
Shocking Revanth slipped his mouth – video goes viral నోరు జారిన రేవంత్ – వీడియో వైరల్
ఎన్నికల సమయంలో నాయకులు నిజంగా ఆచితూచి మాట్లాడాలి, లేదంటే అవి విపత్కర విపరీత పరిస్తతులకు దారి తీస్తాయి, ఎన్నికల్లో రిజల్ట్ తారుమారయ్యి అధికారంలో ఉన్న వారిని ప్రతిపక్షంలో కూర్చోబెడుతుంది, అసలే ప్రతిపక్షంలో ఉన్నారంటే వారిని అదఃపాతాళానికి నెట్టేస్తుంది.
అందుకే ఎన్నికల వేళ నేతల నాలుక అదుపులో ఉండాలి అంటారు. దీనికి మనం ప్రక్క రాష్ట్రంలో ఉన్న లోకేష్ ని ఉదాహరణగా తీసుకోవచ్చు. తెలుగు మీద పట్టు లేకపోవడం వల్ల ప్రజా సభల్లో అతని తప్పులను ఆసరాగా తీసుకున్న ప్రత్యర్థి వైసీపీ, ఆయనకు పప్పు అని ముద్ర వేసింది.
అయితే ఆముద్రను ఆయన చెరిపివేసుకోవడానికి, తాను పప్పు కాదు, నిప్పు అని చాటిచెప్పుకోవడానికి ఐదేళ్లు సమాయం పట్టింది. అయితే లోకేష్ తెలుగు మాట్లాడటంలో తడబడితేనే రిజల్ట్ ఆలా ఉందంటే, కావాలని మాట్లాడిన వారికి ప్రజల ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో చూడాలి.
ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోలో రేవంత్ రెడ్డి టివి ఇంటర్వ్యూ లో పాల్గొన్నట్టు అర్ధం అవుతోంది. అందులో యాంకర్ రేవంత్ ను ప్రశ్న అడిగింది, రాహుల్ గాంధీ ఓయూ లోకి వస్తాను అంటే విద్యార్థులు ఎందుకు వ్యతిరేకించారని, అందుకు సమాధానం ఇస్తూ రేవంత్ కొంత దురుసుగా మాట్లాడారు. ఓయూ విద్యార్థులకు చిల్లర ఖర్చులు ఉంటాయని, ఆ ఖర్చులకు కేసీఆర్ కొంత డబ్బు ఇచ్చి ఉంటాడని అన్నారు.
ఆ డబ్బులతో పక్కనే ఉన్న తార్నాకలో బార్‌లకు వెళ్లి బీరు తాగి, బిర్యానీ తిని అది అరిగేవరకు ఓయూ కి వచ్చి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మాట్లాడుంటారు అని సమాధానమిచ్చారు. అంతటితో ఆగని రేవంత్ రెడ్డి ఇంకా ఘాటు విమర్శలే చేశారు. ఓయూ విద్యార్థులు అడ్డమీద కొలీలవంటివారని వారికంటూ ఒక సిదంతం ఏమి ఉండదని అన్నారు. వాళ్లకుంటూ తెలంగాణ మీద గౌరవం ఏమీ లేదన్నారు.
ఈ ఇంటర్వ్యూ గతంలో ఎప్పడో చేసిందే అయినప్పటికీ ఎన్నికల వేడి రాజుకుంటున్న సమయంలో కొంతమంది దీనిని వైరల్ చేసి మరో మారు ఓయూ విద్యార్థులను రెచ్చగొట్టే లా చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఓయూ విద్యార్థులపై కొంచెం కూడా మంచి అభిప్రాయం లేని వారికి.. ఈ ఎన్నికల్లో తగిన శాస్తి జరుగుతుందంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు.