Shruti Hasan: మందు పై శృతి మనసులో మాట.

Shruti on the drug is the word in the mind.

Shruti Hasan: మందు పై శృతి మనసులో మాట.

Shruti Hasan కమల్ హాసన్ కుమార్తె గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది, నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో కనిపించాలని, తండ్రి అంతటి స్థాయిలో కాకున్నా ఇప్పటి తరం హీరోయిన్స్ లో పోటీ పది నటించేందుకు ఉవ్విళ్ళు ఊరుతోంది ఈ అమ్మడు.

వరుస ప్రాజెక్టులతో డైరీ నింపేసుకుని, గ్యాప్ లేని షోతుంగులతో బిజీ బిజీగా గడుపుతోంది. కేవలం గ్లామర్ షో మాత్రమే కాదు, డైరెక్టర్లు అవకాశం ఇస్తే యాక్షన్ ఓరియెంటెడ్ సీన్స్ కూడా ఇరగదీస్తా అని క్రాక్ సినిమాతో నిరూపించుకుంది ఈ చెన్నై చిన్నది.

ప్రస్తుతం ఈ అమ్మడు నటించిన తాజా సినిమా హాయ్ నాన్న విడుదలై ఆడియన్స్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకోగా, Salaar Movie రిలీజ్ కి రెడీగా ఉంది.

ఈ సినిమాలో Shruti తొలిసారిPrabhas కి జోడి కట్టింది. ఈ సినిమా December 22వ తేదీన ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ సినిమా టీజర్ ట్రైలర్లు ఇప్పటికే సోషల్ మీడియా ను షేక్ చేస్తున్నాయి.

టీజర్ లోShruti Hasan కూడా కనిపించింది. అందులో ఆమె డైలాగ్ ఒకటి ఉంది, బాగా విసిగిపోయి ఉన్నట్టు గా హావభావాలు చూపెడుతూ మందు ఉంటె బాగుంటుంది అని అంటుంది. అయితే ఈ డైలాగ్ విన్నవారంతా ఇదిShruti Hasan ను ఉద్దేశించి పెట్టరేమో అంటున్నారు.

ఒకప్పుడు Shruti Hasan విపరీతంగా మందు తాగేసేది అని టాక్ ఉంది. ఆ విషయాన్నీ ఆమె కూడా ఒప్పుకుంది. అయితే ఇప్పుడు మద్యపానానికి పూర్తిగా స్వస్తి [పలికేసిందట.

కేవలం ముందుకే కాదు ఆ అలవాటు ఉన్న స్నేహితులతో కూడా డిస్టెన్స్ మెయిన్ టైన్ చేస్తున్నాను అంటోంది. ఒకప్పుడు ఈ భామ పార్టీ పక్షిలా ఉండేదట, మరి నైట్ పార్టీలకి వెళితే తాగకుండా ఉండలేరు కదా, అందుకే కాస్తంత మందు పుచ్చుకోక తప్పేది కాదట.

కాస్తంత మందు కాస్త పెరిపెరిగి అలవాటుగా మారిపోయింది అంటోంది. అయితే ఒకానొక దశలో ఆ అలవాటు మీద యావగింపు పుట్టుకొచ్చిందని, అందుకే ఆ నైట్ పార్టీలకు, పబ్బులకు, ఆ స్నేహితులకు దూరంగా ఉంటున్నట్టు చెప్పుకొచ్చింది.

ఇక మొదటి నుండి స్మోకింగ్ అన్నా డ్రగ్స్ అన్నా తనకి పరమ చిరాకు అని అంటోంది. ఆల్కహాల్ తప్ప మిగిలిన వాటికి తానెప్పుడూ దూరంగానే ఉన్నానని అంటోంది.

తెలుగు తమిళ్ హిందీ ఇలా మూడు భాషల్లోనూ సినిమాలు చేస్తోంది Shruti Hasan తెలుగులో అటు చిరంజీవి, బాలయ్య, రవితేజ వంటి సీనియర్ స్టార్స్ తో నటిస్తూనే, కూరా హీరోలు నాని వంటి వారితో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటోంది.

ఈ ఏడాది తెలుగులో వాల్తేర్ వీరయ్య, వీర సింహ రెడ్డి సినిమాలతో బంపర్ హిట్లు తన ఖాతాలో వేసుకుంది. ఈ రెండు సినిమాలు 2023 బిగినింగ్ లో సంక్రాతి సీజన్ కి వచ్చాయి.

తాజాగా ఇయర్ ఎండింగ్ లో నాని తో చేసిన హాయ్ నాన్న తో సక్సస్ అందుకున్న స్రుతి Salaar Siege ఫైర్ గనుక హిట్ టాక్ తెచ్చుకుంటే ఇయర్ ఎండింగ్ కూడా హిట్స్ తో నే క్లోజ్ చేస్తుంది.

ఇక 2024 కొత్త సంవత్సరంలో ఈ తమిళ పొన్ను ఇంగ్లీష్ సినిమా కూడా చేస్తోంది. ది ఐ పేరుతో తెరకెక్కుతున్న Shruti ఈ సినిమాలో కెలక పాత్ర పోషిస్తోంది.

దీనితో పాటు హిందీ తెలుగు భాషల్లో ఒక సినిమా చేస్తోంది. ఈ బై లింగ్యువల్ సినిమా లో అడవి శేష్ Shruti Hasan లీడ్ రోల్స్ చేస్తున్నారు.

Leave a Comment