Shiva Raj kumar role in Game Changer: చరణ్ సినిమాలో రానున్న శివరాజ్.

Shivraj to appear in Charan's film.

Shiva Raj kumar role in Game Changer: శివ రాజ్ కుమార్ (Shiva Raj Kumar)..కన్నడ ఇండస్ట్రీలో బిజీ స్టార్. స్క్రీన్ మీద ఈయన కనిపిస్తే ప్రేక్షకులకు పూనకాలు రావాల్సిందే. అంతటి క్రేజ్ శివ రాజ్ కుమార్ సొంతం.

ఈయన్ను కన్నడ ప్రజలు ముద్దుగా శివన్నా అని పిలుస్తారు. ఈ మధ్యనే తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajanikanth)నటించిన ‘జైలర్’ (Jailer) మూవీలో క్యామియో రోల్ పోషించారు.

ఈ మూవీతో శివన్నకు క్రేజ్ బాగా పెరిగింది. ఇతర భాషల ఫిల్మ్ మేకర్స్ శివన్న కావాలంటూ డిమాండ్ చేస్తున్నారట. తమ సినిమాల్లో కీలక పాత్రల్లో తీసుకోవడానికి క్యూలు కడుతున్నారట.

ఇప్పటికే తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush)తో ఓ మూవీ చేశారు శివన్న. ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)తో శివ రాజ్ కుమార్ ఓ మూవీ చేయబోతున్నారని టాలీవుడ్ లో న్యూస్ వైరల్ అవుతోంది.

రామ్ చరణ్, ఉప్పెన (Uppena) ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు (Buchhi Babu)కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో శివన్న స్పెషల్ రోల్ పోషిస్తున్నారని న్యూస్ స్ప్రెడ్ అయ్యింది.

1298576 ghost Shiva Raj kumar role in Game Changer: చరణ్ సినిమాలో రానున్న శివరాజ్.

తాజాగా ఈ విషయంపై కన్నడ స్టార్ క్లారిటీ ఇచ్చారు. దీంతో మెగా పవర్ స్టార్ అభిమానులు ఆనందానికి అవధులు లేవు. మెగా ఫ్యాన్స్ , శివన్న అభిమానులు నెట్టింట్లో చరణ్, RC 16, శివన్న ట్యాగ్స్ ని వైరల్ చేస్తున్నారు.

Siva Rajkumar in RC 16 : ఆర్సి 16లో శివ రాజ్ కుమార్

శాండల్ వుడ్ (Sandalwood)లో ఎంత పేరున్నా నటుడు శివ రాజ్ కుమార్ (Shiva Raj Kumar). నటనలో సుదీర్ఘమైన అనుభవం ఉన్నా శివన్నా ఇప్పటి వరకు బయట భాషల్లో నటించలేదు.

జైలర్ లో నరసింహగా గెస్ట్ రోల్ లో కనిపించి ఆయన రేంజ్ ఏంటో ప్రేక్షకులకు చూపించారు. శివన్న అంతకు ముందు బాలకృష్ణ (Balakrishna)

Shiva Rajkumar 1068x601 1 Shiva Raj kumar role in Game Changer: చరణ్ సినిమాలో రానున్న శివరాజ్.

నటించిన హిస్టారికల్ మూవీ గౌతమీపుత్ర శాతకర్ణి (Gowthami Putra Shatakarni)లో ఓ బుర్రకథ పాటలో డ్యాన్స్ చేశారు. కానీ అది పెద్దగా ప్రేక్షకుల్లో రిజిస్టర్ కాలేదు.

ఇప్పుడు లేటెస్టుగా ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ (Captain Miller)లో ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నారు శివన్న.

ఈ సినిమా రిలీజ్ దగ్గర పడటంతో చెన్నైలోనే ప్రమోషన్ల కోసం మకాం వేశారు. దీంతో పబ్లిసిటీలోనూ ఈయన చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు.

ప్రమోషన్లో భాగంగా చేసిన ఇంటర్వ్యూలో ఆర్సి 16లో ఉన్నానని చెప్పారు. అయితే ఆయన ఎలాంటి రోల్ చేస్తున్నారన్న విషయాన్ని మాత్రం వెల్లడించాలు. ఆ విషయాన్ని సీక్రెట్ గానే ఉంచారు.

Chiranjeevi Close connection with Shivanna family: చిరు ఫ్యామిలీతో సన్నిహిత్యం

రాజ్ కుమార్ (Rajkumar)ఫ్యామిలీతో చిరంజీవికి దగ్గరి అనుబంధం ఉన్నా ఆయనతో ఆయన కుటుంబానికి చెందిన నటులతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోలేకపోయారు.

5e63456ec6d52e7a107842697d0c69d6 Shiva Raj kumar role in Game Changer: చరణ్ సినిమాలో రానున్న శివరాజ్.

ఇప్పుడు ఆ ఛాన్స్ రామ్ చరణ్ రూపంలో వచ్చింది. దీంతో చిరు లోటుని తీర్చినట్లవుతుంది. ప్రస్తుతం బుచ్చిబాబు మూవీ స్క్రిప్ట్ వర్క్ ఫైనల్ స్టేజ్ లో ఉంది.

ప్రస్తుతం చరణ్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న గేమ్ ఛేంజర్ (Game Changer)మూవీ షూటింగ్‎లో బిజీగా ఉన్నాడు. ఈ షూట్ పూర్తి కాగానే చరణ్ 16ని వేసవి నుంచి స్టార్ట్ చేయాలని బుచ్చిబాబు గట్టి సంకల్పంతో ఉన్నాడు.

పల్లెటూరి నేపథ్యంతో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ ఉంటుందని టాక్ వినిపిస్తోంది. అంతే కాదు చరణ్ ఈ మూవీలో ద్విపాత్రాభినయం చేస్తున్నాడని సమాచారం.

Leave a Comment