Sharmila Going To Take Charge As APCC Chief: కడపకు చేరుకున్న షర్మిల – ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు

website 6tvnews template 60 Sharmila Going To Take Charge As APCC Chief: కడపకు చేరుకున్న షర్మిల - ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు

Sharmila Going To Take Charge As APCC Chief: ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్(APCC Chief) గా వై.ఎస్ షర్మిల నియామకం అధికారికంగా ప్రకటించడం అయిన తరువాత తొలిసారి ఆమె కడపకు(Kadapa) బయలుదేరారు.

ప్రత్యేక విమానంలో కడపకు చేరుకున్న తరువాత ఆమె రోడ్డు మార్గంలో కడప నుండి ఇడుపులపాయకు(Idupulapaya) చేరుకుంటారు. అక్కడ తన తండ్రి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి(YS Rajasekhar Reddy) సమాధి అయిన వై.ఎస్ ఘాట్ వద్ద కు చేరుకున్న అనంతరం షర్మిల తన తండ్రికి నివాళి అర్పిస్తారు.

వై.ఎస్ మరణానంతరం షర్మిల కాంగ్రెస్ పార్టీకి చేరువ కావడం ఇది తొలిసారి. వై.ఎస్ అకాల మృత్యువాత పడటం ఆతరువాత ఇప్పటి సీఎం వై.ఎస్ జగన్(YS Jagan) ఆనాడు తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల జగన్ చెల్లి అయిన షర్మిల(Sharmila) అన్న అడుగుల్లోనే నడిచారు.

కానీ ఆమె ఇప్పుడు తన తండ్రికి ఎంతో ఇష్టమైన కాంగ్రెస్ పార్టీలో చేరారు. అందుకే ఆమె తన తండ్రి ఘాట్ వద్దకు చేసుకుని నివాళి అర్పిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఏపీ కాంగ్రెస్ పార్టీ లో కొత్త కళ :

1848863 ys sharmila Sharmila Going To Take Charge As APCC Chief: కడపకు చేరుకున్న షర్మిల - ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు

ఇక షర్మిల వెంట మాజీ మంత్రి రఘువీరారెడ్డి(Raghuveera Reddy) , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు(KVP Ramachandra Rao) ఉన్నారు.

షర్మిల జనవరి 20వ తేదీన ఇడుపులపాయలోని బస చేస్తారని తెలుస్తోంది. 21వ తేదీన ఆమె విజయవాడకు(Vijayawada) వెళ్లి ఏపీసీసీ(APCC) చీఫ్ గా బాధ్యతలు స్వీకరించనున్నారట. ఇక షర్మిల కడప ఎయిర్ పోర్ట్(Kadapa Airport) కి వస్తున్నారన్న విషయం తెలియడంతో కాంగ్రెస్ పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో విమానాశ్రయానికి చేరుకున్నట్టు సమాచారం.

అంతే కాకుండా షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీకి కొత్త జీవం వచ్చినట్లయింది. ఆ పార్టీలోకి వలసలు వచ్చే అవకాశాలు లేవనుకుంటే పొరపాటే అని అంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు.

అటు వైసీపీ(YCP) అంటే గిట్టని వారు, ఇటు టీడీపీ(TDP) ని బండబూతులు తిట్టడంతో అక్కడ గేట్లు మూసుకుపోయి ఎటు వెళ్ళాలో తెలియక నడి బజారులో ఉన్నవారికి ఏపీ(AP) లో కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం అవుతుందని అంచనా వేస్తున్నారు.

Leave a Comment