే : Malware Will target You Always
ఆ మెసేజుల్లో చెప్పినట్టు ఫాలో అయితే ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి కూడా చెప్పలేం అంటున్నారు నిపుణులు, పైగా ఇలాంటి మెసేజులతో తమకు ఎలాంటి సంబంధం లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు(State And Central Governments) ఇప్పటికే చెప్పేశాయి.
వీటి వల్ల ఎలాంటి రిస్కుపేస్ చేస్తామనేది అందులో ఉన్న మాల్వేర్(Malware) ను బట్టి ఆధారపడి ఉంటుంది అంటున్నారు. ఇలాంటి ప్రమాదకర APK లతో ఎలాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది అంటే, లాగిన్ వివరాలు, పాస్‌వర్డ్‌లు, క్రెడిట్ కార్డ్ నంబర్లు(CreditCard Numbers), కాంటాక్ట్స్, బ్రౌజింగ్ హిస్టరీ(Browzing History), పర్సనల్ మెసేజెస్ ను ఈ మాల్వేర్ ఈసీగా లాగేస్తుంది.
అంతే కాదు మన మొబైల్, లేదంటే లాప్ టాప్ వంటి వాటిపై నిఘా పెట్టడానికి ఈ మాల్వేర్ ను ఉపయోగించవచ్చు. మన మొబైల్ లోని యాప్ లను క్రాష్ చేయవచ్చు.