Miss Universe : మిస్ యూనివర్స్ పోటీల్లో శ్వేతా శార్దా..శ్వేత గురించిన పూర్తి వివరాలు తెలిస్తే షాకే..
ప్రతిష్టాత్మక మిస్ యూనివర్స్ అందాల పోటీల్లో ఈ దఫా భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించడానికి రెడీ గా ఉన్నాను అంటోంది ఛండీగఢ్‌కు చెందిన 23 ఏళ్ల శ్వేతా శార్దా.
ఎల్ సాల్వడార్ వేదికగా నిర్వహించనున్న ఈ తుది పోటీల్లో విజేతను ఎంపిక చేయనున్నారు. మిస్ యూనివర్స్ పోటీలో భాగంగా గురువారం నేషనల్ కాస్ట్యూమ్ షోను వెర్పాటు చేయగా, ఈ పోటీల్లో ‘ఆర్మర్డ్ గాడెస్’ అనే థీమ్ తో రూపొందించిన కాస్య్టూమ్ ను శ్వేతా శార్దా ధరించి చూపరుల దృష్టిని ఆకట్టుకుంది.
జాతీయ పుష్పం కమలం స్ఫూర్తితో రూపొందించిన కిరీటాన్ని శ్వేతా తలపై ధరించింది. దీంతో పాటు ఆమె ధరించిన కాస్య్టూమ్ మీద భారత దేశ జాతీయ పక్షి అయిన నెమలిని ప్రతిబింబించేలా ఎంబ్రాయిడరీతో అందంగా తీర్చిదిద్దారు. ఈ డ్రస్సు ధరించిన శ్వేత కూడా మయూరం మాదిరిగానే హొయలు ఒలికించినట్టు తెలుస్తోంది.
శ్వేతా ధరించిన ఈ డ్రెస్ ను నిధి అనే డిజైనర్ రూపొందించారు. సవాళ్లను ఎదుర్కొంటు, అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్న, దృఢమైన భారత్ ను ప్రతిబింబించే విధంగా ఈ కాస్ట్యూమ్‌ను రూపొందించినట్టు నిధి చెబుతున్నారు. ఇక శ్వేతా విషయానికి వస్తే చండీగఢ్‌లో ఆమె జన్మించింది.
తన 16 సంవత్సరాల వయస్సులో న తల్లితో కలిసి ముంబయికి చేరుకుంది. ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసింది శ్వేత. డాన్స్ ఇండియా డ్యాన్స్, డ్యాన్స్ దీవానే, డ్యాన్స్ ప్లస్‌తో సహా అనేక రియాలిటీ షోలలో శ్వేతా కంటెస్ట్ చేసింది.
కొసమెరుపేంటంటే ఆమె ఝలక్ దిఖాలాజా లో కొరియోగ్రాఫర్ గా కూడా చేశారు. శ్వేత ప్రతిష్టాత్మక మిస్ దివా యూనివర్స్ టైటిల్‌ను కూడా గెలుచుకుంది. 2022 విజేత దివితా రాయ్ ఈ కిరీటాన్ని శ్వేతకు
అలంకరించింది. ఈ పోటీల్లో 15 మంది అందాల భామలు తలపడగా వారందరిని వెనక్కు నెట్టిన శ్వేత ఈ కిరీటాన్ని కైవశం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే నాలుగు ప్రధాన అంతర్జాతీయ అందాల పోటీలలో ఇది కూడా ఒకటి.
అటువంటి ఈ పోటీలో నెగ్గడం మామూలు విషమైతే కాదు అంటున్నారు విశ్లేషకులు. ఇవన్నీ చుస్తే మిస్ యూనివర్స్ పోటీల మాట ఎలా ఉన్నా బాలీవుడ్ కి మరో స్టార్ హీరోయిన్ రాబోతోందని తెలుస్తోంది.