Snow covered China: చైనా ని మంచు దుప్పటి కప్పేసింది..స్కూళ్లు , రైళ్లు బంద్.
ప్రపంచం వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు ఒక్కో దేశం లో..ఒక్కో ప్రాంతంలో ఒక్కోలాగా ఉంటాయి. చలికాలం వచ్చిందంటే చాలు వెచ్చగా ఉండటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాము.
కానీ, చైనా లో ఆ అవకాశమే లేదన్నట్టుగా మంచు అక్కడ ప్రాంతాలను ముంచేసింది.ఉత్తరచైనాలోని అనేక ప్రాంతాలను ఒక్కరాత్రిలోనేమంచు కప్పేసింది.
రోడ్లపై కుప్పలు తెప్పలుగా మంచు తివాచి లాగా కప్పేసింది దీంతో చైనాలో జనజీవనం స్తంభించిపోయింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ప్రజల రోజువారీ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఉత్తరచైనాలోని అనేక ప్రాంతాలను ఒక్కరాత్రిలోనే మంచు దుప్పటి కప్పేసింది. దీంతో జనజీవనం
స్తంభించిపోయింది. భారీ మంచు ధాటికి రోడ్లన్నీ మూతపడ్డాయి. కుప్పలు తెప్పలుగా మంచు పేరుకుపోవడం వల్ల వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హెనాన్ ప్రావిన్స్ రాజధాని జెంగ్‌జౌలో తెల్లవారుజామున వరకు మంచు కురుస్తుండడం వల్ల రెడ్ అలెర్ట్ ను అధికారులుజారీ చేశారు .
రెండు నగరాల్లో వివిధ పాఠశాలలను మూసివేశారు. జెంగ్‌జౌ విమానాశ్రయం కూడా ఉదయం 11 గంటల వరకు మూసివేశారు. అనేక విమానాలను రద్దు చేసినట్లు సమాచారం. పలు రైళ్లను కూడా రద్దు చేశారు. 187 బస్సు మార్గాలను నిలిపివేసినట్లు బీజింగ్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ గ్రూప్ తెలిపింది.
చైనాలో చాలా ప్రాంతాల్లో ఇదే తొలి హిమపాతమని అక్కడి అధికారులు తెలిపారు. బీజింగ్ రోడ్లపై పేరుకుపోయిన మంచును తొలగించే పనులను అధికారులు చేపట్టారు.
దీంతో కొంతవరకు రోడ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి.ఉత్తరచైనాలోని అనేక ప్రాంతాలను మంచు ముంచెత్తింది. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. రోజువారీ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది
భారీ మంచు ధాటికి రోడ్లన్నీ మూతపడ్డాయి. కుప్పలు తెప్పలుగా మంచు పేరుకుపోవడం వల్ల వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.ఉత్తర చైనాలోని అనేక ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఉత్తర చైనాలోని అనేక ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ప్రావిన్స్‌లోని రెండు నగరాల్లో పాఠశాలలను జెంగ్‌జౌ విమానాశ్రయం కూడా మూసివేశారు.
పలు రైళ్ల రాకపోకలను నిలిపివేశారు.చైనాలో చాలా ప్రాంతాల్లో ఇదే తొలి హిమపాతమని అక్కడి అధికారులు తెలిపారు.బీజింగ్‌లో రోడ్లపై పేరుకుపోయిన మంచును తొలగించే పనులను అధికారులు చేపట్టారు