షాకింగ్ డెసిషన్ – పంజాగుట్ట పీఎస్ సిబ్బంది మొత్తం బదిలీ : Shocking decision – Transfer of entire Panjagutta PS staff

website 6tvnews template 2024 01 31T161637.322 షాకింగ్ డెసిషన్ - పంజాగుట్ట పీఎస్ సిబ్బంది మొత్తం బదిలీ : Shocking decision - Transfer of entire Panjagutta PS staff

హైదరాబాద్9Hyderabad) సిటీ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తీసుకున్న ఒక నిర్ణయం ప్రతుతం హాట్ టాపిక్ గా మారింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్(Panjagutta Police Station) లోని సిబ్బందిని మొత్తాన్ని కూడా ట్రాన్స్ఫర్ చేస్తూ డెసిషన్ తీసుకున్నారు.

ఎస్ఐల నుంచి హోంగార్డుల వరకు య్యే ఒక్కరికి ఈ బదిలీ లో మినహాయింపు దొరకలేదు. మొత్తం 85 మందిని బదిలీ చేసినట్టు తెలుస్తోంది.

ఇక బదిలీ అయిన సిబ్బంది మొత్తానికి కూడా సిటీ ఆర్మ్ డ్ రిజర్వు ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలనీ సూచనలందాయట. ఇక ఈ సిబ్బంది స్థానంలో కొత్తవారిని నియమించేశారట.

వరుస ఘటనల పరిణామమే : It is the result of a series of events

రాష్ట్రం మొత్తం కూడా షాక్ అయ్యేలా ఈ డెసిషన్ తీసుకోవడానికి సెపెరేట్ రీజన్ ఉందని అంటున్నారు. అదేమిటంటే ఇటీవలి కాలంలో పంజాగుట్ట పీఎస్ లో చోటుచేసుకున్న పరిణామాలేనని అంటున్నారు.

హైదరాబాద్ మెయిన్ సెంటర్ లో ఉన్న ఇదే పీఎస్ లో అక్రమాలు కూడా చోటుచేసుకున్నట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా ఉన్నాయి. పైగా ఒక మాజీ ఎమ్మెల్యే కుమారుడి కార్ ప్రమాదం కేసులో కూడా విమర్శలకు తావివ్వడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు.

పైగా వరుసగా ఇటువంటి ఆరోపణలు విపరీత పరిణామాలు అన్ని కూడా ఒకే పీఎస్ లో జరగడం పై సీపీ ఒకింత ఆగ్రహాన్ని కూడా వ్యక్త పరిచినట్టు తెలుస్తోంది.

Leave a Comment