త్వరలో BJP ద్వారా CM రేవంత్ రెడ్డి కూడా అరెస్టు – AAP లీడర్ సంజయ్ సింగ్

website 6tvnews template 2024 04 05T122953.394 త్వరలో BJP ద్వారా CM రేవంత్ రెడ్డి కూడా అరెస్టు - AAP లీడర్ సంజయ్ సింగ్

ఇటీవల లిక్కర్ స్కామ్ కేసులో ఇరుక్కుని ఇటీవల జైలు నుంచి బెయిల్ పై విడుదలైన AAP – MP సంజయ్ సింగ్ తెలంగాణ CM రేవంత్ రెడ్డిపై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుతో భారత దేశంలో ప్రజాస్వామ్యం అనేది లేకుండా చేసేసారని ఆయన BJP పై విమర్శలు చేసారు. ఇప్పుడు వంతులు వారిగా చూస్తే తెలంగాణ CM రేవంత్ రెడ్డిని ఆ తర్వాత తమిళనాడు CM స్టాలిన్ ని ఆ తర్వాత పంజాబ్ CM భగవంత్ మాన్‌లను కూడా అరెస్ట్ చెయ్యడం జరుగుతుంది అని ఆయన జ్యోస్యం చెప్పారు. తర్వాత వారిని రాజీనామా చేయాలని కూడా BJP ఒత్తిడి చేస్తుందని అని ఆయన అన్నారు. దేశంలో BJP మాత్రమే ఉండాలి అనుకుంటోంది అని ఆయన విమర్శించారు. అసలు భారత దేశం లో ఇతర పార్టీలు అనేవి ఉండకూడదనేదే ప్రధాని మోడీ టార్గెట్ అని AAP – MP సంజయ్ సింగ్ అన్నారు.

మొదట ఓ రెండు తప్పుడు కేసులు పెట్టాలి అని ఆ తర్వాత వారిని అరెస్ట్ చేసి రాజీనామా చేయాలని చెప్తారని ఆ తర్వాత వారి మీద ఒత్తిడి తీసుకురావాలి అని BJP ప్లాన్ అని ఆయన అన్నారు. ఇలా చెయ్యడం అనేది BJP కి, ED కి ఇది చాలా తేలికైన పని ఆయన ఘాటుగా విమర్శించారు. CM కేజ్రీవాల్‌పై రెండు తప్పుడు ఎFIR లు పెట్టి ఆయన చేత రాజీనామా చేయాలని ఒత్తిడి తీసుకువస్తున్నారని అన్నారు. అలాగే రేపు భగవంత్ మాన్‌పై కుడా రెండు తప్పుడు కేసులు పెట్టి ఆపై ఆయన్ని కూడా అరెస్ట్ చేసి జైలు లో పెట్టండి అని BJP నేతలు ED కి చెప్తారని ఆయన అన్నారు. ఆ తర్వాత ఆయన చేత రాజీనామా చేయాలని డిమాండ్ చేయండి అని చెప్తారు అని ఆయన అన్నారు.

కుదిరితే మమతా బెనర్జీతో కూడా అదే విధం చెయ్యమని చెప్తారని ఆయన అన్నారు. ఇప్పటికే CM రేవంత్ రెడ్డి, CM సిద్ధరామయ్య, CM విజయన్ – కేరళ , CM స్టాలిన్, CM చంపై సోరెన్, హేమంత్ సోరెన్‌లపై కేసులు పెట్టారని ఆయన అన్నారు . అసలు భారత దేశంలో ప్రతిపక్షాన్ని అంతం చేయడమే BJP ప్రధాన ఉద్దేశ్యం అని ఆయన అన్నారు.

Leave a Comment