Salaar Movie: సలార్ సినిమా లో శివగామి తనే.
SALAAR సినిమా చూసిన వాళ్ళు ఆ సినిమాలో వరదరాజు సోదరి పాత్ర అస్సలు మర్చిపోరు. ఆ పాత్ర చేసింది SHRIYA REDDY.
ఈమే చేసిన రాధ రామ పాత్ర అత్యంత శక్తివంతంగా తీర్చిదిద్దారు.సినిమాలో SHRIYA REDDY లుక్స్ లోని గాంభీర్యం మరింత ఆకర్షణగా నిలిచింది.
ఈ పాత్రని అందరూ బాహుబలిలో శివగామితో పోల్చుతున్నారు.బాహుబలిలో శివగామి అంత శక్తివంతమైన పాత్రగా పోల్చుతున్నారు.
అలా ఈమె గురించి నెట్టింట పెద్ద చర్చే నడుస్తుంది.ఈమె కొత్త నటి అనుకుంటున్నారు కానీ కాదు, చాలా సినిమాల్లో నటించింది.
SHRIYA REDDY నటించిన సినిమాలు:
2002 లో SAMURAY సినిమాతో తమిళంలో అడుగుపెట్టింది.”అప్పుడప్పుడు” అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రిని పలకరించింది.
ఆ తరువాత “అమ్మ చెప్పింది” అనే మరో సినిమా చేసింది.తరువాత కొన్ని మలయాళం సినిమాల్లో నటించింది, కానీ ఇవేవీ ఆమెకి అంతగా గుర్తింపునివ్వలేదు.
విశాల్ హీరోగా చేసిన ” పొగరు ” సినిమాలో పొగరుబోతు లేడి పాత్రలో చేసిన ఈమె నటనకి అందరూ ఫిదా అయ్యారు.ఈ ఒక్క సినిమాతో ఆమె నటిగా మంచి గుర్తింపు పొందింది.
ఇక ఇటీవల వచ్చిన SALAAR సినిమాతో ఈమె కెరీర్లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేదు.
అవకాశాలన్నీ ఇప్పటికే ఆమెకి క్యూ కట్టాయి.ప్రస్తుతం POWER STAR PAWAN KALYAN హీరోగా నటిస్తున్నభారీ ప్రాజెక్టు OG లో కీలకపాత్రలో నటిస్తుంది.