Shaitaan Teaser out : హారర్ సినిమాలకు అంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అందుకే వారి కోసమే ఫిల్మ్ మేకర్స్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో భయపెట్టే హారర్ చిత్రాలను రూపొందిస్తుంటారు. ఇప్పటి వరకు టాలీవుడ్, బాలీవుడ్ లో ఎన్నో హారర్ మూవీస్ వచ్చాయి.
అందులో చాలా వరకు సినిమాలు ప్రేక్షకులను భయపెట్టాయి. కొంత మంది మేకర్స్ ఫుల్ సీరియస్ హారర్ సినిమాలు తీస్తే మరికొంత మంది కామెడీని జోడించి దెయ్యాల సినిమాలు తీశారు. ఏది ఏమైనా దయ్యం కన్సెప్ట్ తో వచ్చే చాలా వరకు సినిమాలు హిట్ అవుతాయన్న ఫార్ములా చాలా సార్లు వర్కౌట్ అయ్యింది.
బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచీ ఈ ఫార్ములానే చాలా మంది డైరెక్టర్లు ఫాలో అవుతున్నారు. మంచి సినిమాలు లేనప్పుడల్లా బాక్సాఫీస్‌లో కొత్త ఉత్సాహాన్ని ఇచ్చేవి ఈ దెయ్యం సినిమాలే.
రోజులు మారుతున్నా.. ఆలోచనా విధానంలో మార్పులు వచ్చినా సినిమా విషయానికి వస్తే అందరూ ప్రేక్షకులే! దయ్యాలు, ఆత్మల చుట్టూ తిరిగే కథలతో హిందీలో చాలా వరకు సినిమాలు వచ్చాయి. తాజాగా వికాస్ భల్ (Vikas Bahl) సరికొత్త థ్రిల్లర్ ను ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నాడు.
బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ (Ajay Devagan), తమిళ స్టార్ హీరో మాధవన్ (Madhavan), నటి జ్యోతిక (Jyothika)ల కలయికతో సైతాన్ (Shaitaan) మూవీ తెరకెక్కింబోతున్నారు. తాజాగా టీజర్ సైతాన్ టీజర్ (Shaitaan Teaser)రిలీజ్ అయ్యింది. హారర్ ప్రియులకు సరికొత్త థ్రిల్ అందిస్తోంది.
Shaitan coming with the concept of black magic : చేతబడి కాన్సెప్ట్‌తో వస్తున్న సైతాన్
అజయ్ దేవగన్ (Ajay Devagan),ఆర్ మాధవన్ (R Madhavan), జ్యోతిక (Jyothika)లు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సైతాన్. క్వీన్ (Queen),సూపర్ 30 (Super 3o) వంటి సినిమాలను డైరెక్ట్ చేసి బాలీవుడ్ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్ వికాస్ భల్ సైతాన్ ను డైరెక్ట్ చేస్తున్నాడు.
ఈ మూవీ మార్చి 08న థియేటర్లలో విడుదల కాబోతోంది. మూవీ రిలీజ్ కు నెల రోజులు సమయం ఉండటంతో ఇప్పటినుంచే ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు మేకర్స్. ఇప్పటికే సైతాన్ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేసింది.
ఈ పిక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలావుంటే తాజాగా మేకర్స్ సైతాన్ టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ హారర్ ప్రియులకు సరికొత్త థ్రిల్ అందిస్తోంది.
ఈ టీజర్ ను బట్టి చేతబడి ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. హాలిడేస్ నిమిత్తం ఓ మారుమూల గ్రామానికి వెళ్లిన ఓ ఫ్యామిలీ ఓ తెలియని వ్యక్తి కారణంగా చిక్కుల్లో పడుతుంది.
అతను ప్రయోగించిన బ్లాక్ మ్యాజిక్ నుంచి ఆ ఫ్యామిలీ ఎలా బయటపడింది అనేది స్టోరీ.
Madhavan’s voice kills : భయపెడుతున్న మాధవన్ వాయిస్
మాధవన్ (R Madhavan)వాయిస్ ఓవర్‌తో టీజర్ ప్రారంభమవుతుంది.“ వారంటారు ప్రపంచం చెవిటిదని. కానీ వారు నా ప్రతి మాటను అనుసరిస్తారు. నేను చీకటిని, నేనే ఆకర్షణను, నేను నరకానికి చెందిన తొమ్మిది సర్కిర్స్ ను పరిపాలిస్తాను.
నేను విషాన్ని ,రెండింటినీ నయం చేస్తున్నాను. భరించిన ప్రతిదానికీ నేను మౌన సాక్షిని. నేనే రాత్రిని, సంధ్యను, నేనే విశ్వాన్ని. నేను సృష్టించగలను, నాశనం చేయగలను , కాబట్టి జాగ్రత్త. నేను ఎవరినీ విడిచిపెట్టను అని వారు అంటున్నారు.
ఒక గేమ్ ఉంది…మీరు ఆడాలనుకుంటున్నారా? దానికి ఒకే ఒక నియమం ఉంది, నేను ఏమి చెప్పినా, మీరు టెంప్ట్ కాకూడదు అంటూ అందరినీ మాధవన్ భయపెట్టేశాడు. ఇక టీజర్ చివర్లో మాధవన్ నవ్వు అజయ్ , జ్యోతికలను భయపెట్టేస్తుంది.
నిజంగా ఈ టీజర్స్ అద్భుతంగా ఉంది. మాధవన్ చెప్పే దయ్యం కవిత వెన్నులో వణుకుపుట్టిస్తుంది. ఆర్ మాధవన్ వాయిస్ , డైలాగ్ డెలివరీ అద్భుతంగా ఉంది. ఆయన భయానక స్వరం వింటుంటే గూస్‌బంమ్స్ వస్తున్నాయంటూ హారర్ ప్రియులు కామెంట్స్ చేస్తున్నారు.