Shocking news for students going to Canada: కెనడా వెళ్లే విద్యార్థులకు షాకింగ్ న్యూస్.. డిపాజిట్ ఎమౌంట్ ఎంతో తెలుసా.
విదేశాల్లో చదువుకోవాలని, అక్కడ చదువుకుంటే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, లేదంటే విదేశాల్లోనే చదువుకుని అక్కడే ఉద్యోగం తెచ్చుకుని సెటిల్ అవ్వాలని అనుకుంటారు.
అందుకే ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఏక్కి విదేశాలకు వెళ్లేందుకు నానా తంటాలు పడుతూ ఉంటారు. ఇక అక్కడికి వెళ్లే వారు పాస్పోర్ట్, వీసా కోసం ఎన్ని అవస్థలు పడుతూ ఉంటారో మనం చూస్తూనే ఉన్నాం. విదేశాలకు వెళ్ళేవారిలో కొంత మంది ఒక దేశాన్ని నిర్దేశించుకుని అక్కడికే వెళ్లాలని అనుకుంటూ ఉంటారు.
కొంతమంది ఏ దేశానికి త్వరగా వీసా అందుతుందో ఆ దేశానికి రెక్కలు కట్టుకుని ఎగిరిపోవాలని చూస్తూ ఉంటారు. అయితే కేనా వెళ్లి చదువుకోవాలని, అక్కడ ఉద్యోగం చేసి సంపాదించుకోవాలని అనుకునే వారికి మాత్రం ఇది ఒక చేదు వార్తే అని చెప్పాలి.
పై చదువులు చదువుకుందామని కెనడా వెళ్లదలచిన విద్యార్థులకు అక్కడి ప్రభుత్వం పిడుగులాంటి వార్తా చెప్పింది. స్టడీ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకునే స్టూడెంట్స్ ఆర్థిక సంసిద్ధతను పెంచేందుకు ఒక డెసిషన్ తీసుకుంది కెనడా సర్కారు. స్టూడెంట్ డిపాజిట్‌ను అమాంతం పెంచేస్తూ ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
కెనడా వెళ్లే విద్యార్థులు స్టూడెంట్ డిపాజిట్ క్రింద ఇప్పటి వరకు 10,000 డాలర్ల కడుతున్నారు. అయితే కెనడా గవర్నమెంట్ దానిని ఒక్కసారిగా డబుల్ చేసేసింది. ఇప్పుడు కెనడా వెళ్లి పై చదువులు చదవాలి అనుకునే వారు 20 వేల 635 డాలర్లు రెడీ చేసుకోవాల్సిందే.
అయితే కెనడా ప్రభుత్వం ఈ స్టూడెంట్ అమౌంట్ డిపాజిట్ ను కొన్నేళ్ల నుండి మార్చలేదు, కానీ ఉన్నపళంగా మార్చేసింది. మార్చడమే కాకుండా రెండింతలు చేస్తూ పెద్ద నిర్ణయమే తీసుకుంది. అయితే తొలి ఏడాది ట్యూషన్ ఫీజు ప్రయాణ ఖర్చులకు ఇది అదనంగా ఉండనుంది.
ఆ రెండు కాకుండానే 20,635 డాలర్లు డిపాజిట్ చేసుకోవడానికి రెడీ చేసుకోవాలి కెనడా వెళ్లే విద్యార్థులు. అయితే ఈ బంపరాఫర్ కొత్త సంవత్సరం నుండి అంటే 2024 జనవరి 1 నుండి అమల్లోకి వస్తుంది.
జనవరి 1 తరవాత నుండి ఎవరైతే కెనడా వీసాకి అప్లయ్ చేసుకుంటారో వారు డిపాజిట్ అమౌంట్ కింద రెండింతలు రెడీ చేసుకోక తప్పదు. ఈ విషయాన్ని కెనడా ఇమ్మిగ్రేషన్ విభాగం స్వయంగా ప్రకటించింది.
అయితే కేనడా ప్రభుత్వం సడన్ డెసిషన్ తీసుకుందని చూసేవారు అనుకుంటారు కానీ కెనడా ప్రభుత్వం మాత్రం ఈ నిర్ణయాన్ని సమర్ధించుకుంటోంది. కెనడాలో జీవన వ్యయం విషయంలో అంతర్జాతీయ విద్యార్థులు పలు సవాళ్లను ఎదుర్కొంటున్నారని, కొన్ని అధ్యయనాల ద్వారా అక్కడి ప్రభుత్వం కనుగొందట, అందుకే జీవన వ్యయ పరిమితిని సవరిస్తున్నట్టు పేర్కొంది.
కెనడా కి వచ్చే కొత్త విద్యార్థులు కూడా డిపాజిట్ మొత్తాన్ని పెంచడం ద్వారా అక్కడి పరిస్థితులను అర్ధం చేసుకుంటారని భావిస్తోంది. కెనడాకు వచ్చే విద్యార్థుల వసతి కల్పన, వారి అవసరాలకు తగిన మార్గాలను కూడా వారు అన్వేషిస్తున్నట్టు చెబుతున్నారు.
అధిక మొత్తంలో డిపాజిట్ ఉండటం వల్ల కెనడాకు వచ్చే విద్యార్థులు ఆర్ధిక బలహీనత కారణంగా ఎవరి చేతుల్లోనూ దోపిడీకి గురికాకుండా ఉంటారని చెబుతున్నారు.
కాంపస్ బయట వారానికి 20 గంటల కంటే ఎక్కువ సమయం పనిచేసుకునే వెసులుబాటు కల్పిస్తూ కెనడా గవర్నమెంట్ ఒక రూల్ ను పాస్ చేసింది, దానిని 2024 ఏపియల్ 30 వరకు కొనసాగిస్తామని పేర్కొంది.
అయితే ఇది మాత్రం ఇప్పటికే కెనడాలో ఉన్నవారికి, అలాగే డిసెంబర్ 7వ తేదీ నాటికి వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వారికే ఇది వర్తిస్తుందట.