Rajamouli On SSMB29: మరో అందగాడిని తీసుకొస్తా…జపాన్ వాసులకు రాజమౌళి మాట

WhatsApp Image 2024 03 19 at 12.04.52 PM Rajamouli On SSMB29: మరో అందగాడిని తీసుకొస్తా…జపాన్ వాసులకు రాజమౌళి మాట

ఆర్ఆర్ఆర్ (RRR ) సినిమా తర్వాత దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుతో (Mahesh Babu) మరో సహసోపేతమైన మూవీ చేయబోతున్న విషయం తెలిసిందే. మహేష్, జక్కన్నల సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి కథ తెలియకముందే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆర్ఆర్ఆర్ (RRR)కి మించి ఈ ప్రాజెక్ట్ ఉండబోతోందని మహేష్ ఫ్యాన్స్ ముందుగానే సినిమాపై ఆశలు పెంచుకుంటున్నారు.

ఈ మూవీ ట్రెజర్ హంట్, యాక్షన్ అడ్వెంచర్ మూవీ అని ఇప్పటికే రాజమౌళి రివీల్ చేశారు. జక్కన్న తండ్రి రచయిత విజయేంద్రప్రసాద్ (Vijayendra Prasad) కథను కూడా పూర్తి చేశారు. సినిమాలో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు మహేష్ కూడా రీసెంట్ గా జర్మనీ వెళ్లి ట్రెక్కింగ్ లో ట్రైనింగ్ తీసుకుని మరీ వచ్చాడు. ఈ మూవీ గురించి రోజూ ఏదో ఒక న్యూస్ వినిపిస్తూనే ఉంది. తాజాగా డైరెక్టర్ రాజమౌళి జపాన్ (Japan)వెళ్లారు. అక్కడ తన అప్‎కమింగ్ మూవీ అప్డేట్స్ గురించి ప్రేక్షకులతో మాట్లాడారు. త్వరలో మరో తెలుగు అందగాడిని జపాన్ తీసుకొస్తానని రాజమౌళి అనౌన్స్ చేశాడు. దీంతో ఈ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

WhatsApp Image 2024 03 19 at 12.05.39 PM Rajamouli On SSMB29: మరో అందగాడిని తీసుకొస్తా…జపాన్ వాసులకు రాజమౌళి మాట

హీ ఈజ్ వెరీ హ్యాండ్సమ్ :

‘ఆర్ఆర్ఆర్’ (RRR) మూవీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా జపాన్ (Japan) ప్రేక్షకులకు ఈ సినిమా విపరీతంగా నచ్చింది. జపాన్ లో ఇప్పటికీ ఈ సినిమా సక్సెస్‏ఫుల్‎గా ప్రదర్శింపబడుతోంది. ఈ క్రమంలో తాజాగా జపాన్ లో జరిగిన ఓ కార్యక్రమానికి రాజమౌళి (Rajamouli) హాజరయ్యారు. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి అక్కడి ప్రేక్షకులతో ఆయన మాట్లాడారు. ” నా నెక్స్ట్ మూవీ స్క్రీప్ట్ వర్క్ కంప్లీట్ అయ్యింది.

ప్రజెంట్ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. హీరో తప్ప మిగిలిన యాక్టర్స్ సెలెక్షన్ ఇంకా జరగలేదు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) నా సినిమాలో హీరోగా నటిస్తారు. హి ఈజ్ తెలుగు యాక్టర్. జపాన్ ప్రజలకు ఆయన సుపరిచితుడే .హి ఈజ్ వెరీ హ్యాండ్సమ్. త్వరలో షూటింగ్ స్టార్ట్ చేస్తాం. వీలైనంత త్వరగా మూవీ పూర్తి చేయాలని ఆశిస్తున్నాం. ఆ సినిమా రిలీజ్ కోసం మళ్లీ జపాన్ వస్తాను. నా వెంట మహేష్ ను తీసుకువస్తాను”. అని రాజమౌళి తెలిపారు.

హీరోయిన్ గా ఇండోనేషియన్ బ్యూటీ :

మహేష్ బాబు (Mahesh Babu)తో రాజమౌళి(Rajamouli)సినిమా అని చెప్పినప్పటి నుంచి ఈ మూవీపై రోజుకో రూమర్ పుట్టుకొస్తుంది . ఈ భారీ ప్రాజెక్ట్ లో టాలీవుడ్ మన్మథుడు నాగార్జున (Nagarjuna) నటిస్తున్నారని ఇండస్ట్రీ లో టాక్ వినిపిస్తుంది. అయితే దీని పై మేకర్స్ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. అదే విధంగా హాలీవుడ్ లోనూ వసూళ్ల వర్షం కురిపించాలానే ఉద్దేశంతో ఈ సినిమాలో హాలీవుడ్ హీరోయిన్ ను తీసుకోనున్నారని టాక్ వినిపిస్తోంది.

WhatsApp Image 2024 03 19 at 12.06.09 PM Rajamouli On SSMB29: మరో అందగాడిని తీసుకొస్తా…జపాన్ వాసులకు రాజమౌళి మాట

ప్రముఖ ఇండోనేషియన్ యాక్ట్రెస్ చెల్సియా ఎలిజాబెత్ ఇస్లాన్ (chelsea elizabeth islan)మహేష్ కు జోడీగా కనిపించనుందని సమాచారం. అయితే ఈ న్యూస్ ఎంత వరకు వాస్తవం అన్నదని పై స్పష్టత లేదు. ఇదిలా ఉంటే మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం చెల్సియా ఇస్లాన్ ఈ సినిమాలో ఖచ్చితంగా నటిస్తుందని అంటున్నారు. ఎందుకంటే జక్కన్నను ఇన్ స్టాగ్రామ్ లో చెల్సియా ఇస్లాన్ ఫాలో అవుతుంది. దాంతో మహేష్ మూవీలో ఈ భామ ఫిక్స్ అని మహేష్ ఫ్యాన్స్ క్లారిటీకి వచ్చారు.

Leave a Comment