Singer Chinmai Fire on Annapurnamma shocking comments on women : నటిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వందలాది సినిమాల్లో నటించి తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు సీనియర్ నటి అన్నపూర్ణమ్మ (annapurnamma). సినిమాల్లో ఆమె చేయని క్యారెక్టర్ అంటూ ఏది లేదు.
అప్పటి స్టార్ హీరోల సినిమాల నుంచి ఇప్పటి యంగ్ హీరోల మూవీస్ వరకు నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం అన్నపూర్ణమ్మ బామ్మ క్యారెక్టర్లు, అప్పుడప్పుడు కామెడీ షో లు చేస్తూ తన సినీ జీవితాన్ని కొనసాగిస్తున్నారు.
ఇదిలా ఉంటే లేటెస్ట్ గా అన్నపూర్ణమ్మ ఆడవాళ్ళపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. నేటి కాలం అమ్మాయిల పై అన్నపూర్ణమ్మ చేసిన వ్యాఖ్యలు వారిని కించపరిచేలా ఉన్నాయంటూ నేటిజన్స్ మండిపడుతున్నారు. తాజాగా సింగర్ చిన్మయి(singer chinmai) అన్నపూర్ణమ్మ పై ఓ రేంజ్ లో ఫైర్ అవుతోంది.
అన్నపూర్ణమ్మ లాంటివాళ్లు అలా అనడం సిగ్గుచేటు:
చిన్మయి శ్రీపాద (singer chinmai)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన గాత్రంతో సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్, కోలీవుడ్ లో మంచి గుర్తింపు సంపాదించింది. పాటలు పాడటంలోనే కాదు, సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉంటుంది. చిన్మయి మీటూ ఉద్యమం గురించి ఎప్పుడూ షాకింగ్ కామెంట్స్ చేస్తుంటుంది.
అమ్మాయిల విషయానికి వస్తే మొహమాటం లేకుండా తన మనసులోని మాటలను చెప్పేస్తుంటుంది చిన్మయి. ముఖ్యంగా ఆడవారికి సంబంధించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే వెంటనే రియాక్ట్ అవుతుంది. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిపడేస్తుంది.
ఈ క్రమంలో సీనియర్ నటి అన్నపూర్ణమ్మ ఆడవాళ్ళపై చేసిన కామెంట్స్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యింది. “ఆడవాళ్ళ డ్రెస్సింగ్ వల్లే వారిపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని అన్నపూర్ణమ్మ లాంటివాళ్లు అనడం
సిగ్గుచేటు. ఇలాంటివాళ్లు ఉన్న దేశంలో ఆడవాళ్లుగా పుట్టడం మనం చేసుకున్న కర్మ”. అని చిన్మయి ఓ వీడియోను నెట్టింట్లో పోస్ట్ చేసింది. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
అన్నపూర్ణమ్మ ఆడవాళ్ల గురించి ఏమంది :
ఓ ఇంటర్వ్యూలో అన్నపూర్ణమ్మ (annapurnamma) మాట్లాడుతూ..”ఆ రోజుల్లో స్వతంత్య్రం అనగానే ఆడవారు అర్ధరాత్రి బయటకు వచ్చేవారా? అసలు ఆడవాళ్లకు స్వాతంత్య్రం ఎందుకు ? 12 గంటల తర్వాత బయట ఏం పని ఉంటుంది ?.
ఇప్పటి ఆడవాళ్లు ఎక్స్‌పోజింగ్ ఎక్కువ చేస్తున్నారు. అమ్మాయిలను ఏమీ అనకూడదని అనుకున్నాను. కానీ అలా అనేటట్లుగా వారు తయారయ్యారు. ఎప్పుడూ ఎదుటి వారిదే తప్పంటే ఎలా? ఆడవాళ్లది కూడా తప్పు ఉంటుంది “. అని అన్నపూర్ణమ్మ షాకింగ్ కామెంట్స్ చేసింది.