Shabarimala income 200Cr: మండలి పూజ లో శబరిమల ఆదాయం-200 కోట్లు.

Add a heading 2023 12 26T174353.674 Shabarimala income 200Cr: మండలి పూజ లో శబరిమల ఆదాయం-200 కోట్లు.

Shabarimala income 200Cr: మండలి పూజ లో శబరిమల ఆదాయం-200 కోట్లు.

దేశ వ్యాప్తంగా అయ్యప్ప స్వామి భక్తులు ఉన్నారు.ఈ సారి 32 లక్షల మంది భక్తులు అయ్యప్పను దర్శించుకున్నారు.

ప్రతి సంవత్సరం భక్తులందరు అయ్యప్ప దీక్షను పూర్తి చేసుకొని, శబరిమల వెళ్లి ఇరుముడలను సమర్పించుకొని వారి స్థలాలకు తిరిగి వెళుతుంటారు.

ఈ నేపథ్యంలోకేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ ఆదాయం ఈ మండల సీజన్​లో 204 కోట్ల రూపాయలు దాటిందని ట్రావెన్​కోర్​ దేవస్థానం బోర్డు (టీడీబీ) తెలిపింది.

ఈ మండల పూజ కోసం ఈ ఏడాది ఆలయం తెరిచినప్పటినుంచి డిసెంబర్​ 25 వరకు(39 రోజుల్లో) 204.30 కోట్ల రూపాయల మేర ఆదాయం సమకూరినట్లు టీడీబీ అధ్యక్షుడు పీఎస్​ ప్రశాంత్​ వెల్లడించారు. కాగా, డిసెంబర్​ 27 తో వార్షిక ఈ మండల పూజ సీజన్​ ముగియనుంది.

మిగిలిన రెండు రోజుల్లో వచ్చే కానుకలను కూడా కలిపితే ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని బోర్డు సభ్యులు తెలిపారు.

శబరిమల యాత్రకు వచ్చే భక్తులు సమర్పించిన 204.30 కోట్ల ఆదాయంలో 63.89 కోట్లరూపాయలను భక్తులు నగదు రూపంలో హుండీలో సమర్పించారు.

మిగిలిన 96.32 కోట్లరూపాయలు మహాప్రసాదం ‘అరవణ ప్రసాదం’ విక్రయాల ద్వారా వచాయంట. అలాగే, భక్తులకు విక్రయించే మరో పవిత్రమైన తీపి ప్రసాదం ‘అప్పం’.దీని అమ్మకాల ద్వారా మరో 12.38 కోట్లరూపాయలు సమకూరాయని అధ్యక్షుడు పీఎస్​ ప్రశాంత్​ ప్రకటించారు.

మరోవైపు, వార్షిక తీర్థయాత్ర సీజన్‌ను పురస్కరించుకొని డిసెంబర్ 25 వరకు 31,43,163 మంది భక్తులు శ్రీ అయ్యప్ప స్వామిని దర్శించుకున్నట్లు రద్దీని ప్రస్తావిస్తూ వివరించారు ‘అన్నదాన మండలం’

కార్యక్రమం ద్వారా డిసెంబర్​ 25 వరకు 7,25,049 మందికి ఉచితంగా ఆహారాన్ని పంపిణీ చేసినట్లు ఆయన చెప్పారు. మండల పూజ సీజన్​ చివరిరోజైన డిసెంబర్​ 27న రాత్రి 11 గంటలకు ఆలయాన్ని మూసేస్తామని టీడీబీ తెలిపింది.

మకరవిళక్కు ఉత్సవం సందర్భంగా తిరిగి డిసెంబర్​ 30న తిరిగి ఆలయాన్ని తెరుస్తామని బోర్డు అధికారులు తెలిపారు. ఇక జనవరి 15న మకరజ్యోతి దర్శనం ఉంటుందని అధికారి ప్రశాంత్​ తెలిపారు.

Leave a Comment