Shah Rukh Khan daughter’s first movie: షారుక్ కూతురు ఫస్ట్ మూవీ ట్రైలర్ చూశారా.

ezgif 5 12d34b5489 Shah Rukh Khan daughter's first movie: షారుక్ కూతురు ఫస్ట్ మూవీ ట్రైలర్ చూశారా.

Shah Rukh Khan daughter’s first movie: షారుక్ కూతురు ఫస్ట్ మూవీ ట్రైలర్ చూశారా.

బాలీవుడ్ బాద్ షా, రొమాంటిక్ హీరోగా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు షారుక్ ఖాన్. ఇప్పుడు బాద్ షా బాటలోనే నడుస్తూ ఆయన పిల్లలు కూడా రంగుల ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు.

ముందుగా షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘ది ఆర్చీస్’.

జోయా అక్తర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది.సుహానా ఖాన్ నటనను అందరూ మెచ్చుకుంటున్నారు. అయితే సుహానా ఖాన్ సినిమా డైరెక్టుగా ఓటీటీలోకి రిలీజవుతోంది. డిసెంబర్ 7న ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో ది ఆర్చీస్ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

షారుఖ్ ఖాన్ కూతురు సునానా ఖాన్ మాత్రమే కాదు, అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందా, శ్రీదేవి రెండో కూతురు ఖుషీ కపూర్ కూడా ‘ది ఆర్చీస్’ సినిమాలో నటించారు.

కాగా ట్రైలర్ ను చూస్తుంటే ఒక స్కూల్లో జరిగే టీనేజ్స్నేహితుల మధ్య జరిగే కథలా ఉంది. ఫ్రెండ్స్ అందరికీ పార్క్ అంటే ఇష్టం. అయితే ఈ బృందంలోని ఒక అమ్మాయి తండ్రి అదే పార్కులో భవనాలను నిర్మించాలని ప్లాన్ చేస్తాడు.

అప్పుడు స్నేహితుల సమూహంలో గొడవులు వస్తాయి. పార్క్ని కాపాడాలని అందరూ అమ్మాయి తండ్రికి వ్యతిరేకంగా పోరాడుతారు. కుటుంబం, స్నేహం, పర్యావరణ ప్రేమ వంటి అంశాలు ఈ ట్రైలర్లో మిళితమై ఉన్నాయి.


కాగా సుహానా ఖాన్ ఇప్పటికే చాలా ఫోటోషూట్స్లోనూ మెరిసింది. కొన్ని ప్రతిష్టాత్మక బ్రాండ్లకు అంబాసిడర్గా వ్యవహరిస్తోంది. ఇప్పుడు మొదటిసారిగా వెండితెరపై మెరవనుంది.

మొదటి సినిమా ‘ది ఆర్చీస్’ విడుదల తర్వాత సుహానకు మరింత క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు.. అలాగే శ్రీదేవి-బోనీ కపూర్ ల కూతురు ఖుషీ కపూర్ కూడా ఈ సినిమాతో మంచి పాపులారిటీ

సంపాదించుకుంటుందంటున్నారు. కాగా ది ఆర్చీస్ సినిమా నెట్ఫ్లిక్స్ ద్వారా 150 దేశాల్లో ప్రసారం కానుంది. దీంతో ఈ స్టార్ కిడ్స్ చాలా ఉత్సాహంగా ఉన్నారు. అదే సమయంలో ఈ సినిమా థియేటర్లలో విడుదలైతే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Leave a Comment