Rashmika emotional post: నా కళ్లతో చూస్తే..రష్మిక ఎమోషనల్ పోస్ట్

Add a heading 2023 12 09T110354.033 Rashmika emotional post: నా కళ్లతో చూస్తే..రష్మిక ఎమోషనల్ పోస్ట్

Rashmika emotional post: నా కళ్లతో చూస్తే..రష్మిక ఎమోషనల్ పోస్ట్.

కన్నడ భామ రష్మిక మందన్నకు ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి వరుస హిట్ లను తన ఖాతాలో వేసుకుంటూ కుర్రాళ్ల హృదయాలను దోచుకుంటోంది.

ఈ భామ నటించిన రీసెంట్ గా విడుదలైన మూవీ యానిమల్ బాక్సాఫీస్ దగ్గర విజయవంతంగా దూసుకెళ్తోంది. ఈ సినిమా డిసెంబర్ 1న వరల్డ్ వైడ్‎గా విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

అయితే ఈ మూవీలో హీరో రణ్‎బీర్ యాక్టింగ్ తో ఇరగదీశాడు అని ప్రశంసల వర్షం కురిపించిన నెటిజన్స్ నటి రష్మిక విషయంలో మాత్రం చాలా నిరాశచెందారని తెలుస్తోంది. ఈ సినిమాలో గీతాంజలి క్యారెక్టర్ గురించి నెటిజన్స్ ఓ రేంజ్‎లో ట్రోలింగ్ చేస్తున్నారు.

అసలు రష్మిక ఈ సినిమా ఎందుకు ఒప్పుకుందంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. మరికొంత మంది రష్మిక నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా రష్మిక తన క్యారెక్టర్ తో పాటు సినిమా షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని విషయాలపై సోషల్ మీడియా వేదికగా కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.

” నా కళ్లతో చూస్తే గీతాంజలి ఎంతో అందమైన అమ్మాయి. ఆమె క్యారెక్టర్ నాకు ఎంతో సంతోషాన్ని అందించింది. ఒక్క మాటలో ఈ పాత్రను వర్ణించాలంటే..ఫ్యామిలీ మొత్తాన్ని కలిపే పవర్‎ఫుల్ క్యారెక్టర్ గీతాంజలిది అని చెబుతాను. ఆమె మనసు ఎంతో స్వచ్ఛమైనది.

ఎంతో ధైర్యవంతురాలు. అయితే గీతాంజలి క్యారెక్టర్‎ను ఎందుకు అలా డిజైన్ చేశారని డైరెక్టర్ సందీప్‎ని చాలా సార్లు అడిగాను. నా క్వశ్చన్స్ కి సందీప్ ఇచ్చిన ఆన్సర్ నాకు ఇంకా గుర్తుంది. ఇది రణ్‎విజయ్-గీతాంజలిల స్టోరీ. వారి ప్రేమ, ఫ్యామిలీ,లైఫ్ అలాగే ఉంటుంది.

అదే వీరి స్వభావం అని అన్నారు. హింస , బాధతో నిండిన ఈ ఫ్యామిలీలో గీతాంజలి శాంతి, ప్రశాంతత, నమ్మకాన్ని తీసుకువచ్చింది. గీతాంజలి ఎప్పుడూ కుటుంబం సంతోషంగా ఉండాలని, సురక్షితంగా ఉండాలని దేవుణ్ణి కోరుకుంటుంది.

ఈ క్రమంలో ఎన్నో ఒడిదుడుకులను తట్టుకుని శిలలా ఆమె నిలబడింది. తమ కుటుంబ క్షేమం కోసం నిలబడే ఎంతో మంది మహిళల్లాంటిదే గీతాంజలి కూడా” అని రష్మిక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది.

ఈ విషయం పక్కన పెడితే తాజాగా రష్మిక ఓ సంచలన రికార్డ్‌ను క్రియేట్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 38 మిలియన్ల ఫాలోవర్స్ ని దక్కించుకుని రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సంఖ్యతో ఈ భామ భారత్‎లోనే అత్యధిక ఇన్‏స్టా ఫాలోవర్స్ కలిగిన నటిగా సెన్సేషన్‎ను క్రియేట్ చేసింది.

రష్మిక సినిమాల విషయంలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో, సోషల్ మీడియాలోనూ అంతే ఉత్సాహంగా ఉంటుంది. ఈ బ్యూటీ తన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలతో పాటు అప్పుడప్పుడు అదిరిపోయే ఫోటో షూట్ పిక్స్ షేర్ చేస్తూ ఫాలోవర్స్‎ని ఖుషి చేస్తుంటుంది. ఈ భామ ఒక్క ఫోటో షేర్ చేసినా అది ఓ రేంజ్ లో వైరల్ అయిపోతుంటుంది.

ఇక ఇండస్ట్రీలో వరుస హిట్లతో దూసుకెళ్తున్న రష్మిక రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచిందని ఈ మధ్య టాక్ బాగా వినిపిస్తోంది. దీనికి సంబంధించిన వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రష్మిక మందన్న ఒక్కో మూవీకీ ఏకంగా 4 కోట్ల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తోందని టాక్.

ఇక రష్మిక ప్రాపర్టీస్ విషయానికి వస్తే ఆమె నికర ఆస్తుల విలువ రూ.64 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ప్రతి నెల రష్మిక ఎంతలేదన్నా 60 లక్షలుకుపైగానే ఆదాయం వస్తుంది. ఈ లెక్కన ఆమె ఏడాది ఆదాయం ఎనిమిది కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది.

ఇక సినిమాల ద్వారా వచ్చిన సంపాదనలో ఆమె అధిక భాగం ప్రాపర్టీస్ పైనే పెట్టుబడి పెట్టిందట. అందుకే ఆమె కేవలం ఐదు సంవత్సరాల్లో హైదరాబాద్, గోవా, ముంబై, కూర్గ్, బెంగుళూరు సిటీల్లో ఓ ఐదు లగ్జరీ అపార్ట్‏మెంట్లను కొనుగోలు చేసిందని సమాచారం.

ప్రస్తుతం రష్మిక తెలుగులో ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్‎తో కలిసి పుష్ప2 చేస్తోంది. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉంది. మరోవైపు రెయిన్ బో అనే చిత్రంలోనూ హీరోయిన్ గా కనిపించనుంది.

దీనితో పాటే ది గర్ల్ ఫ్రెండ్ అనే మూవీని కూడా ఈ భామ సైన్ చేసింది. ఈ మధ్యనే ఈ మూవీ షూటింగ్ కూడా సెట్స్ మీదకు వచ్చింది.

సినిమాలతో పాటు ఐటెమ్ సాంగ్ లోనూ అదరగొట్టేందుకు రెడీ అయ్యింది రష్మిక. మహేష్, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూవీలో ఐటెం సాంగ్ చెయ్యడానికి అమ్మడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్ వినిపిస్తోంది.

Leave a Comment