Shubman broke Sachin’s record: సచిన్ రికార్డు బ్రేక్ చేసిన శుభ్ మన్ గిల్.
అటు సినీ ఇండస్ట్రీలో అవచ్చు, పొలిటికల్ ఇండస్ట్రీలో అవచ్చు, క్రికెట్ లో కావచ్చు ఒక్కక్కరు ఒక్కో స్థాయిలో ఒక్కో సందర్భంలో వారి పెర్ఫార్మెన్స తో రికార్డులు క్రియేట్ చేస్తుంటారు.
అయితే ఆ రికార్డులను, వారి సమకాలీకులు గాని లేదంటే ఆ తరువాతి తరం లో వారు బద్దలు కొట్టేస్తూ ఉంటారు. రికార్డులు క్రియేట్ అవ్వడం ఎంత కామనో, అవి బ్రేక్ అవ్వడం కూడా అంతే కామన్.
మిగిలిన రంగాల విషయాలు అటుంచితే ఇపుడు మనం ఒక్కసారి క్రికెట్ రంగం గురించి మాట్లాడుకుందాం. ఈ రంగంలో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేసున్న వ్యక్తి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. మైదానంలోకి సచిన్ బ్యాట్ పట్టుకుని దిగాడంటే పరుగుల వరద పారాల్సింసిందే.
సచిన్ సిక్సులు, ఫోర్లు కొడుతుంటే స్కోర్ బోర్డు పరుగులు పెట్టేది. సచిన్ పరుగుల హోరుకి అడ్డుకట్ట వేయడానికి బౌలర్లు నానా తంటాలు పడుతుండేవారు.
అయితే సచిన్ మాత్రం సిక్సులు ఫోర్లు బాదేస్తున్నప్పటికీ సింగిల్ రాం వస్తుందన్నా కూడా ఛాన్స్ వదిలేవాడు కాదు. సచిన్ అంతలా కష్టపడ్డాడు కాబట్టే ఈ స్థాయిలో ఉన్నాడు.
ఇక ప్రస్తుతం టీమిండియా లో టాలెంటెడ్ ప్లేయర్స్ కి కొదువ లేదనే చెప్పాలి. జట్టు కోసం ప్రాణం పెట్టి మరీ ఆడే ఆటగాళ్లు ఉన్నారు. ఇలా ఆడవారిలో శుభ్ మన్ గిల్ ఒకడు.
శుభ్ మన్ గిల్ జట్టు లో చోటు దక్కించుకున్న మొదటి మ్యాచ్ నుండి అద్భుతంగ రాణిస్తున్నాడనే చెప్పాలి. కామేపి అది ఏ స్థాయికి వెళ్ళింది అంటే మాస్టర్ బ్లాస్టర్ రికార్డునే బ్రేక్ చేసే స్థాయికి వెళ్ళింది.
సచిన్ క్రికెట్ కెరియర్ ప్రారంభించిన సమయంలో మొదటి 30 మ్యాచ్‌లలో 12 పర్యాయాలు 50 రన్లకు పైగా స్కోర్లు చేశాడు. అయితే కెరియర్ బిగినింగ్ లోనే మొదటి 30 మ్యాచ్ లలో ఏ ఆటగాడు కూడా ఇప్పటివరకు 12 కార్లు 50 కి మించి పరుగులు సాధించలేకపోయారు.
కానీ ఆ రికార్డును శుభ్ మన్ గిల్ బ్రేక్ చేశాడు. శుభ్ మన్ గిల్ ఆడిన తొలి 30 మ్యాచ్ లలోనే 13 సార్లు 50 కన్నా ఎక్కువ పరుగులు చేశాడు. ఇక మరో రికార్డు గురించి కూడా చెప్పుకోవాలి, ఆ రికార్డు స్ట్రైక్ రేట్ కి సంబంధించింది.
ఈ చిచ్చరపిడుగు శుభ్ మన్ గిల్ సచిన్ టెండూల్కర్ స్ట్రైక్ రేట్ ను సమం చేశాడు. సచిన్ టెండూల్కర్ 1998వ సంవత్సరంలో వన్డే క్రికెట్‌లో 100+ స్ట్రైక్ రేట్‌తో 1894 పరుగులు చేశాడు.
దీని ద్వారా సచిన్ ఒకే ఏడాది 1500ల కంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా వరల్డ్ రికార్డు సాధించాడు. ఇప్పుడు తాజాగా శుభ్ మన్ గిల్ 2023వ సంవత్సరంలోని వన్డే క్రికెట్‌లో ఆ రికార్డును సమం చేశాడు.
సచిన్ రికార్డును సమం చేయడం అంటే సామాన్యమైన విషయం కాదని చెప్పాలి. 100 స్ట్రైక్ రేట్‌తో ఒకే సంవత్సరంలో 1500 కన్నా ఎక్కువ పరుగులు చేసి సచిన్ సరసన నిలువగలిగాడు. ఇక సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ శుభ్ మన్ గిల్ మంచి స్నేహితులనే తెలుస్తోంది.