Sreemukhi Dewalil celebrations video goes viral: ఒకే గది.. ఇపుడు ఖరీదైన బంగ్లా.. శ్రీముఖి వీడియో వైరల్.
బుల్లి తెరపై మొదట ఒక చిన్న ప్రోగ్రాం లో వ్యాఖ్యాతగా మెరిసిన శ్రీ ముఖి ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ యాంకర్స్ లో ఒకరిగా మారిపోయారు. యాంకరింగ్ లో గ్లామర్ ను మిక్స్ చేసి యువత దృష్టిని ఆకట్టుకుంది. ఆమె మాటల్లోని హోరు తో అన్ని వయసుల వారిని ఇట్టె ఆకట్టుకుంది.
ఎలాంటివారినైనా చూపు తిప్పుకోనివ్వకుండా కట్టి పడేస్తుంది. అయితే శ్రీ ముఖి కేవలం బుల్లి తెరమీదనే కాకుండా వెండి తెర మీద కూడా కనిపిస్తూ మరింత పాపులర్ అవుతోంది.
ఇవి చాలవన్నట్టు సామాజిల మాధ్యమాలలో ఎప్పుడు యాక్టీవ్ గానే ఉంటుంది, ఆమె చేస్తున్న ప్రాజెక్టుల వివరాలు, ఆమె చేస్తున్న సినిమాలు, ఆమె చేయించుకున్న ఫోటో షూట్ లు అన్ని కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
అంతే కాదు ఆమెకంటూ ఒక యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. అందులో వివిధ రకాల వీడియోలు షేర్ చేస్తుంది ఈ అల్లరి రాములమ్మ.
ఈ క్రమంలోనే తన యూట్యూబ్ ఛానల్ లో ఓ వీడియో అప్లోడ్ చేసింది. తన ఫ్యామిలీతో కలిసి దీపావళి పండుగ చేసుకున్న వీడియో అందులో పెట్టింది.
ఆ వీడియో లో దీపావళి సందర్భంగా ఆమె పేరెంట్స్ కి బాగా ఖరీదైన బహుమతులు ఇచ్చింది. తన తండ్రికి ఒక గోల్డ్ చైన్ ఇవ్వగా తల్లికి ఏకంగా డిమాండ్ నెక్లెస్ ఇచ్చింది. ఇక తన తమ్ముడు శుశ్రుత తో కలిసి తన తల్లి దండ్రుల కాళ్ళకి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకుంది.
యాంకర్ గా నటిగా ఎంత ఎత్తుకి ఎదిగినా ఒదిగే ఉండాలన్నది శ్రీముఖిని చూసి నేర్చుకోవాలి అంటున్నారు ఈ వీడియో చుసిన వారు. పేరెంట్స్ పట్ల ఆమె చూపున్న అభిమానానికి మర్యాదకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
తెరపై అల్లరల్లరి చేసే శ్రీముఖియేనా ఇంత ఒద్దికగా ఉంది అని ఆశ్చర్య పోతున్నారు. ఇక శ్రీ ముఖి ఈ వీడియోలో ఒక విషయాన్నీ చెప్పింది. ఒకప్పుడు వారిది మధ్యతరగతి కుటుంబం అని, చిన్న గదిలో అద్దెకు ఉండేవాళ్లమని చెప్పింది.
కానీ కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి వచ్చామని తెలిపింది. ఇప్పుడు ఇంత పెద్ద ఇంట్లో దీపావళి జరుపుకోవడం నిజంగా ఆనందంగా ఉందని వెల్లడించింది. కాబట్టి ఏదైనా సాధించాలి అంటే కష్టపడాల్సిందే అని శ్రీముఖిని చూసి నేర్చుకోవాలి.