Hot comments of Priyanka and Rahul on Elections: ఎన్నికలపై ప్రియాంక మరియు రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు. పోలింగ్ గురించి ప్రధాని ట్వీట్.
తెలంగాణా మొత్తం ఎన్నికల హడావిడి లోనే ఉంది 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోలింగ్ ఇప్పటికే మొదలయ్యింది.
తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రియాంకా గాందీ మరియు రాహుల్ గాందీ ఇద్దరు ఆసక్తికరమైన ట్వీట్ లు చేశారు, అసలు ఆ ట్వీట్ లో ఏం ఉందో వివరాల్లోకి వెళ్తే.
కాంగ్రెస్ ఏంపి అయిన రాహుల్ గాంధీచేసిన ట్వీట్ లో ”ఈ రోజు దొరల పైన ప్రజలు గెలవబోతున్నారు” అని అత్యంత నమ్మకంగా రాశారు.
”అధిక సంఖ్యలో ఓట్లు వేయండి, తెలంగాణాలో ఆబివృద్ది కొసం కాంగ్రెస్ ని గెలిపించ”మని ట్విటర్ ఎక్స్ వేదికగా ప్రజలను కోరారు.ఇదే విధంగా ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఆమె ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ చేశారు.
ఓటు వేసే ప్రతి ఒక్కరూ బాగా ఆలోచించి పూర్తి ఉత్సాహంతో, శక్తితో ఓటు వేయాలని,
ఓటు వేయడం ప్రజల హక్కు అని,హక్కు మాత్రమే కాదు, ఓటు అనేది అతి పెద్ద బాధ్యత అని మరో సారి గుర్తు చేశారు.
ఓటుకు ఉన్న బలంతో తెలంగాణ కలలని సాకారం చేసి చూపించమని కోరింది.
తెలంగాణాలో జరిగే ఎన్నికల సందర్భంగా, ప్రధాని మోడి ట్వీటర్ ద్వారా ప్రజలకి ఒక సందేశాన్ని పంపించారు, అదేంటంటే.
”తెలంగాణాలో ఉన్న సోదర సోదరిమనులరా పోలింగ్ రికార్డు స్థాయికి చేరుకునే విధంగా ఓట్లు వేసి, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయ”మాని పిలుపునిచ్చారు.
కొత్తగా ఓటు వేసే వారికి ముఖ్యంగా వారి ఓటుని వినియోగించుకోవాలని సందేశాన్ని ఇచ్చారు.