Sonia Gandhi’s 78th birthday celebrations: ఘనంగా జరుగుతున్న సోనియాగాంధీ 78వ పుట్టినరోజు వేడుకలు.
కాంగ్రేస్ మాజీ అధ్యక్షురాలైన సోనియాగాంధీకి ఈ రోజు అంటే డిసెంబర్ 9వ తారీఖున 77వ సంవత్సరంలోకి అడుగు పెట్టనున్నారు.భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ భార్య ఈ సోనియా గాంధీ. ఈవిడ ఇటలీకి చెందిన లూసియానాలో డిసెంబర్ 9వ తారీఖున 1946లో జన్మించారు.
1991లో రాజీవ్ గాంధీ హత్య తరువాత ఎంతమంది ఆమెని ప్రధాని పదవి తీసుకోమని అడిగినా ఆమె నిరాకరించారు. ఆ తరువాత 1977లో రాజకీయీయల్లోకి ప్రవేశించారు. 1998లో కాంగ్రేస్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.
ఇక ఆమె పుట్టినరోజు విషయానికి వస్తే, చాలా మంది ప్రముఖులు, రాజకీయ నేతలు ఆమెకి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.ఈ సందర్బంగా దేశప్రధాని నరేంద్రమోడీ తన ట్విట్టర్ X వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
ఆమెకి దీర్ఘాయుష్షు మరియు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమని రాసారు.కాంగ్రేస్ ముఖ్య నేత అయినా మల్లిఖార్జున ఖర్గే ఎక్స్ పోస్ట్ ద్వారా ” కాంగ్రేస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ శ్రీమతి గారికి నమస్కారాలు..
సోనియా గాంధీ గారి పుట్టిన రోజు సందర్బంగా, అణగారిన వర్గాల హక్కుల కోసం కనికరం లేని న్యాయవాది, ధైర్యసాహసాలు, నిస్వార్ధ త్యాగంతో కష్టాలను ఎదుర్కునే వ్యక్తి , ఆమె దీర్ఘాయుష్షుతో ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను ” అని అన్నారు.
శశి థరూర్ కాంగ్రేస్ పార్టీని ఎంతో గొప్పగా నడిపించారని, కార్యకర్తలకు, నాయకులకు స్ఫూర్తి దాయకం అని అన్నారు. ట్విట్టర్ ఎక్స్ వేదికగా ” శ్రీమతి సోనియా గాంధీ గారికి అద్భుతమైన పుట్టినరోజు మరియు రాబోయే అద్భుతమైన సంవత్సరం శుభాకాంక్షలు. ఆమె ఆరోగ్యన్ని, ఆనందాన్ని ఆస్వాదిస్తూ పార్టీకి మార్గనిర్ధేశం చేస్తూ ఉండాలి” అని థరూర్ అన్నారు.
ఇంకా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, తమిళనాడు ముఖ్యమంత్రి అయిన ఎంకె స్టాలిన్ తదితర నేతలు సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఇక హైదరాబాద్ లో సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు గాంధీభవన్ లో జరుగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి , కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంత రావ్ తో స్వయంగా కేక్ కట్ చేయించారు.