Sobhita Dhulipalla Stylish Looks: శోభితా దూళిపాళ్ల…స్టైలిష్ లుక్స్‎కు కుర్రాళ్లు ఫిదా

Sobhita Dhulipalla Stylish Looks

Sobhita Dhulipalla stylish looks: శోభితా దూళిపాళ్ల…స్టైలిష్ లుక్స్‎కు కుర్రాళ్లు ఫిదా

శోభితా దూళిపాళ్ల ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. నటించింది తక్కువ సినిమాల్లో అయినప్పటికీ తన గ్లామర్, యాక్టింగ్‏తో అందరినీ ఫిదా చేసేసింది ఈ వైజాగ్ బ్యూటీ. తెలుగు అందం అయినప్పటికీ తన సినీ కెరీర్ ను మాత్రం బాలీవుడ్ నుంచి స్టార్ట్ చేసింది.

ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న సామెతను పక్కన పెట్టి బాలీవుడ్‏లో తన టాలెంట్ చూపించి ఇప్పుడు తెలుగులో అవకాశాలను చేజిక్కించుకుంటోంది.

దీనితో ఇటు తెలుగు, అటు తమిళం, హిందీ భాషల్లోనూ పలు ప్రాజెక్టులు చేస్తూ ఇండస్ట్రీలో తన ప్రయాణాన్ని సాఫీగా కొనసాగిస్తోంది.

అయితే అప్పట్లో ఈ బ్యూటీకి అక్కినేని హీరో నాగ చైతన్యకు మధ్య సమ్‎థింగ్..సమ్‎థింగ్ అన్న రూమర్స్ జోరుగా వినిపించాయి. ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఇవన్నీ పక్కన పెడితే సోషల్ మీడియాలో ఈ భామకు మంచి ఫాలోయింగ్ ఉంది.

అందుకు తగ్గట్లుగానే శోభితా అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్ పిక్స్‎ను తన పర్సనల్ అకౌంట్‎లో షేర్ చేస్తూ తన ఫాలోవర్స్‏ను ఖుషీ చేస్తుంది.

ఈ మధ్య టాలీవుడ్ , బాలీవుడ్, బుల్లితెర అన్న తేడా లేకుండా ముద్దుగుమ్మలు అందరూ తమ అందాల ఆరబోతతో సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. నెట్టింట్లో గ్లామర్ షో చేస్తూ భారీ ఫాలోవర్స్‎ను సొంతం చేసుకుంటున్నారు. అలాంటి ముద్దుగుమ్మల్లో శోభితా ధూళిపాళ్ల ఒకరు.

ఈ భామ ఫ్రీ టైం ఉన్నప్పుడల్లా సోషల్ మీడియాలో హీట్ పెంచుతుంది. తన ఘాటు అందాలతో కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. సోషల్ మీడియాలో యమ యాక్టివ్‎గా ఉండే ఈ భామ ప్రస్తుతం సినిమాలతో, వెబ్ సిరీస్‎లతో ఫుల్ బిజీగా ఉంది.

30 ఏళ్ల ఈ సుందరి హిందీ, తమిళ్ భాషల్లో వరుస అవకాశాలతో దూసుకు‎పోతూనే మరో వైపు తన ఫ్యాన్స్‎ను ఇంప్రెస్ చేయాలనే ఉద్దేశంతో తాజాగా అద్భుతమైన ఫోటోలు షేర్ చేసింది. శోభితా తాజాగా షేర్ చేసిన ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈమె అందానికి అభిమానులు ఫిదా అవుతున్నారు.

ఈ ఫోటోల్లో స్టన్నింగ్ లుక్స్‎లో అందరినీ ఆకర్షిస్తోంది శోభితా. ఆమె అందాల ఆరబోతను చూసి కుర్రకారంతా పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. అద్భుతమైన డిజైనర్ దుస్తుల్లో శోభితా ఓ రేంజ్‎లో మెరిసిపోయింది.

క్లివేజ్ షో తో అందరి చూపు ఆమెపై పడేలా చేస్తోంది. ప్లెయిన్ వైట్ షర్ట్ , బ్లాక్ కలర్ ఫార్మల్ ట్రౌజర్ , లెదర్ జాకెట్‌ వేసుకుని అదరగొట్టింది శోభితా. పర్ఫెక్ట్ బాస్ బేబ్ లుక్‌లో చంపేస్తోంది .

శోభితా ధూళిపాలా అద్భుతమైన ఫ్యాషన్‌వాది. నటి తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో తన ఫ్యాషన్ డైరీల నుండి అనేక ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాషన్ ప్రియులకు ఇన్స్పిరేషన్ అందిస్తుంది.

కాక్‌టెయిల్ పార్టీస్ వేర్ నుంచి ట్రెడిషనల్ అవుట్ ఫిట్స్ వరకు అన్నింట్లోనూ శోభితా ఒదిగిపోతుంది. అమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ప్రతి ఫోటో తో, ఫ్యాషన్ ప్రియులను నోట్స్ చేసుకోవడానికి

ఉవ్విళ్లూరుతుంటారు. ఫ్యాషన్ స్టైలిస్ట్ భావనా ​​శర్మ శోభితకు స్టైలిష్ లుక్స్ అందించింది. ఈ అవుట్ ఫిట్‎కి తగ్గట్లుగా మెడలో గోల్డెన్ నెక్ చైన్, చెవులకు గోల్డ్ రింగులు, పాదాలకు బ్లాక్ పాయింటెడ్ లెదర్ ఫుట్ వేర్, చేతిలో సిల్వర్ సీక్విన్డ్ పర్సు పట్టుకుని శోభిత తన లుక్‎ కి పూర్తి వైబ్‌స్ అందించింది. మేకప్ ఆర్టిస్ట్ సోనమ్ చందనా సాగర్ శోభిత అందాలకు మరింత మెరుగులు దిద్దింది.

Leave a Comment