
Bus Accident : మృత్యు శకటంలా మారిన బస్సు..ముగ్గురు ప్రాణాలు బలితీసుకున్న ఏపీఎస్ ఆర్టీసీ బస్సు..నిర్లక్ష్యం అధికారులదా డ్రైవర్లదా..
ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడ నగరంలో ఉన్న పండిట్ నెహ్రు బస్ స్టాండ్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మృత్యు శకటంలా మారిన ఆర్టీసీ బస్సు ముగ్గురు ప్రాణాలను హరించి వేసింది.
దుర్ఘటనకు ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యమే కారణం అనే వాదనలు వినిపిస్తున్నాయి. పూర్తి స్థాయి శిక్షణ ఇవ్వకుండానే డ్రైవర్ చేతికి ఆటోట్రాన్స్‌మిషన్ బస్సును అప్పగించడం కారణమనే వాదనలు ఒక వైపు వినిపిస్తుండగా, మరోవైపు బస్సులో ఎక్స్‌లేటర్ స్తంభించడం కూడా కారమని తెలుస్తోంది.
ఇటువంటి సమస్యలపై డ్రైవర్లు అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదనే మాటలు వినిపిస్తున్నాయి.
ఇక తీరా ప్రమాదం జరిగిపోయాక వాస్తవాలను కప్పిపుచ్చే క్రమంలో డ్రైవర్లను ప్రమాదాలకు కారణభూతులుగా చూపెడుతూ వారిని బలిచేయాలనే కుట్ర జరుగుతున్నట్టు ఏర్పాట్లు జరుగుతున్నాయట.
పైగా డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్టు నివేదికలు కూడా సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది.