Senior Heros In Sankanthi Race: సీనియర్ హీరోలు విక్టరీ వెంకటేష్(Venkatesh), కింగ్ నాగార్జున(Nagarjuna) ఇద్దరు కూడా 2022 లో అస్సలు బోణి కొట్టనేలేదు.
వారి తోటి సీనియర్ హీరోలు చిరు(Chiranjeevi) బాలయ్యలు(Balakrishna) 2023 లో చెరో రెండేసి సినిమాలు వదిలారు. కానీ వీరు మాత్రం వెబ్ సిరీస్ లు, రియాలిటీ షోలకే పరిమితం అయ్యారు.
పైపెచ్చు ఈ మధ్య కాలంలో నాగ్ కి సరైన హిట్లు కూడా లేవు. వెంకీ మాత్రం ఓటిటీ వేదికగా వచ్చిన రానా నాయుడు(Rana Naidu) తో హిట్ అందుకున్నారు.
పైగా ప్రేక్షకులను కొత్త వెంకీని చూపెట్టాడు. బూతులు మాట్లాడటం, బూతు సైగలు చేయడంతో వెంకీని చూసి సర్ప్రైజ్అయ్యారు తెలుగు ఆడియన్స్.
“సైంధవ్” వెంకీ 75 – “Saindhav” Venky 75
వెంకీ నారప్ప (Narappa), దృశ్యం 2(Drusyam 2) లతో హిట్టు అందుకున్నా, f 3 ఆయనను నిరాశ పరిచింది. ఇక వెంకీ ఈ సంక్రాంతికి వస్తుండటాన్ని కాస్త స్పెషల్ గానే చెప్పుకోవాలి, ఇది వెంకీకి 75 వ సినిమా సైంధవ్(Saindhav).
దీనిని శైలేష్ కొలను(Sailesh Kolanu) డైరెక్ట్ చేశాడు. నిహారిక బ్యానర్ మీద తెరకెక్కిన ఈ యాక్షన్ త్రిల్లర్ లో వెంకీ మాసీ లుక్ లో అదరగొట్టేస్తున్నాడు.
ఎక్కువగా ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాల్లో కనిపించే వెంకీ చాలా ఏళ్ళ తరవాత యాక్షన్ సినిమా లో కనిపిస్తున్నారు. జనవరి 13వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.
హిట్ పక్కా అంటున్న నాగార్జున : Nagarjuna Confident About Naa Saamiranga
ఇక నాగార్జున(Nagarjuna) విషయానికి వస్తే సోగ్గాడే చిన్నినాయన(Soggade Chinninayana) తో విలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమా తో విపరీతంగా ఆకట్టుకున్న ఈ ముదురు మన్మధుడు, ఇప్పుడు మరో సారి అదే జోనర్ ను ఎంచుకున్నాడు.
పక్కా మాస్ మసాలా సినిమా నా సామి రంగా Naa Saamiranga తో సంక్రాంతి నాటికి ప్రేక్షకులను పలుకరించనున్నాడు. ఇక ఈ సినిమా ను డాన్స్ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ డైరెక్ట్ చేశాడు. ఎం ఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చాడు.
ఈ సినిమాలో ఆషికా రంగనాథ్, అల్లరినరేష్ రాజ్ తరుణ్నా గార్జునకి హిట్లు లేవు కదా అని కొట్టి పారేయలేం, సరైన స్టోరీ గనుక తగిలిందంటే నాగ్ సినిమాకి వచ్చే వసూళ్ల పరంపర మాములుగా ఉండదు. బాక్సాఫీస్ బద్దలై పోతుంది.
ఈ సినిమాను శ్రీనివాస్ చిట్టూరి(Srinivas Chitturi) నిర్మించారు. జనవరి 14వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.