త్వరలో యాదాద్రి పుణ్యక్షేత్రం పేరును మారుస్తున్నట్లు ప్రభుత్వ విప్ అలీరు MLA బీర్ల అయిలయ్య చెప్పారు.
ఆలయం దగ్గర కొబ్బరికాయ కొట్టే స్ధలాన్ని ఆయన ప్రారంబించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వందల ఏళ్ల చరిత్ర కల్గిన యాదగిరి గుట్ట పేరును గత ప్రభుత్వం పేరు మార్చింది అని అప్పుడు యాదాద్రి గా నామకరణం చేసారని చెప్పారు.
అంతే కాదు భద్రాచలం రాముడు కొలువై ఉన్న భద్రాచలం పేరును కూడా మార్చడం జరిగింది అని చెప్పారు. ఇది ఆలయ సంప్రదాయానికి విరుద్ధం అని చెప్పారు. తెలంగాణ ఆత్మ గౌరవం, తెలంగాణా సంస్కృతి కి చెందిన పదాలే మనకు ముఖ్యం అని ఆయన చెప్పారు.
60 ఏళ్ళ పాటు పోరాడి కోట్లాడి సంపాదించుకున్న తెలంగాణ లో ఆంధ్ర పదాలు ఉండకుండా చూడ మని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారని ఆయన అన్నారు. అందుకే త్వరలో యాదాద్రికి మరల పాత పేరునే కొనసాగించాలి అనుకున్నామని ఆయన చెప్పారు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయ సందర్శన కు వస్తారని ఆయన చెప్పారు. వచ్చి నపుడు ఆయన చేతుల మీదుగా మళ్ళి యాదాద్రిని యాదగిరి గుట్ట గా నామకరణం చేస్తారని ఆయన చెప్పారు .