Silk Smitha Biopic movie : సిల్క్ ది అన్ టోల్డ్ స్టోరీ..సిల్క్ జీవితం తో మరో సినిమా.

6tv projects 10 Silk Smitha Biopic movie : సిల్క్ ది అన్ టోల్డ్ స్టోరీ..సిల్క్ జీవితం తో మరో సినిమా.

సిల్క్ ది అన్ టోల్డ్ స్టోరీ..సిల్క్ జీవితం తో మరో సినిమా.

సిల్క్ ది అన్ టోల్డ్ స్టోరీ ఇప్పుడు ఈ పేరుతో ఒక సినిమా రాబోతోంది. ఇప్పటికే సిల్క్ లైఫ్ ను బేస్ చేసుకుని ఒక సినిమా వచ్చినా సిల్క్ ది అన్ టోల్డ్ స్టోరీనే అంటారు ఆమె ఫాన్స్. ఆమె జీవితంలో యదార్ధ ఘటనలు ఎవరు చూపించలేదని అంటారు. అసలు ఎందుకలా అంటారు అంతేది ఒక్కసారి చూద్దాం.

సిల్క్ స్మిత – 80ల దశకంలో దక్షిణాది రాష్ట్రాల సినీ ప్రియుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న నటి నర్తకి. తన పదునైన ఒర కళ్ళ చూపులతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది.

మృదువైన తన పెదవిని మునిపంటితో కొరుకుతూ యువత మనసులకు ఆరని గాయాన్ని రేపింది. తన శృంగార భరిత గీతాలను దక్షిణాదివారికే పరిమితం చేయకుండా బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టింది.

అక్కడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. పేరుకి పేరు డబ్బుకి డబ్బు అన్ని సంపాదించుకుంది. ఆస్తి, ఐశ్వర్యం తోపాటు స్వాభిమానం స్వాతిశయం కూడా పెంచుకుంది.

కానీ ఇండస్ట్రీలో ఉండకూడనివి అత్యంత ప్రమాదకరమైనవి ఆ రెండే అని అర్ధం చేసుకోలేకపోయింది. ఎంత త్వరగా జనబాహుళ్యం లోకి చొచ్చుకెళ్లిందో, అంతే త్వరగా వారి నుండి శాశ్వతంగా దూరమైంది. అయితే ఆమె మరణానికి కారణం ఇంతవరకు అంతుపట్టని చిక్కు ప్రశ్నగానే మిగిలిపోయింది.

చంద్రికరవి రాసిన మాటలు సిల్క్ స్మిత కోసం :

సిల్క్ ప్రేమ కోసం తపించిందని, నిష్కళంకమైన, నిర్మలప్రేమ ఈ లోకంలో దొరకదని అర్ధం చేసుకోలేకపోయింది, అందుకే ఆ మత్తు కళ్ళు అంత త్వరగా మూతపడిపోయాయి.

సిల్క్ ఎందుకు చనిపోయిందో, ఎలా చనిపోయిందో ఇప్పటికీ మిస్టరీనే, ఆమె ఆత్మహత్య చేసుకుందా, లేదంటే ఆత్మహత్య చేసుకునేలా ఎవరైనా ప్రేరేపించారా, అదీ కాదంటే ఎవరైనా సిల్క్ ను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా ? ఇలాంటి అనేకమైన ప్రశ్నలు సిల్క్ నిర్యాణం చుట్టూ తిరిగాయి,

తిరుగున్నాయి, తిరుగుతూనే ఉంటాయి. ఇప్పటికే సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా చేసుకుని హిందీ లో డర్టీ పిక్చర్ పేరుతో ఒక సినిమా తెరకెక్కింది. ఇప్పుడు తాజాగా మరో మారు ఆమె బయోపిక్ తీస్తున్నామంటూ ఒక అనౌన్స్మెంట్ వచ్చింది.

గతంలో విద్యాబాలన్ సిల్క్ పాత్రలో జీవించేసింది, అయితే ఈ సారి సిల్క్ గా కనిపించడానికి చంద్రికా రవి సిద్ధమవుతోంది.

చంద్రికా రవి అంటే ఎవరా అని తీక్షణంగా ఆలోచించాల్సిన అవసరం లేదు, వీర సింహా రెడ్డి సినిమాలో బాలయ్య తో మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి అనే పాటలో ఆడిపాడిన భామ.

గతంలో సిల్క్ గా నటించిన విద్యా బాలన్ జాతీయ ఉత్తమ నటిగా డర్టీ పిక్చర్ సినిమాలో నటనకు గాను రాష్ట్ర పతి చేతుల మీదుగా అవార్డు అందుకుంది. అలాంటిది ఇప్పుడు చంద్రిక రవి ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.

Add a heading 2023 12 02T170605.248 Silk Smitha Biopic movie : సిల్క్ ది అన్ టోల్డ్ స్టోరీ..సిల్క్ జీవితం తో మరో సినిమా.

సిల్క్ 1996 సెప్టెంబర్ నెలలో చనిపోతే 2023 సంవత్సరానికి కూడా ఆమె పేరు బాగా వినిపిస్తోంది. ఇప్పటికి కూడా ఆమె ఫోటోను ఎదో ఒక సినిమాలోనో పాటలోనో ఉపయోగిస్తూనే ఉంటారు.

అది ఇండస్ట్రీ తోపాటు ఈ సమాజం మీద సిల్క్ వేసిన మార్క్. ఎక్కడో ఏలూరు దగ్గర ఒక చిన్న గ్రామంలో పుట్టిన విజయలక్ష్మి సిల్క్ గా ఎలా మారింది, ఆమె ఇండస్ట్రీలోకి ఎలా వెళ్ళింది అన్నది చుస్తే చాలా విచిత్రంగా ఉంటుంది.

సినిమాటిక్ గా ఉండటానికి ఆమె బియోపిక్ లో కల్పితాలు జొప్పించారు కానీ, సిల్క్ ఇండస్ట్రీలోకి వ్యాంప్ పాత్రతో ఎంట్రీ ఇవ్వలేదు. మామూలు పాత్రలతోనే మెరిశారు. ఇంకా చెప్పాలంటే నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ సరసన నాయికగా కూడా నటించారు.

సీతాకోక చిలుక సినిమాలో మానవతా విలువలను చాటిచెప్పిన వదిన పాత్ర పోషించారు. అయితే ఆమె జీవితాన్ని మలుపు తిప్పేసి ఆమెకు సిల్క్ అనే పేరు తెచ్చిపెట్టిన సినిమా మాత్రం వండి చక్రం.

ఆ సినిమాలో ఆమె పాత్ర పేరు సిల్క్, అలా సిల్క్ స్మిత అయిపొయింది. తెరపై క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ఐటెం గర్ల్ గా వ్యాంప్ గా మారకముందు ఆమె కాస్ట్యూమ్ డిసైనర్ దగ్గర అసిస్టెంట్ గా కూడా వర్క్ చేసింది.

మెడ్రాస్ లో ఛాయాదేవి ఇంట్లో అద్దెకు ఉంటూ కాస్ట్యూమ్ అసిస్టెంట్ గా వర్క్ చేస్తూ అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉండేది.

ఆమె లో నటిని మాత్రమే చుసిన భారతీయ రాజా వంటి దర్శకులు ఆమెకు మంచి పాత్రలు ఇచ్చి పోషించారు, తక్కిన వారు మాత్రం వండి చక్రం సినిమా తరువాత నుండి వ్యాంప్ రోల్స్ ఇస్తూ ఉండేవారు. అయితే జీవనం గడవాలి కాబట్టి ఆ రోల్స్ ను కాదనలేకపోయింది సిల్క్ స్మిత.

1993 లో వచ్చిన బావ బావమరిది సినిమా లోని బావాలు సయ్య, మరదలు సయ్యా అనే పాటకి ఆమె క్రేజ్ పీక్స్ లోకి వెళ్ళిపోయింది.

ఆ సాంగ్ కన్నా ముందు కూడా ఆమె చిరంజీవి, బాల కృష్ణ, రజనీకాంత్, రాజేంద్ర ప్రసాద్, సత్యరాజ్, కమల్ హస్సన్, ప్రభు, ఇలా అనేకమంది హీరోల సరసన డాన్స్ చేశారు. వారి సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేసి క్రౌడ్ పుల్లర్ గా మారింది.

Add a heading 2023 12 02T171023.279 Silk Smitha Biopic movie : సిల్క్ ది అన్ టోల్డ్ స్టోరీ..సిల్క్ జీవితం తో మరో సినిమా.

ఐటెం సాంగ్స్ లో డాన్స్ చేసిందనే కానీ.. నిజానికి అసలు సిల్క్ కి డాన్స్ రాదు, ఆమె కేవలం తన హావభావాలతోనే నెట్టుకొచ్చేది, అసలు ఆమె బాడీ లో ఉన్న గ్రేస్ తోనే ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసేసేది.

అన్నిటి మించి ఆమె కళ్ళలో ఉన్న మత్తు సినిమా చూసే వారికి ఒక రకమైన కిక్ ఇచ్చేది. కేవలం సిల్క్ పాట కోసమే ఆడియన్స్ ను థియేటర్ కి గిరికీలు కొట్టించారు కొందరు దర్శక నిర్మాతలు.

ఒకానొక దశలో ఎలా మారిందంటే, హీరో హీరోయిన్ గా ఎవరున్నా సరే సిల్క్ స్మిత సాంగ్ కంపల్సరీ గా పెట్టుకునేవారు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు. ఇక సిల్క్ స్మిత ఏ డ్రస్ వేసుకున్నా చాలా అందంగా మెరిసిపోయేది. అందుకు కారణం ఆమెకు కాస్ట్యూమ్ డిజాయినింగ్ మీద ఉన్న పట్టే.

ఆమె ఐటెం సాంగ్స్ చేస్తున్న సమయంలో ఆమెకి కాస్ట్యూమ్ డిసైనర్ ముందు రోజు ఒక డ్రస్సు తెచ్చి ఇస్తే ఆమె తిరిగి సెట్ లోకి అదే డ్రస్ వేసుకొచ్చినా ఆ డ్రస్సును గుర్తుపట్టలేనంతగా మార్చేసేదట.

కొందరైతే ఐడెండిటీ మీరు వేరే డ్రస్ వేసుకొచ్చారు, మా అసిస్టెంట్ ఇచ్చిన డ్రస్ ఇది కాదు కదా అని డిజాయినర్ అడిగితె, సిల్క్ చిన్నగా నవ్వేసి, సరిగా చుడండి, ఇది మీపు పంపింది, కొద్దిగా ఎంబ్రాయిడరీ చేసి మార్చా అంతే అనేదట.

కానీ డ్రస్ మార్చుకున్నంత అందంగా తన జీవితాన్ని మార్చుకోలేకపోయింది. ఎవరిని పడితే వారిని నమ్మి సినిమాలు తీసింది, అప్పులపాలైంది, అప్పట్లో సిల్క్ ఒక ప్రకటన చేసింది.

తనతో నటించిన హీరోలెవరైనా ఒక్క కోటి రూపాయలిస్తే తన జీవితాన్ని బాగు చేసుకుంటానని స్టేట్మెంట్ ఇచ్చింది. అయ్యబాబోయ్ అప్పట్లో కోటి రూపాయలా మాటలేనా అని ఆశ్చర్య పడనవసరం లేదు.

1996 కి ముందు సిల్క్ ఆ స్టేట్మెంట్ ఇచ్చింది. కానీ కర్తవ్యం సినిమా 1990 లో రిలీజ్ అయింది. ఆ సినిమాకి విజయశాంతి అందుకున్న పారితోషకం కోటి రూపాయాలు.

అంటే కోటి రూపాయలు సిల్క్ కి హీరోలు ఇచ్చి తీరాల్సిందే అని అనడం ఇక్కడి ఉద్దేశం కాదు, ఆమె ఐటెం సాంగ్స్ వల్ల ఎంతో లాభం పొందిన వారు ఆమె ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే అవకాశం ఉన్నా స్పందించలేదు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం.

సిల్క్ జీవితం అర్ధాంతరంగా ముగించాలి అన్న విషయం సిల్క్ కి ముందే తెలుసేమో, అందుకే హీరో అర్జున్ ను తాను చనిపోతే చూసేందుకు వస్తావా అని అడిగిందట.

కానీ దానిని సీరియస్ గా తీసుకొని అర్జున్ ఎందుకలా పిచ్చి మాటలు మాట్లాడతావు అని అన్నాడట, కానీ అలా సిల్క్ అర్జున్ ను అడిగిన కొన్ని రోజుల తరవాతనే ఆమె చనిపోయింది, అర్జున్ మాత్రం ఆమెకు కడసారి వీడ్కోలు పలికాడు. సిల్క్ చివరి రోజుల్లో ఉండగా నాగార్జున సినిమాల్లో మూడు ఐటెం సాంగ్స్ చేసింది.

ఒకటి మని రత్నం తీసిన గీతాంజలి, రెండు ఆర్జీవీ తీసిన అంతం, మూడు రక్షణ సినిమా. ఇక బాలయ్య తో ఆదిత్య 369 లో కనిపించింది. చిరు తో అయితే ఒక డజనుకు పైగా సినిమాల్లో నటించారేమో అని చెప్పాలి. వీరి కలయికలో వచ్చిన ఆఖరు సాంగ్ ముఠా మేస్త్రి సినిమాలోది అని చెప్పొచ్చు.

సిల్క్ బ్రతికి ఉన్నపుడు ఎలా ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఒక్క ఉదాహరణ చెప్పాలంటే ఆమె సెట్ లోకి వస్తే ఆమెకు షాట్ రెడీ అని చెప్పడానికే సిస్టెంట్ డైరెక్టర్లు నేను చెప్తా చేను చెప్తా అని పోటీ పడేవారట.

అలాంటిది ఆమె చనిపోయాక ఆమె శవం చెన్నై లోని ప్రభుత్వ ఆసుపత్రి మార్చరి బయట ఉన్నపుడు శవం మీద కనీసం ఒక గుడ్డ కూడా కప్పలేదట, అచేతనంగా ఉన్న సిల్క్ మీద ఈగలు ముసురుతున్న సమయంలో అక్కడి వెళ్లిన డాన్సర్ అనురాధ అది చూసి చలించిపోయిందట.

మొత్తానికి ఇండస్ట్రీలో సిల్క్ శకం విషాదాంతంమే అయింది. అయితే అలాంటి విషాదభరిత జీవితాన్ని అనుభవించలేక బలవన్మరణానికి పాల్పడిన ఓ నటి నర్తకి జీవితాన్ని ఆధారంగా చేసుకుని మరో సినిమా రాబోతోంది.

ఇక ప్రస్తుతం సిల్క్ న్యూ బియోపిక్ లో నటిస్తున్న చంద్రిక రవి గురించి చుస్తే ఈమె చీకట్లో చితక్కొట్టుడు అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ భామ భారత మూలాలున్న ఆస్ట్రేలియన్ నటి, మోడల్.

ఈమె తెలుగు తోపాటు తమిళ సినిమాల్లో కూడా నటించింది. సిల్క్‌ స్మిత- ది అన్‌టోల్డ్‌ స్టోరీ అనే టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాకి జయరామ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది అతనికి డెబ్యూ సినిమా.

Leave a Comment