Kriti Sanon : పట్టు చీరలో వెండితెర సీతమ్మ…అందాల చూడతరమా.

Add a heading 2023 12 13T133431.787 Kriti Sanon : పట్టు చీరలో వెండితెర సీతమ్మ…అందాల చూడతరమా.

Kriti Sanon : పట్టు చీరలో వెండితెర సీతమ్మ…అందాల చూడతరమా.

ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. కానీ బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ముందు తెలుగులో మహేష్ బాబు హీరోగా చేసిన వన్ నేనొక్కడినే మూవీతో ఎంట్రీ ఇచ్చి లక్కు కలిసిరాకపోవడంతో బాలీవుడ్ చెక్కేసింది.

మాతృ భాష కావడంతో హిందీలో అమ్మడు వరుస ఆఫర్లను అందిపుచ్చుకుని టాప్ హీరోయిన్ గా తన కెరీర్‎లో దూసుకుపోతుంది. రీసెంట్‎గా ఓం రౌత్ డైరెక్షన్ లో వచ్చిన ఆదిపురుష్ సినిమాలో శ్రీరాముడికి సీతగా, ప్రభాస్ కు జోడీగా నటించి ప్రేక్షకులను అలరించింది.

ఈ సినిమా పెద్దగా హిట్ కాకపోయినా కృతి తన పాత్రకు న్యాయం చేసింది. ఇదిలా ఉంటే కృతి తాజాగా అద్భుతమైన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసే ఫ్యాన్స్ ను ఇంప్రెస్ చేస్తోంది. పట్టు చీరలో కుందనపు బొమ్మలా కనిపిస్తూ కుర్రాళ్లను కవ్విస్తోంది.

కృతి సనన్ మోడ్రన్ అవుట్‎ఫిట్స్‎లోనే సున్నితమైన సాంప్రదాయ భారతీయ దుస్తుల్లోనూ ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. తాజాగా కృతి పట్టు చీరలో చేసిన ఫోటోషూట్ ఇంటర్నెట్ లో మంటలు రేపుతోంది.

అభిమానుల హృదయాలను కొల్లగొట్టింది. ఆమె స్టైలిస్ట్ సుకృతి గ్రోవర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ చిత్రాలు అందరిని అమితంగా ఆకట్టుకుంటున్నాయి.

కృతి సొగసైన భంగిమలు , ఆమె అందమైన చీరకట్టును ప్రదర్శిస్తున్నట్లు చూపుతున్నాయి. కృతి చిత్రాలో ఇప్పుడు ఇన్‎స్టాగ్రామ్ లో ఓ రేంజ్‎లో వైరల్ అవుతున్నాయి.

కృతి సనన్ ధరించిన చీర చూపరులను ఆకర్షిస్తోంది. బంగారు వర్ణంలో ఉన్న చీరకు భారీ ఎంబ్రాయిడరీ బార్డర్‌లు , టాసెల్స్ ఏర్పాటు చేసి అద్భుతంగా డిజైన్ చేశారు.

ఈ ఆరు గజాల గోల్డెన్ శారీని సాంప్రదాయ శైలిలో ధరించి కృతి హొయలు పోయింది. క్లిష్టమైన గోల్డెన్ త్రెడ్ ఎంబ్రాయిడరీ, అమర్చిన బస్ట్, కత్తిరించిన సిల్హౌట్‌తో డిజైన్ చేసిన స్లీవ్‌లెస్ గోల్డ్ సిల్క్ బ్లౌజ్‌ను ఈ చీరకు జోడీగా ధరించి తన రూపాన్ని పూర్తి చేసింది.

ఈ చీరకు తగ్గట్లుగా కృతి బంగారు ఆభరణాలను అలంకరించుకుంది. ఆమె చేతికి చంకీ కఫ్ బ్రాస్‌లెట్, చెవులకు భారీ జుమ్కీలు, మ్యాచింగ్ పాదరక్షలను ధరించింది.

ఢిల్లీకి చెందిన కృతి సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన నేనొక్కడినే మూవీతో తెరంగేట్రం చేసింది. అది అంతగా హిట్ కాకపోవడంతో బాలీవుడ్ బాట పట్టింది.

అనంతరం హిందీలో హీరోపతి, దిల్ వాలే, రాబ్తా బరేలీకి బర్ఫీ , రొమాంటిక్ కామెడీ లుకా చుప్పి, హౌస్‌ఫుల్ 4, పానిపట్, మిమీ , హమ్ దో హమారే దో, భేదియా , బచ్చన్ పాండే ,షెహజాదా వంటే సినిమాల్లో నటించి నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది.

ఇక ఓం రౌత్ దర్శకత్వంలో వచ్చిన ఆదిపురుష్ లో సీత పాత్రతో పలకరించింది. ఈ పాత్రకు మంచి పేరు కూడా వచ్చింది. గతంలో కృతి సుకుమార్ డైరెక్షన్ లో ‘నేనొక్కడినే’ మూవీ చేసింది.

అందుకే ఇపుడు టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, సుకుమార్ కాంబోలో వస్తున్న సినిమాలో హీరోయిన్‌గా ఈ అమ్మడు నటించడానికి ఓకే చెప్పినట్టు టాక్ వినిపిస్తోంది.

Leave a Comment