సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda),అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran)జోడీగా నటించిన రొమాంటిక్ క్రైమ్ కామెడీ టిల్లు స్వ్కేర్ (Tillu Square) బాక్సాపీస్ దగ్గర సాలిడ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. పాజిటివ్ రివ్యూలతో ఊహించిన దాని కంటే ఎక్కువే మ్యాజిక్ చేస్తున్నాడు టిల్లు గాడు. టిల్లు స్క్వేర్ ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే కలెక్షన్లను రాబడుతోంది. గ్లోబల్ లెవెల్ లో టిల్లు గాడి హవ గట్టిగానే కనిపిస్తోంది.
టిల్లు తన యాక్టింగ్ తో చింపేశాడు. పవర్ ఫుల్ మాస్ పంచ్ డైలాగులతో ఓ ఊపు ఊపేశాడు. ఇక ఈ మూవీలో మరో హైలెట్ అనుపమ పరమేశ్వరన్ . అనుపమ అందాల ఆరబోత గట్టిగానే చేసింది. హీరోతో లిప్‌లాక్‌లు, రొమాంటిక్ సీన్లతో రెచ్చిపోయింది. ఇదిలా ఉంటే తాజాగా సిద్దు జొన్నలగడ్డ గురించిన ఓ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది.
ఆయన ఓ సూపర్ హ్యూమన్ :
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)మూవీలో సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda)కు ఛాన్స్ వచ్చిందని అప్పట్లో ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఆ తర్వాత దాని గురించి ఎక్కడా మాట్లాడుకోలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సిద్దు ఈ విషయంపై స్పందించాడు. ” మెగాస్టార్ తో మూవీ చేస్తే అది తన కెరీర్లో మైల్ స్టోన్ గా నిలిచిపోతుంది. గతంలో ఆయనతో సినిమా చేసే ఛాన్స్ వచ్చింది. కానీ కొన్నికారణాల వల్ల అది కుదరలేదు.
మళ్లీ ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్నా. చిరంజీవి గారితో నేను ఎప్పుడు కలిసినా దాని గురించే మాట్లాడతాను. ఆయన ఓ సూపర్ హ్యూమన్. ఇండస్ట్రీ అంటే మెగాస్టార్ పేరే గుర్తుకు వస్తుంది. అయితే నా ఆల్‌టైమ్ ఫేవరెట్ హీరో మాత్రం వెంకటేష్ (Venkatesh).చిరంజీవి గారితోనే కాదు, సీనియర్ హీరోస్ బాలకృష్ణ (Balakrishna) , అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), రజినీకాంత్ ( Rajinikanth)లతోనూ సినిమా చేయాలని ఉంది.
యూత్ లో టిల్లుగాడి క్రేజ్ :
స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ కెరీర్ స్టార్టింగ్ లో సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తుండేవాడు. ఆ తర్వాత తన యాక్టింగ్ మెచ్చిన మేకర్స్ సినిమాల్లో హీరోగా అవకాశం ఇచ్చాడు. సిద్ధు హీరోగా మొదటిసారి నటించిన సినిమా గుంటూరు టాకీస్ (Guntur Talkies), కృష్ణ అండ్ హిస్ లీల (Krishna And his leela),వంటి సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఆతర్వాత 2022లో రిలీజైన డీజే టిల్లు (DJ Tillu)తో ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ వచ్చింది. తెలంగాణ యాసలో సిద్దు ఈ మూవీలో ఇచ్చిపడేశాడు . సిద్ధు చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్టించాయి. ఆ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ కూడా థియేటర్స్ లో అదరగొడుతోంది.