టాలీవుడ్ లో మరో లవ్ స్టోరీ

website 6tvnews template 2024 03 06T114321.904 టాలీవుడ్ లో మరో లవ్ స్టోరీ

Sensational news about nagachaitanya going viral : ప్రేమ.. ఎప్పుడు, ఎక్కడ, ఎలా పుడుతుందో ఎవరూ చెప్పలేరు. అందులోనూ ఒక్కసారే ప్రేమ పుట్టాలని రూలేం లేదు. ఇక సినీ సెలబ్రిటీల విషయంలో ప్రేమలు, పెళ్లిళ్లు పెటాకులు అన్ని కూడా చాలా స్పీడ్ గా జరిగిపోతుంటాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఎన్నో జంటలు అభిప్రాయ భేదాలతో మరో కారణాలతో విడాకులు తీసుకుంటున్నారు.

తమ మనసుకు నచ్చిన వాళ్ళని మళ్లీ ప్రేమిస్తున్నారు. ఇది ఇప్పటి కాలంలో ఉన్న ట్రెండ్ కాదు ఎప్పటినుంచో సినీ తారలు ఫాలో అవుతున్న ట్రెండ్ అని చెప్పాలి. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇలా ఏ ఇండస్ట్రీలో అయినా ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు కామన్ అయిపోయాయి.

అందుకే టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య (Nagachaitanya), సమంత(Samantha) లవ్ మ్యారేజ్ చేసుకున్నా.. పర్సనల్ రీజన్స్ కారణంగా డివోర్స్ తీసుకున్నారు. విడాకులు తర్వాత ఇద్దరూ సింగిల్ గానే ఉంటున్నారు. ఎవరి లైఫ్ వారు లీడ్ చేస్తున్నారు.

అయితే మొన్నటి వరకు టాలీవుడ్ నటి విశాఖ బ్యూటీ శోభిత ధూళిపాల (Sobitha Dhulipalla ) నాగచైతన్య మధ్య ఏదో ఉందని సోషల్ మీడియాలో రూమర్స్ వచ్చాయి. దీనిపై నటులు ఇద్దరూ తమ మధ్య ఏమీ లేదని క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉంటే లేటెస్ట్ గా నాగచైతన్య, సాయి పల్లవి(Saipallavi )లవ్ చేసుకుంటున్నారు అనే రూమర్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

లవ్ స్టోరీ నుంచే కథ మొదలు :

WhatsApp Image 2024 03 06 at 9.59.51 AM టాలీవుడ్ లో మరో లవ్ స్టోరీ

డివోర్స్ తర్వాత నాగచైతన్య(Nagachaitanya ) ఎప్పుడూ సమంత(Samantha) గురించి వారి రిలేషన్ గురించి ఎప్పుడూ పెద్దగా మాట్లాడలేదు. అయితే గత కొంతకాలంగా చైతూ మళ్లీ ప్రేమలో పడ్డాడు అనే వార్తలు ఇండస్ట్రీ లో వినిపిపిస్తున్నాయి.

అది కూడా సహజనటి నేచురల్ బ్యూటీ సాయి పల్లవి( Saipallavi)తో. సాయి పల్లవి కూడా చైతూను లవ్ చేస్తోందని టాక్. నాగ చైతన్య, సాయి పల్లవి ఇద్దరూ కలిసి లవ్ స్టోరీ (Love Story )అనే మూవీ చేశారు. అప్పటినుంచి వీరిద్దరూ రియల్ గా లవ్ లో ఉన్నారని అంటున్నారు. ఇద్దరూ కాస్త కూల్ పర్సన్స్ కావడంతో అందరూ నిజమని భావిస్తున్నారు.

తెలుగులో ఇంత గ్యాప్ ఎందుకంటే :

WhatsApp Image 2024 03 06 at 9.59.50 AM టాలీవుడ్ లో మరో లవ్ స్టోరీ

విరాట పర్వం(Virata Parvam ) సినిమా ప్రమోషన్ టైమ్ లో సాయి పల్లవి(Saipallavi )చేసిన కమెంట్స్ తో తనను కొందరు హిందూ సంఘాల వారు ఆమెను టార్గెట్ చేశారు. అప్పటి నుంచి ఈ బ్యూటీ కి తెలుగులో అవకాశాలు లేవనే వార్తలూ వచ్చాయి. దాదాపు సంవత్సరం పాటు తెలుగులో సాయి పల్లవి ఎలాంటి సినిమాలు సైన్ చేయలేదు.

ఇదే సమయంలో మళ్లీ చాలా గ్యాప్ తర్వాత నాగ చైతన్య (Nagachaitanya )సినిమాలో నటిస్తోంది. చాలామంది చెప్పుకునే మాట ఏమిటంటే ఈ సినిమాలో ఛాన్స్ కి కారణం నాగచైతన్య అని. అందుకే నాగ చైతన్య, సాయి పల్లవి మధ్య సమ్ థింగ్.. సమ్ థింగ్..అని టాక్ వినిపిస్తోంది. ప్రేమనే కాదు త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నార ని టాక్. అయితే కొందరు ఈ వార్త నిజమేనని అంటుంటే, మరికొందరు ఒకే సినిమాలో కలిసి నటిస్తున్నప్పుడు ఇలాంటి రూమర్స్ కామన్ అని కొట్టిపారేస్తున్నారు.

Leave a Comment