Second song release from Guntur Karam: గుంటూరు కారం నుండి సెకండ్ సాంగ్ రిలీజ్..ప్రోమో చుస్తే పిచ్చెక్కిపోవాల్సిందే.

Second song release from Guntur Karam.

Second song release from Guntur Karam:గుంటూరు కారం నుండి సెకండ్ సాంగ్ రిలీజ్..ప్రోమో చుస్తే పిచ్చెక్కిపోవాల్సిందే.

మహేష్ బాబు నుండి సినిమా వచ్చి ఏడాది దాటిపోతోంది, 2022 లో పరుశురాం దర్శకత్వంలో వచ్చిన సర్కారు వారి పాట సినిమా తరువాత మహేష్ నుండి చాలానే గ్యాప్ వచ్చింది.

ఇది మహేష్ కావాలని తీసుకున్న గ్యాప్ కాకపోయినా ప్రిన్స్ ఫాన్స్ మాత్రం తెరపై అతన్ని చూడకుండా ఉండలేకపోతున్నారు. అందుకే ఈ మధ్య గుంటూరు కారం సినిమా నుండి ధమ్ మసాలా బిర్యానీ అనే పాటను తెగ ఎంజాయ్ చేశారు.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వస్తున్న ఈ గుంటూరు కారం ఘాటు నషాళానికి ఎక్కాల్సిందే అంటున్నారు సూపర్ స్టార్ ఫాన్స్.

మహేష్ మాసి లుక్ సినిమాపై మరింత క్రేజ్ ను తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో మహేష్ సరసన శ్రీలీల నాయికగా ఆడిపాడుతోంది. అయితే ఇప్పటివరకు శ్రీలీల మహేష్ కెమిస్ట్రీ ఎలా ఉంటుందా అని ఊహల్లోనే ఇమాజినేషన్ చేసుకున్న ఫాన్స్ కి చిత్ర యూనిట్ ఒక సర్ప్రైజ్ ఇవ్వడానికి రెడీ అయింది.

మహేష్ అండ్ శ్రీలీల పై తెరకెక్కించిన ఒక సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు. ఓ బేబీ అంటూ సాగే ఈ సాంగ్ ను ఈనెల 13వ తేదీన విడుదల చేయనున్నారు.

మరి మహేష్ ఫాన్స్ అప్పటివరకు కూడా ఆగలేరనుకుందేమో మూవీ టీమ్, అందుకే ఆ సాంగ్ ప్రోమోను వదిలింది, ప్రస్తుతం ఈ ప్రోమో తెగ హల్చల్ చేస్తోంది.

గుర్తుపెట్టుకో నీకన్నా తోపు ఎవ్వడు లేదు, అంటూ బిజినెస్ మెన్ సినిమాలో మహేష్ బాబు సాంగ్ నడుస్తున్నప్పుడే కొన్ని డైలాగులు చెబుతుంటాడు. ఇప్పుడు కూడా అదే తరహాలో మహేష్ మాటలు ఈ సాంగ్ లో వినిపిస్తున్నాయి. అమ్ము రమణగాడు గుర్తెట్టుకో..

Add a heading 2023 12 12T132351.803 Second song release from Guntur Karam: గుంటూరు కారం నుండి సెకండ్ సాంగ్ రిలీజ్..ప్రోమో చుస్తే పిచ్చెక్కిపోవాల్సిందే.

గుంటూరోస్తే పనికొస్తది అంటూ డైలాగ్ చెబుతాడు. ఈ పాటలోని సాహిత్యాన్ని రామజోగయ్యశాత్రి అందించగా, ఎస్.ఎస్ థమన్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ ప్రోమో చుస్తే ఇది పక్కా మెలోదో సాంగ్ అని అర్ధమవుతోంది. లంగా వోణిలో శ్రీలీలే అదరగొట్టేసింది.

ఇక మహేష్ గురించి ప్రత్యేకించి చెప్పాలా, ఎంత వయసొచ్చినా మహేష్ టాలీవుడ్ ఇండస్ట్రీకి ప్రిన్సే. గతంలో విడుదల చేసిన ధమ్ మసాలా బిర్యానీ అనే సాంగ్ కాపీ ట్యూన్ లా ఉంది

అనే టాక్ వినిపించినా మెల్లగా సినీ జనానికి ఎక్కేసింది. ఆ ఫాస్ట్ బీట్ పాటను మహేష్ ఫాన్స్ మాత్రమే కాదు అందరు ఎంజాయ్ చేస్తున్నారు.

ఇక మహేష్ బాబు త్రివిక్రమ్ జోడి కి వెండి తెరమీద కన్నా బుల్లి తెరమీదే ఎక్కువ ఫాన్స్ ఉన్నారేమో అని చెప్పాలి, ఎందుకంటే వీరి కాంబినేష లో ఇంతకు ముందు వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు థియేటర్ లో సందడి చేయలేకపోయినా టివిలో మాత్రం బాగా హల్చల్ చేశాయి.

ఈ సినిమాలు టివిలో ప్రసారం అయితే ఆడియన్స్ తెగ ఎంజాయ్ చేశారు. మారె ముఖ్యంగా యూట్యూబ్ లో కూడా అతడు, ఖలేజా మూవీ కామెడీ బిట్స్ కట్ చేసి రిలీజ్ చేయగా మిళియన్స్ లో వ్యూస్

సంపాదించుకున్నాయి. 2010 లో ఖలేజా సినిమా విడుదలైంది, మరి ఇప్పుడు చుస్తే 2024 సంక్రాతి టైం కి గుంటూరు కారం విడుదలవుతోంది.

అంటే దాదాపు 13 సంవత్సరాలు దాటిపోయింది మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ సెట్ అవ్వడానికి. వీరి గత చిత్రాల ఫలితం ఎలా ఉన్నా వారి కాంబినేషన్ సినిమా అనగానే ఫాన్స్ లోనే కాక కామన్ ఆడియన్స్ లో కూడా ఒక క్యూరియాసిటీ మొదలైంది. మరి గుంటూరు కారం ఘాటు ఎలా ఉంటుందో తెలియాలంటే 2024 సంక్రాతి వరకు ఎదురుచూడక తప్పదు.

Leave a Comment