Seethakka’s journey from Naxalite to minister: నక్సలైట్ నుంచి మంత్రి పదవి దాకా సీతక్క ప్రయాణం..

Seethakka's journey from Naxalite to minister

సీతక్క అసలు పేరు అనసూయ. 15 సంవత్సరాలు మావోయిస్టుగా అజ్ఞాతవాసంలో గడిపిన మాజీ నక్సలేటు నాయకురాలు, ప్రస్తుతం తెలంగాణా అధికార పార్టీలో ముఖ్యనాయకురాలు.
జగ్గన్నపేటలో పుట్టిన సీతక్క ములుగు నియోజకవర్గపు ఎంఎల్ఏ గా పోటీ చేసి గెలిచింది. మంత్రి వర్గంలో ఉన్నత అధికారంలో ఉంది.

నక్సల్ గా ఉన్నపుడు ఈవిడ, గద్దర్, విమలక్క వంటి వారు అన్ని ఊర్లు తిరుగుతూ, జనాల్ని చైతన్యవంతం చేసారు. దోపిడీలు, హింసాకాండలను గురించి నాటకాలు వేస్తూ, పాటలు పాడుతూ ప్రజలకి సమాజంలోని ఘోరాల్ని కళ్ళకు కట్టెలాగా చూపించేవారు.

సమాజంలోని దోపిడీలు, ఘోరాలు, హత్యలు, పాలకుల కిరాతకత్వాన్ని చూడలేక సీతక్క నక్సల్ గా మారింది.
తెలుగుదేశం పార్టీ నుంచి 2004లో నాయకురాలిగా మొదటిసారి పోటీ చేసింది. కానీ కాంగ్రేస్ అభ్యర్థి అయిన పొదెం వీరయ్య చేతిలో ఓడిపోయింది.

అదే వీరయ్యని 2009 లో తెలుగుదేశం మహాకూటమి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచింది.
2004లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ తరపున బరిలోకి దిగి తెరాస అభ్యర్థి అజ్మీరా చందులాల్ చేతిలో ఓడిపోయింది.

ఆ తరువాత 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి అయిన అజ్మీరా చందూలాల్ పైన కాంగ్రేస్ తరపున పోటీ చేసి 22,671 మెజారిటితో గెలిచింది.

2023 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ములుగు నియోజకవర్గం నుంచి గెలిచి ప్రమాణస్వీకారం చేసాడు.
అయితే ఈ రోజు జరిగిన ప్రమాణస్వీకారంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయగా, అతనితో పాటు 11 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేసారు.

అందరు మంత్రుల ప్రమాణం ఒకెత్తయితే, సీతక్క ప్రమాణం మరొకెత్తు.
” పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తూ ..” అంటూ అనగానే లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియం మొత్తం మారుమోగిపోయింది.

మొదటిసరి సీతక్క ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించింది.

Leave a Comment