రెండవ దశ పార్లమెంట్ ఎలక్షన్స్ కు నోటిఫికేషన్ జారీ – ఎలక్షన్ కమీషన్

mcms 1 రెండవ దశ పార్లమెంట్ ఎలక్షన్స్ కు నోటిఫికేషన్ జారీ - ఎలక్షన్ కమీషన్

రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ 2024 లో జరిగే రెండవ విడత పోలింగ్ కోసం ఎలక్షన్ కమీషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఏప్రిల్ 26 న జరిగే ఓటింగ్ కు సంబందించి రాష్ట్రపతి తరపున ఎలక్షన్ కమీషన్ నోటిఫికేషన్ ను ఈరోజు విడుదల చెయ్యడం జరిగింది. దీనికి సంబందించి రెండో విడత నామినేషన్ ప్రక్రియ ప్రారభం అయ్యింది.

ఈ రెండో విడత పోలింగ్ కు నామేనేషన్ పత్రాలను దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 4 ఆఖరి తేది అని కమీషన్ ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్ మినహాయించి మిగిలిన రాష్ట్రాలు అలాగే కేంద్ర పాలిత ప్రాంతాలు అయితే ఏప్రిల్ 5 న నామినేషన్ పత్రాలను పరిశీలన చెయ్యడం జరుగుతుంది అని కమీషన్ పేర్కొంది. అలాగే ఏప్రిల్ 6 ణ జమ్మూ కాశ్మీర్ లో కుడా పరిశీలన చేస్తామని నోటిఫికేషన్ లో ఎలక్షన్ కమీషన్ తెలిపింది.

అలాగే రెండో దశ లో దేశం లో ఉన్న 12 రాష్ట్రాలు తో పాటు 1 కేంద్ర పాలిత ప్రాంతం లో ఉన్న మొత్తం 88 పార్లమెంట్ స్దానాలకు పోలింగ్ జరుగుతుంది అని కమీషన్ తెలిపింది. ఇక మొదటి విడత లో భాగం గా చూసినట్లయితే మర్చి 20 న నోటిఫికేషన్ జారి చేసినప్పటికీ ఔటర్ మణిపూర్ పార్లమెంట్ నియోజకవర్గం లో కొంత భాగం మాత్రమే రెండవ విడత పోలింగ్ జరగనుందని కమీషన్ తెలిపింది. ఈ నియోజక వర్గ పరిధి లో ఉన్న 15 అసెంబ్లీ స్దానాలకు ఏప్రిల్ 19 న మొదటి విడత పోలింగ్ జరగబోతుండగా మిగిలిన 13 అసెంబ్లీ స్దానలకు మరల ఏప్రిల్ 26 న పోలింగ్ జరుగుతుందని కమీషన్ పేర్కొంది.

ఎన్నికలు జరిగే రాష్ట్రాలు – ఏ ఏ స్దానాలకు పోటి జరిగేది

  • కేరళ – 20 స్దానాలు ,
  • కర్ణాటక – 14 ,
  • మజారాష్ట్ర – 8 ,
  • రాజస్దాన్ – 13 ,
  • బిహార్ – 5 ,
  • మద్య ప్రదేశ్ – 7 అసోం – 5 ,
  • ఉత్తర ప్రదేశ్ – 8 ,
  • జమ్మూ కాశ్మీర్ – 1 ,
  • త్రిపుర – 1 ,
  • మణిపూర్ – 1 ,
  • పశ్చిమ బెంగాల్ – 3 ,
  • చత్తీస్ గడ్ – 3

ఈ నియోజక వర్గాలలో మొదటి విడత పోలింగ్ జరుగుతుందని ఎలక్షన్ కమీషన్ ఒక ప్రకటన విడుదల చేసింది.

Leave a Comment