So beautiful..so elegant..just looking like a wow: సో బ్యూటీఫుల్..సో ఎలిగెంట్జ..స్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్.

So beautiful..so elegant..just looking like a wow

So beautiful..so elegant..just looking like a wow: సో బ్యూటీఫుల్..సో ఎలిగెంట్…జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్.

దీపికా పదుకొణె ఈ పేరుకు అసలు పరిచయమే అవసరం లేదు. భారతీయ సినీ అభిమానులకు ఈ బ్యూటీ ఆల్ టైమ్ ఫేవరేట్ అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. తన సహజసిద్ధమైన నటనతో అందంతో అందరి మనసులను గెలుచుకుంది ఈ చిన్నది.

సినీరంగంలో గాడ్ ఫాదర్స్ ఎవరూ లేకున్నా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. పెళ్లైనా కూడా బాలీవుడ్‎లో స్టార్ హీరోయిన్ స్థానంలో కొనసాగుతూ అప్ కమింగ్ హీరోయిన్లకు ఇన్స్పిరేషన్ గా నిలుస్తోంది.

యాక్టింగ్‎తో ఇరగదీయమే కాదు తన ఫ్యాషన్ గేమ్‎తో ప్రజలను ఆకట్టుకుంటూనే ఉంటుంది దీపికా. ఇటీవల లాస్ ఏంజిల్స్‏లో జరిగిన ప్రతిష్టాత్మక అకాడమీ మ్యూజియం గాలాలో ఆమె తనదైన ఫ్యాషన్ ముద్ర వేసింది. ఆస్కార్ బోర్డు నిర్వహించే ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన తొలి భారతీయ నటి దీపికా కావడం విశేషం.

ఈ ఈవెంట్‎లో దీపికా లుక్స్ అందరినీ ఫిదా చేశాయి. కస్టమైజ్డ్ లూయిస్ విట్టన్ గౌన్‎లో రెడ్ కార్పెట్‏పై నడిచిన ఈ బాలీవుడ్ క్వీన్ స్టైల్‎ను ప్రదర్శించింది.

అంతేకాదు స్టైల్ ఐకాన్‎గా తన స్థానాన్ని హైలైట్ చేసింది. డార్క్ బ్లూ గౌనులో ఈ జవాన్ బ్యూటీ రెడ్ కార్పెట్‎పై మెరిసింది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఆస్కార్ అవార్డుల వేడుకలోనూ దీపికా లూయిస్ విట్టన్ డిజైన్ చేసిన ఆఫ్-ది-షోల్డర్ డిజైన్ తో కూడిన బ్లాక్ వెల్వెట్ గౌన్‎ను ధరించి ఫ్యాషన్ ప్రియుల మనసు దోచింది.

ఇప్పుడు అకాడమీ మ్యూజియం గాలాలోనూ ఈ భామ లూయిస్ విట్టన్ డిజైన్స్ నుంచి అద్భుతమైన రాయల్ బ్లూ గౌను వేసుకుని ఈ లగ్జరీ బ్రాండ్‎తో తనకున్న అనుబంధాన్ని బలపరిచింది.

ఆఫ్-ది-షోల్డర్ డిజైన్ , క్లాసీ నెక్ లైన్ తో వచ్చిన ఈ గౌను అందరి దృష్టిని ఆకర్షించింది. లూయిస్ విట్టన్ డిజైనింగ్ నైపుణ్యాన్ని, అమ్మడి అందాలను తెగ పొగిడేస్తున్నారు ఫ్యాషన్ లవర్స్. ఈ అవుట్ ఫిట్‏లో దీపికా పదుకొణె ఒంపులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.

కాలిఫోర్నియాలో జరిగిన ఈ అకాడమీ మ్యూజియం గాలా ఈవెంట్ కు సంబంధించిన ఫోటోలను దీపికా పదుకొణె ఇన్‎స్టాగ్రామ్‎లో షేర్ చేసింది. దీపికా బస చేసిన హోటల్ లో దిగిన చిత్రాలు ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.

వెల్వెట్‌ కలర్‌ డ్రెస్‌లో హొయలు పోతూ కెమెరాకు స్టన్నింగ్ పోజులిచ్చింది ఈ బ్యూటీ. అందరి మైండ్ బ్లాక్ చేసింది. దీపికా డీప్ నెక్‎లైన్, స్లీవ్ లెస్ , బాడీ ఫిట్ ఇండిగో బ్లూ గౌన్ ధరించింది.

ఈ గౌనుకు మరింత అట్రాక్షన్ ను తీసుకువచ్చేందుకు దీపికా చెవులకు ఇయర్ రింగ్స్, చేతి వేళ్లకు స్టేట్మెంట్ రింగ్స్, బ్రాస్లెట్లతో మెడలో అద్భుతమైన డైమండ్ ఆభరణాలను ధరించింది. తన మేకోవర్ ను అద్భుతంగా మలుచుకుంది.

Add a heading 2023 12 05T141717.285 So beautiful..so elegant..just looking like a wow: సో బ్యూటీఫుల్..సో ఎలిగెంట్జ..స్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్.

దీపికా ఈ ఏడాది జవాన్‌ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ఈ మూవీలో వన్ ఆఫ్‌ ది ఫీ మేల్ లీడ్ రోల్‌లో కనిపించి ప్రేక్షకుల మనసును గెలుచుకుంది. ప్రస్తుతం దీపికా వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉంది.

అయినప్పటికీ తనకెంతో ఇష్టమైన ఫ్యాషన్ రంగానికి కూడా తగిన ప్రాధాన్యతను అందిస్తోంది. అప్పుడప్పుడు జరిగే ఇలాంటి ప్రెస్టీజియస్ ఈవెంట్స్‎లో అద్భుతమైన అవుట్ ఫిట్స్ ధరించి అందరికీ స్ఫూర్తిని అందిస్తోంది.

ఇక సినిమాల విషయానికి వస్తే దీపికా ప్రజెంట్ సిద్దార్థ్‌ ఆనంద్ డైరెక్షన్‎లో హృతిక్ రోషన్ టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న స్పిరిట్‌ ఆఫ్‌ ఫైటర్‌ మూవీలో ‌దీపికా పదుకొనే ఫీ మేల్‌ లీడ్ గా కనిపించనుంది.

యాకామ్‌ 18 స్టూడియోస్‌-మార్‌ఫ్లిక్స్‌ పిక్చర్స్‌ సంయుక్తంగా ఈ మూవీని ప్రొడ్యూజ్ చేస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 25న వరల్డ్ వైడ్ గా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

మరోవైపు తెలుగులోనూ ఈ భామ ఇంట్రీ ఇవ్వబోతోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ నటిస్తున్న కల్కీ 2898 ADలో హీరోయిన్‎గా నటిస్తోంది. ఇవే కాకుండా హిందీలో దీపికా సింగ్ అగేన్‎లో కూడా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది.

Leave a Comment