Shanmukh brother cheated me Mounika files a police case : ఫేమస్ యూట్యూబర్, బిగ్‌బాస్ సీజన్ 5 ( Bigg Boss ) రన్నరప్ షణ్ముక్ ( Shanmukh) గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. షార్ట్ ఫిలిమ్స్ కవర్ సాంగ్స్ తో బాగా ఫేమస్ అయ్యాడు షణ్ముఖ్. టెలివిజన్ బిగ్గెస్ట్ షో బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చి మరింత క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు.
సోషల్ మీడియాలో షణ్ముక్ కు ప్రత్యేకమైన ఫ్యాన్ పేజ్ కూడా ఉంది. తన తోటి యూట్యూబ్ దీప్తి ( Deepthi )తో బ్రేకప్ తర్వాత షణ్ముఖ్ తన కెరీర్ పై దృష్టి సారించాడు. అన్న సంపత్ ( Sampath ) తో కలిసి పలు ప్రాజెక్ట్స్ కూడా చేశాడు. ఇంతవరకు బాగానే ఉన్నా ఓ అమ్మాయి ఫిర్యాదుతో షణ్ముఖ్ పేరు ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. షణ్ముఖ్ అతని సోదరుడు నన్ను మోసం చేశారని వైజాగ్‌కు చెందిన డాక్టర్ మౌనిక (Mounika ) ఇచ్చిన ఫిర్యాదుతో షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి.
సోషల్ మీడియాలో సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. అందులోనూ షణ్ముఖ్ ఇంట్లో గంజాయి దొరకటం హాట్ టాపిక్ గా మారింది. ఫిర్యాదుతో అలర్ట్ అయిన పోలీసులు షణ్ముఖ్ ఇంటిని సోదా చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే బాధితురాలు ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలను బయపెట్టింది.
Drugs at Shanmuk Jaswant’s house? షణ్ముక్ జస్వంత్ ఇంట్లో గంజాయి :
యూట్యూబ్ స్టార్ షణ్ముక్ (Shanmukh) సంపత్ ( Sampath ) కేసు సంచలనంగా మారింది. యూట్యూబ్ లో అవకాశం ఇప్పిస్తానని షణ్ముఖ్ అతని సోదరుడు తనను మోసం చేశాడని మౌనిక (Mounika ) అనే బాధితురాలు పోలీసులను ఆశ్రయించి వారిపై ఫిర్యాదు చేసింది.
యువతి ఫిర్యాదుతో షణ్ముఖ్ ఇంట్లో సోదాలు నిర్వహించారు హైదరాబాద్ పోలీసులు. ఈ సోదాలో గంజాయి, డగ్స్‌ను పోలీసులను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అన్నదమ్ములిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని విచారిస్తున్నారు.
Shanmuk’s Brother assaulted me : (షణ్ముక్ సోదరుడు నాపై లైగింక దాడి చేశాడు)
షణ్ముక్ (Shanmukh)సోదరుడు సంపత్ తనని ప్రేమ పేరుతో మోసం చేశాడని మౌనిక (Mounika ) కంప్లైంట్ ఇచ్చింది. అంతే కాదు ప్రేమ పేరుతో సంపత్ తనపై లైగింక దాడి చేశాడని కంప్లైంట్ లో ఆరోపించింది. “నన్ను హోటల్స్, విల్లాలకు తిసుకెళ్లి బెదిరించి బలవంతంగా నా పై చాలా సార్లు లైంగిక దాడి చేశాడు. సంపత్ ను పెళ్లి చేసుకోమని అడిగితే రింగ్ తొడిగి పెండ్లి అయిపోయిందని చెప్పాడు.
అంతేకాదు ఓసారి బలవంతంగా అబార్షన్ చేయించాడు. అబార్షన్ విషయం బయటికి చెప్పొదని షణ్ముఖ్ బెదిరించాడు. సంపత్ ( Sampath ) మరో పెళ్లి చేసుకున్నాడని తెలిసింది. షణ్ముఖ్ దగ్గర గంజాయి, డ్రగ్స్ ఫిల్స్ ఉన్నాయి. ఓ సారి వాళ్ల ఇంటికి వెళ్లినప్పుడు ఇద్దరూ గంజాయి తీసుకుంటున్నారు “అని బాధితురాలు తన ఫిర్యాదులో తెలిపింది.