Priyamani: మాకేం తక్కువ.. కాస్త కలర్ అంతేగా

website 6tvnews template 2024 03 29T165203.213 Priyamani: మాకేం తక్కువ.. కాస్త కలర్ అంతేగా

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన బాహుబలి (Bahubali)ఎంతటి సెన్సేషనల్ హిట్ సాధించిందో అందరికీ తెలుసు. ప్రభాస్ (Prabhas)హీరోయిజం, రాణా(Rana) విలనిజం, అనుష్క (Anushka), తమన్నా (Tamannah)అందం అన్నింటికి మించి రాజమౌళి దర్శకత్వం అందరిని ఆకట్టుకుంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచ సినీ ప్రేక్షకుల హృదయాలను దోచేసింది. బాహుబలి రాకముందు వరకూ దక్షిణాది సినీ పరిశ్రమపై బాలీవుడ్‌కి చాలా చిన్నచూపు ఉండేది.

కానీ బాహుబలి తర్వాత సీన్ మారిపోయింది. సౌత్ నుంచి రిలీజైన చాలా వరకు సినిమాలు పాన్ ఇండియా లెవల్లో బాక్సాఫీస్‌ను షేక్ చేసేశాయి. ఆర్ఆర్ఆర్(RRR) సినిమా అయితే ఏకంగా ఆస్కార్ (Oscar)అవార్డును గెలుచుకుని తెలుగోడి సత్తా ఏంటో చూపించింది. దీంతో సౌత్ యాక్టర్స్, టెక్నీషియన్లకు బాలీవుడ్ లో బాగా క్రేజ్ వచ్చింది.

WhatsApp Image 2024 03 29 at 4.46.18 PM 1 Priyamani: మాకేం తక్కువ.. కాస్త కలర్ అంతేగా

సౌత్ టాలెంట్ కు నార్త్ స్టార్స్ ప్రశంసలు కురిపించడం ఈ మధ్య చాలా కామన్ అయిపోయింది. అయితే ఇప్పటికీ కొంతమంది బాలీవుడ్ Vs సౌత్ అంటూ నెట్టింట్లో డిస్కస్ చేస్తుంటారు. లేటెస్టుగా దీనిపై సౌత్ స్టార్ బ్యూటీ ప్రియమణి (Priyamani) రియాక్ట్ అయ్యింది. మాకేం తక్కువ అంటూ హాట్ కామెంట్స్ చేసింది. ఇప్పుడు ఈ కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

ఓ ఇంటర్వ్యూలో ప్రియమణి మాట్లాడుతూ…” నా దృష్టిలో నార్త్-సౌత్ అనే తేడా ఏం లేదు. ఇప్పుడు సౌత్ హీరోలు , హీరోయిన్లు అన్ని ఇండస్ట్రీల్లో కనిపిస్తున్నారు. బాలీవుడ్ యాక్టర్స్ కూడా ఇప్పుడు సౌత్ సినిమాల్లో నటిస్తున్నారు. కానీ కొంతమంది నార్త్ దర్శకులు ఇప్పటికీ మీది దక్షిణాదికి చెందిన క్యారెక్టర్ కాబట్టి మీకు ఛాన్స్ ఇస్తున్నామంటారు.

కానీ త్వరలోనే ఈ ఆలోచన కూడా మారుతుంది. మారాలని కోరుకుంటున్నా. దక్షిణాదికి చెందిన వారిమే అయినా మేము హిందీ బాగా మాట్లాడగలం. పవర్‎ఫుల్ డైలాగులు చెప్పగలం…ఎమోషన్స్‌ను బాగా పండించగలం. అంతే కాదు అందంగా కూడా ఉంటాం. కాకపోతే మా రంగు తక్కువ అంతే. మిగతాదంతా నార్త్ హీరోయిన్ల లాగే చేస్తాం. అయినా ఇప్పటికీ ఈ తేడా ఎందుకు అందరూ భారతీయులమే కదా” అని ప్రియమణి కామెంట్ చేసింది. ప్రియమని వ్యాఖ్యలకు చాలా మంది నెటిజన్లు మద్దతు ఇస్తున్నారు.

WhatsApp Image 2024 03 29 at 4.45.34 PM 1 Priyamani: మాకేం తక్కువ.. కాస్త కలర్ అంతేగా

ప్రియమణి గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఒకప్పుడు సౌత్‌లో స్టార్ హీరోల పక్కన హీరోయిన్ గా నటించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. పెళ్లైన తర్వాత కాస్త సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ప్రముఖ టీవీ షోలల్లో జడ్జ్ గా వ్యవహరించింది. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీ నుంచి మంచి ఆఫర్స్ రావడంతో మళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. ప్రస్తుతం ప్రియమణి టాలీవుడ్, బాలీవుడ్‌లో పలు ప్రాజెక్టులతో బగా బిజీగా మారింది.

లాస్ట్ ఇయర్ షారుక్ ఖాన్ (Sharukh Khan)నటించిన జవాన్ (Jawaan) సినిమాలో కీలక పాత్రలో కనిపించింది ప్రియమణి. ఇక ఇప్పుడు అజయ్ దేవగణ్ (Ajay Devgan)నటిస్తున్న ‘మైదాన్‌’ (Maidan)మూవీలో ఛాన్స్ కొట్టేసింది. భారత లెజెండరీ ఫుట్‌బాల్‌ కోచ్‌ సయ్యద్‌ అబ్దుల్‌ రహీం (Sayed Abdul Rahim) బయోగ్రఫీ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కబోతోంది. జీ స్టూడియోస్‌ (Zee Studios),బోనీ కపూర్‌ (Boni Kapoor) సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. ఏప్రిల్‌ 10న ఈ సినిమా బాక్సాఫీస్ లో రిలీజ్ కానుంది.

Leave a Comment