Shruti Haasan hot Looks: బ్లాక్ డ్రెస్‌లో శృతి హాసన్ మైండ్ బ్లోయింగ్ లుక్స్.
చిత్ర పరిశ్రమలో బ్యాక్ గ్రౌండ్ ఉంటే ఈజీగా స్టార్ అవ్వచ్చు అని చాలా మంది భావిస్తుంటారు. కానీ అది కేవలం ఎంట్రీ వరకు మాత్రమే వర్తిస్తుందన్నది చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.
కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ కూతురిగా స్ట్రాంగ్ బ్యాక్ గ్రౌండ్ తో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన శృతి హాసన్ మొదట్లో ఐరన్ లెగ్ అనే ముద్ర వేయించుకుంది.
చాన్నాళ్లు శృతికి చెప్పుకోదగ్గ హిట్స్ లేకపోవడంతో ఆమెను ఘోరంగా ట్రోల్ చేశారు. అయినా శృతి హాసన్ అలాంటివి ఏమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది.
గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ తో అమ్మడి జాతకం ఒక్కసారిగా మారిపోయింది. ఆ సినిమా అనంతరం చేసిన సినిమాలన్నీ కూడా దాదాపు హిట్లు కావడంతో టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. కుర్ర హీరోలతోనే కాదు సీనియర్ స్టార్స్ కు ఈ అమ్మడు ఇప్పుడు బెస్ట్ ఆప్షన్ గా మారిందనే చెప్పాలి.
రీసెంట్ గా ఈ భామ టాలీవుడ్ సీనియర్ యాక్టర్లు చిరంజీవి, బాలయ్యలతో నటించి అరుదైన రికార్డ్ సృష్టించింది. తన తండ్రి వయసుకు సమాన హీరోలతో నటించడం శృతి హసన్‌కు మాత్రమే చెల్లింది.
టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన శృతి హాసన్ కాస్త గ్యాప్ తీసుకుని మళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. టాలీవుడ్ లో ఈ అమ్మడు వరుసగా సినిమాలు చేస్తోంది.
ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ కి జోడీగా ఈ భామ సరాల్ లో కనిపించబోతోంది. ఇప్పటికే రిలీజైన ఈ మూవీ ట్రైలర్ ఫస్ట్ సాంగ్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేసింది. సలార్ సినిమా ఈ నెల 22 న వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతోంది.
పాన్ ఇండియా మూవీ కావడంతో మేకర్స్ తమదైన స్టైల్ లో ఓ రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తున్నారు. సలార్ నటీనటులు కూడా వారి ప్రమోషన్స్ మొదలు పెట్టారు.
అందులో భాగంగా సలార్ బ్యూటీ శృతిహాసన్ తన అందాల ప్రదర్శనతో ప్రమోషన్స్ లో హీట్ పెంచుతోంది. తాజాగా ఈ చిన్నది బ్లాక్ అవుట్ ఫిట్ ధరించి అద్భుతమైన ఫోటో షూట్ చేసింది . ఆ ఫోటో షూట్‌లోని పిక్స్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది ఈ బ్యూటీ. ఆ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో మంటలు రేపుతున్నాయి.
తన లేటెస్ట్ ఫోటో షూట్ కోసం శృతి వేసుకున్న ఈ బ్లాక్ అవుట్ ఫిట్ ను జేడ్ ఫ్యాషన్ హౌజ్ నుంచి ఎన్నుకుంది. ట్రెండీ ప్లెయిన్ స్కర్ట్‌కు జోడీగా త్రెడ్ ఎంబ్రాయిడరీతో అద్భుతంగా డిజైన్ చేసిన డీప్ నెక్లైన్ కలిగిన టాప్ వేసుకుంది శృతి. ప్రముఖ స్టైలిస్ట్ మనోజ్ఞ గొల్లపూడి శృతికి స్టైలిష్ లుక్స్ అందించింది.
మేకప్ ఆర్టిస్ట్ ఇక్రా శృతి అందాలకు మెరుగులు దిద్దింది. ఈ అవుట్ ఫిట్ కి తగ్గట్లుగా శృతి మెడలతో అందమైన ముత్యాల చైన్ ను అలంకరించింది. చెవులకు ట్రెండీ స్టడ్స్ పెట్టుకుంది. ఈ లుక్ లో శృతి హాసన్ అందరి మైండ్ బ్లాక్ చేసింది. తన అందాలతో మెస్మరైజ్ చేస్తోంది.
అదృష్టం ఎవరి తలుపు ఎప్పుడు తడుతుంది అనేది ఎవరికీ తెలియదు. ఆ లక్ వచ్చినప్పుడు మాత్రం సద్వినియోగం చేసుకోవడమే మన చేతుల్లో ఉన్న పని.
ప్రస్తుతం నటి శృతిహాసన్ పరిస్థితి కూడా ఇదే. సెన్సేషనల్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్లలో ఒకరైన శృతి చేతుల్లో మొన్నటి వరకూ సలార్ అనే ఒకే ఒక్క మూవీ మాత్రమే చేతిలో ఉంది.
కేజీఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రూపొందించిన మూవీ కావడంవతో పాన్ ఇండియా లెవెల్ లో మోస్ట్ అవేయిటెడ్ మూవీగా మారింది.. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.
ఈనెల 22న విడుదలకు రెడీ అయ్యింది. ఈ క్రమంలోనే శృతికి అవకాశాలు తన్నుకుంటూ వస్తున్నాయి. తాజాగా ఈ బ్యూటీ తెలుగులో అడవి శేష్ మూవీలో నటిస్తున్నట్లు అధికారికంగా ఒక ప్రకటన విడుదలైంది. ఇక తాజాగా మరో పాన్ ఇండియా మూవీలో అమ్మడు నటిగా ఛాన్స్ కొట్టేసిందట.
కేజీఎఫ్ ఫేమ్ యశ్‌తో జత కట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ట్యాక్సీ అనే టైటిల్ తో వస్తున్న ఈ మూవీలో ముగ్గురు హీరోయిన్లు ఉండనున్నారట. అందులో ఒక నాయకిగా సాయిపల్లవి పేరు ప్రస్తుతం ప్రచారంలో ఉంది. తాజాగా శృతి పేరు కూడా ఇండస్ట్రీలో వినిపిస్తోంది.