Sruthi Haasan: పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన శృతిహాసన్.

Shruti Haasan gave clarity on marriage.

Sruthi Haasan: పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన శృతిహాసన్.

మామూలుగానే ఇద్దరు వ్యక్తులు సన్నిహితంగా ఉంటే వారి చుట్టూ ఎన్నో పుకార్లు మొదలవుతాయి. ఇక సెలెబ్రెటీస్ అయితే చెప్పనవసరమే లేదు.

అటువంటి పుకార్లపైన కొంతమంది క్లారిటీ ఇస్తే, మరికొంతమంది అస్సలు పట్టించుకోరు.
ఇటీవల శృతిహాసన్ పైన కూడా ఒక పుకారు చక్కర్లు కొడుతుంది. అదేంటంటే, శృతి హాసన్ రహస్యంగా పెళ్లి చేసుకుంది అని.

ఈ పుకారుకి మూల కారణం :

ఇటీవల ఓర్రీ రెడ్డిట్‌లో నన్ను ఏదైనా అడగండి అనే సెషన్‌ను నిర్వహించాడు. ఆ సెషన్ లో సోషల్ మీడియా వినియోగదారులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చాడు.

ఆ క్రమలోనే ఒక వ్యక్తి ఒక ప్రశ్న అడిగాడు “హాయ్ ఓర్రీ, ఫోటో కోసం పోజులిచ్చేటప్పుడు మీతో అనవసరమైన వైఖరిని ప్రదర్శించిన సెలబ్రిటీ ఎవరైనా ఉన్నారా?? మీరు పేరు తీసుకోలేకపోతే కేవలం సూచనలు ఇవ్వండి అని.

ఈ ప్రశ్నకు ఓర్రీ స్పందిస్తూ, “శృతి హాసన్. నేనెప్పుడూ ఆమెను ఫోటో కోసం అడగలేదు, కానీ ఆమెను నేను ప్రవేశపెట్టిన ఒక షో లో ఆమె నాతో చాలా అసభ్యంగా ప్రవర్తించింది, నాకు చాలా బాధగా అనిపించింది.

కానీ నేను ఎప్పుడు ఆమె భర్తతో మంచిగానే ఉన్నాను, బహుశా ఇది అపార్థం కావచ్చు కానీ నన్ను ఆమె ఒక స్పాట్ బాయ్ లేదా ప్యూన్ అని పిలిచిందని నేను విన్నాను” అని రాశాడు.
దీనిలో శృతిహాసన్ భర్త అని అనడం వల్ల ఆ వార్త దావాణలం లా వ్యాపించింది.

శృతిహాసన్ స్పందన :

తనపై వస్తున్న పుకార్ల పైన స్పందిస్తూ, తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో శృతి ఇలా రాసింది, “కాబట్టి, నాకు పెళ్లి కాలేదు. ప్రతి విషయం గురించి బహిరంగంగా చెప్పే వ్యక్తి కోసం, నేను దీన్ని ఎందుకు దాచాను? LOL. కాబట్టి నన్ను అస్సలు తెలియని వ్యక్తులు దయచేసి శాంతించండి” అని.
మొత్తానికి తనకి పెళ్లి కాలేదన్న క్లారిటీ ఇచ్చేసింది.

Leave a Comment