సికంద్రాబాద్ రైల్వే స్టేషన్(Secundrabad Railway Station) రూపు రేఖలు మారిపోనున్నాయి, అమృత్ భారత్(Aruth Bharat) పధకం కింద దేశంలోని అనేక రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం(Central Government), రైల్వేశాఖ(Indian Railway)లు ప్రణాళిక రచించాయి.
ఇందులో భాగంగానే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను కూడా అకాల సదుపాయాలు, అధునాతన టెక్నాలజీ తో అభివృద్ధి చేయనున్నారు. పెరుగుతున్న రద్దీ ని దృష్టిలో పెట్టుకుని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో కొత్త నిర్మాణాలు చేపట్టారు.
ఈ నిర్మాణాలకు అభివృద్ధిపనులకు భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) శంకుస్థాపన కూడా చేశారు. మెసర్స్ గిర్ధారిలాల్ కన్‌స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఈ పనులను పూర్తి చేయబోతోంది.
ఈ పనులన్నిటినీ పూర్తి చేసేందుకు 36 నెలల సమయాన్ని పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ సమయం లోగ స్టేషన్ ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తారని అంచనా వేస్తున్నారు. సుమారు 720 కోట్ల రూపాయల వ్యయంతో ఈ నిర్మాణ పనులను చేపట్టినట్టు తెలుస్తోంది.
పరుగులు పెడుతున్న అభివృద్ధి పనులు Development Works Are Running Fastly
స్టేషన్ ముందు భాగంలో ఇప్పటికే టికెట్ బుకింగ్ కేంద్రాన్ని నిర్మించారు. నూతన ఆర్పీఎఫ్ భవనం యొక్క నిర్మాణ కార్యక్రమాలు కూడా దాదాపుగా పూర్తయ్యాయి. ఇక స్టేషన్ కి దక్షిణం వైపున ఉండే భవనాల పునాదుల నిర్మాణం 80 శాతం పూర్తి కాగా, మొదటి బేస్మెంట్ స్లాబ్ పనులు 80 శాతం, రెండవ బేస్మెంట్ స్లాబ్ పనులు 60 శాతం పూర్తయినట్టు రైల్వే అధికారుల ద్వారా తెలుస్తోంది.
రైల్వే స్టేషన్ అలాగే రైల్వే అవసరాల నిమిత్తం ఇప్పటివరకు 11 కేవీ విద్యుత్ స్టేషన్ మాత్రమే ఉంది, కానీ భవిష్యతు అవసరాలను దృష్టిలో పెట్టుకుని 33 కేవీ ఎలక్ట్రిసిటీ స్టేషన్ ను నిర్మించడానికి కూడా ప్లాన్ చేశారు. అంతేకాకుండా స్టేషన్ కి నార్త్ సైడ్ లో మల్టి లెవెల్ కార్ పార్కింగ్ విధానంలో ఆరు అంతస్తుల భవనాన్ని నిర్మించనున్నారు. దీని పునాది పనులు కూడా 50 శాతం పూర్తయ్యాయి.
మొత్తంగా చుస్తే భవిష్యత్తులో సికంద్రాబాద్ రైల్వే స్టేషన్ రూపు రేఖలు పూర్తిగా మారిపోనున్నాయి అని తెలుస్తోంది.