CM KCR: కామారెడ్డిలో కేసీఆర్ కు షాక్ – 100కి పైగా నామినేషన్లతో పౌల్ట్రీ రైతులు

Add a heading 17 CM KCR: కామారెడ్డిలో కేసీఆర్ కు షాక్ - 100కి పైగా నామినేషన్లతో పౌల్ట్రీ రైతులు

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ప్రధాన పార్టీలు తమ తమ అభ్యర్థులను ప్రకటించేసాయి. అందరికన్నా ముందే అభ్యర్థులను ప్రకటించడంతో బీ.ఆర్.ఎస్ నేతలు ప్రచారంలో జోరుగా ముందుకెళుతున్నారు.

ఇక వివిధ పార్టీల్లో సీట్లు దక్కని వారు రెబెల్స్ గా బరిలో దిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటూ ఉండగా, ఇండిపెండెంట్లు కూడా తమ తమ కార్యాచరణ రూపొందించుకుంటూ ఉన్నారు. ఏది ఏమైనా అన్ని పార్టీల వారికి ఇవాళ నుండి అసలు హడావుడి మొదలవుతుంది.

ఎందుకంటే నవంబర్ మూడవ తేదీ నుండే నామినేషన్ల ప్రక్రియ షురూ అవుతుంది. నామినేషన్లు అనే మాట వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక విషయాన్నీ పంచుకోవాలి. రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ కు ప్రస్తుతం నామినేషన్ల తలనొప్పి పట్టుకుంది, అదేమిటి గులాబీ బాస్ కి నామినేషన్లతో ఇబ్బందా అనుకుంటున్నారా ? అవును ఇది ముమ్మాటికీ నిజం.

ఆయన పోటీ చేస్తున్న కామారెడ్డి నియోజకవర్గంలోనే ఈ తలనొప్పి మొదలైంది. కామారెడ్డి లో మొన్నటివరకు కామారెడ్డి మాస్టర్ ప్లాన్ బాధిత రైతులు 100 నామినేషన్లు దాఖలు చేస్తామని హెచ్చరించారు.

తమకు న్యాయం చేయకపోతే కేసీఆర్ కు పోటీగా బరిలోకి దిగడం ఖాయమన్నారు. వారిని పిలిపించుకుని మాట్లాడిన కేటీఆర్, కేసీఆర్ లు వారిని బుజ్జగించి వారి డిమాండ్లకు ఒకే కూడా చెప్పారు.

ఇక తాజాగా కేసీఆర్‌పై పోటీ చేసేందుకు 100 మంది పౌల్ట్రీ రైతులు నామినేషన్ వేయనున్నట్టు ప్రకటించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో పౌల్ట్రీ రైతుల అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గురువారం జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్‌పై 100 మంది పోటీ చేయాలనుకుటున్నట్టు పేర్కొన్నారు.

కాయితీ లంబాడీలు కూడా కేసీఆర్‌పై 1,016 నామినేషన్లు వేస్తామని ఇప్పటికే ప్రకటించేశారు. భారీ సంఖ్యలో అభ్యర్థులు బరిలో నిలిస్తే అది గట్టి ప్రభావాన్నే చూపెడుతుంది. ఇదే తరహాలో ఒకప్పుడు కవిత ఓటమిని చవిశుశారు. ఆమె పోటీ చేసిన నిజామాబాద్ స్థానంలో ఆమెపై పసుపు రైతులు 1000 నామినేషన్లు వేశారు. 

Leave a Comment