Bhumi Pednekar hot Looks: సొగసు చూడతరమా..హీట్ పెంచుతున్న బాలీవుడ్ బ్యూటీ.

Sogasu Chhotarama..Bollywood beauty who is turning up the heat.

Bhumi Pednekar hot Looks: సొగసు చూడతరమా..హీట్ పెంచుతున్న బాలీవుడ్ బ్యూటీ.

ఇన్ స్టాగ్రామ్ క్వీన్, బాలీవుడ్ బ్యూటీ భూమి పెడ్నేకర్ అద్భుతమైన ఫ్యాషన్ ప్రియురాలు. నా నటనతో వెండితెర మీద సందడి చేయడం మాత్రమే కాదు, ఫ్యాషన్ తోను పిచ్చెక్కించగలదు.

తన ఫ్యాషన్ డైరీలలోని ప్రతి లుక్ తో ఫ్యాషన్ లవర్స్ ను ఉర్రూతలూగించే పనిలో పడిపోతుంది ఈ చిన్నది. లేటెస్ట్ గా భూమి పెడ్నేకర్ కొన్ని ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

అద్భుతమైన నెట్టెడ్ డిజైనర్ చీరను వయ్యారంగా కట్టుకుని హాట్ భంగిమల్లో దిగిన ఫోటోలు ఇంటర్నెట్ లో అలజడిని సృటిస్తున్నాయి. భూమి అందాలకు అభిమానులు దాసోహం అవుతున్నారు.

మోడర్న్ లుక్ నుంచి ట్రెడిషనల్ వేర్ వరకు అన్నింటిని ధరించి ఎలా అట్రాక్ట్ చేయాలో భూమికి బాగా తెలుసు. హాలిడే టూరైనా అవార్డుల ఫంక్షనైనా,ఎలాంటి రూపాన్నైనా అప్రయత్నంగా చేయగలదు ఈ బ్యూటీ కటౌట్ జాకెట్ దానికి మ్యాచింగ్ గా నెట్టెడ్ ఎంబ్రాయిడరీ చీరను కట్టుకుని తాజాగా తన ఫ్యాషన్‌ను సరికొత్త స్థాయికి తీసుకువెళ్లింది.

ఓ ఈవెంట్ కోసం భూమి అందమైన చీరను కట్టుకుంది. ప్రముఖ సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్ మనిష్ మల్హోత్రా డెజైనర్ షెల్ఫ్‌ల నుండి భూమి ఈ డ్రెస్ ను సెలెక్ట్ చేసుకుంది. సెలబ్రిటీ స్టైలిస్ట్‌లు మోహిత్రాయ్ శుభి కుమార్ లు భూమికి స్టైలిష్ లుక్స్ అందించారు.

భూమి పెడ్నేకర్ హాట్ సినిమాలతో పాటు, సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తన ప్రొఫెషనల్ విషయాలతో పాటు ఫ్యాషన్ ఫోటోషూట్ పిక్స్ ను కూడా ఇన్ స్టాగ్రామ్ లో వదులుతూ ఫాలోవర్స్ ని ఇంప్రెస్ చేస్తూ ఉంటుంది.

అందులో భాగంగానే లేటెస్ట్ గా చీరతో దిగిన ఫోటోలను కూడా పంచుకుంది. ఆమె బాడీ స్ట్రక్చర్ కు తగ్గట్లుగా చీర కట్టులో భూమి చాలా అందంగా కనిపించింది. ఈ చీర లుక్ లో భూమి దిగిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.

ఇంస్టాగ్రామ్ లో ఫాలోవర్స్ అమ్మడి లుక్ కి ఫిదా అయ్యారు.. భూమి అభిమానులు కొందరు హార్ట్ ఎమోజీలను ఇన్బాక్స్ లో వదులుకున్నారు.

నటన మీద ఇంట్రెస్ట్ తో భూమి యాక్టింగ్ లో స్పెషల్ కోర్స్ చేసి బాలీవుడ్ వైపు అడుగులు వేసింది. భూమి అద్భుతమైన నటి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

తను నటించిన మొదటి సినిమా నుంచి అమ్మడి న్యాచురల్ యాక్టింగ్ అందరిని ఫిదా చేసింది. 2015 లో శరత్ కటారీయ డైరెక్షన్లో, యశ్వంత్ ఫిల్మ్స్ రూపొందించిన దమ్ లాగాకి హైషా మూవీతో బాలీవుడ్ లోకి నటిగా ఎంటర్ అయ్యింది.

తన ఫస్ట్ మూవీ తోనే బాలీవుడ్ డెబ్యూ ఫిమేల్ ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డును పొందింది.

ఆ తర్వాత టాయిలెట్, ఏక్ ప్రేమ కథ, పత్ని ఔర్ వో, గోవిందా నామ్ మేరా వంటి ఎన్నో సినిమాల్లో నటించి తన నటనతో అందరి హృదయాలను గెలుచుకుంది.

ప్రస్తుతం భక్షక్, ది లేడీ కిల్లర్ వంటి సినిమాల్లో నటిస్తోంది. ఈ మూవీస్ నెక్స్ట్ ఇయర్ విడుదల అయ్యేందుకు రెడీగా ఉన్నాయి.

Leave a Comment