BIGG BOSS 7 Telugu: శోభా శెట్టికి శివాజీ గట్టి వార్నింగ్ !
బిగ్ బాస్ సీజన్ 7 లో మొదటి వారం నుంచి గొడవలు పడుతూనే ఉన్నారు. బిగ్ బాస్ హౌస్ లో గొడవలు పడటం చాలా సర్వసాధారణం.అయితే ఈ మధ్యలో బిగ్ బాస్ హౌస్ అంతా రెండుగా చీలిపోయింది. బిగ్ బాస్ చేసిన ప్రకారం ” స్పా ” బ్యాచ్ మరియు ” స్పై ” బ్యాచ్ గా మారారు
ఈ రెండు బ్యాచ్ లకు చాలా రోజులుగా గొడవలు పడుతూనే ఉన్నారు.బిగ్ బాస్ ఫన్ టాస్క్ లు ఇచ్చినప్పటికీ హౌస్ మేట్స్ అవి కూడా సీరియస్ గా తీసుకొని గొడవలు పడుతూనే ఉన్నారు.
ఇంతకు ముందు ఎపిసోడ్ లలో అమర్ దీప్, ప్రశాంత్ ల మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ గొడవ కాస్త సర్దుమణిగే లోపే మళ్ళి మరో గొడవ మొదలైంది. తాజాగా విడుదల అయిన ప్రోమోని చూస్తే శివాజీ, శోభా ల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం జరిగింది.
ఓటు అప్పీలు కోసం బాల్స్ టాస్క్ లు ఆడుతున్నారు. ఈ టాస్క్ లో మొదట శోభా శెట్టికి యావర్ కి గొడవ జరిగింది. తరువాతి రౌండ్ లో అమర్ కి ప్రశాంత్ లకి గొడవ జరిగింది. ఇక ముచ్చటగా మూడో రౌండ్ లో శివాజీ, శోభల మధ్య గొడవ జరిగింది.
మూడో రౌండ్ లో ప్రియాంక, అర్జున్, శివాజీ ఆడుతుంటే శోభా సంచలకురాలైనప్పటికీ ప్రియాంకని ఎంకరేజ్ చేస్తూ బాగా ఆడు అంటూ ప్రియాంకకి సపోర్ట్ చేసింది. ఇదంతా చూసిన శివాజీకి బాగా కోపం వచ్చింది. ” నేను ఆడనయ్యా, వద్దయ్యా ” అంటూ ఆట నుంచి వెళ్ళిపోయాడు.
ఎందుకని యావర్ అడుగగా, శివాజీ సమాధానమిస్తూ , ఆమె ప్రియాంకకే సపోర్ట్ చేస్తుంది అంటే శోభా శెట్టి వచ్చి “మేము ఆడవాళ్ళం కదా ” అని అన్నది. అది చూసి “నేను అవుట్ బయటకు వచ్చేసాను ” అని అన్నాడు.
ఇదంతా చూస్తున్న శోభా శెట్టి ” నా ఇష్టం, నా సపోర్ట్ ఎవరికైనా చేస్తా ” అని అంది. ” సంచలకురాలిగా ఉన్నప్పుడా?” అని ఎదురు ప్రశ్నించాడు శివాజీ. ” సంచాలక్ అయినా సరే, శోభా అయినా సరే అది నా ఇష్టం” అని అన్నది.
” అందుకే బయటకు వచ్చేసాను ” అని శివాజీ అన్నాడు.ఈ ధోరణిలో సాగుతున్న వారి మాటలు కొనసాగుతూ, మాటా మాటా పెరుగుతూ పోయింది. ఓపిక నశించిన శివాజీ ”
డపిల్ల అని అడ్వాంటేజ్ తీసుకోకు అది మంచిది కాదు” అని అన్నాడు శివాజీ. వెటకారంగా మరో మాట అంటూనే శోభా అక్కడి నుంచి వెళ్లిపోయింది.