South Actress Samantha Ruth Prabhu reveals her weight and metabolic age : ఏమాయ చేసావే (Em Maya Chesave )సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి తన నటనతో, అందంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచేసింది సౌత్ బ్యూటీ సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu) మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ.
ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ కొట్టేసి స్టార్ హీరోయిన్‌గా క్రేజ్ సంపాదించుకుంది. హీరోయిన్ గా ఫామ్ లో ఉన్నప్పుడే అక్కినేని నాగచైతన్యను ( Akkineni Naga Chaitanya ) ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కూడా తన కెరీర్ ని కంటిన్యూ చేసింది. అయితే కొన్ని మనస్పర్థల కారణంగా సామ్, చై డివోర్స్ తీసుకున్నారు. దీంతో చాలా ఒత్తిడికి గురైన సామ్ మయోసైటీస్ (Maositis ) వ్యాధి బారిన పడింది. దీంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చి తన హెల్త్ పై దృష్టి పెట్టింది.
అమెరికాలో ప్రత్యేకంగా ట్రీట్మెంట్ కూడా తీసుకుంది. మయోసైటీస్ వ్యాధి బారిన పడినప్పటి నుంచి సామ్ ఎక్కువసమయం యోగా, వ్యాయామానికి కేటాయిస్తోంది. అంతే కాదు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత అప్పుడప్పుడు తన జిమ్ వర్కౌట్ ఫోటోలను, వీడియోలను ఫాలోవర్స్ తో పంచుకుంటుంది. లేటెస్ట్ గా సమంత తన ఆరోగ్యానికి సంబంధించిన ఓ డాక్యుమెంట్ ని షేర్ చేసింది. అంతే కాదు తన ఏజ్, వెయిట్ గురించి చెప్పి అందరూ షాక్ అయ్యేలా చేసింది.
Samantha weight how much? : సమంత బరువు ఎంతో తెలుసా? :
ఫిట్నెస్ కు ప్రాధాన్యతనిచ్చే హీరోయిన్లలో సమంత (Samantha) ఒకరు. తన సోషల్ మీడియా అకౌంట్లో ఉన్న వీడియోలే అందుకు నిదర్శనం అని చెప్పవచ్చు. మయోసైటిస్(Maositis )తో బాధపడుతోన్న సమంత గత రెండు సంవత్సరాలుగా జిమ్‌లోనే ఎక్కువ సమయం గడిపేస్తోంది.
అందులోనూ భారీ వర్కవుట్స్ చేస్తూ అందరినీ షాక్ కి గురించేస్తోంది. సినిమాలకు దూరంగా ఉన్న సమంత ప్రస్తుతం హాలీడేలో ఉంది. అయితే ఎక్కడికి వెళ్లిందో తెలపక పోయినా తన డే ను ఎలా స్టార్ట్ చేస్తుందో చెప్తూ సమంత ఒక పోస్ట్‌ను షేర్ చేసింది.
అందులో తాను వ్యాయామం చేస్తూ ఎంతో ఫిట్ గా కనిపించింది. తన వెయిట్ 50.1 కిలోలు అని తెలిపింది. అందరిని అవాక్కు చేసింది. సమంతకు ప్రస్తుతం 36 ఏళ్లు. అయితే, ఆమె మెటాబోలిక్ ఏజ్ 23 మాత్రమే అని ఈ పోస్ట్ లో చెప్పింది. ఈ పోస్ట్ పై సమంత క్లోజ్ ఫ్రెండ్స్ ,సినీ సెలబ్రిటీస్ ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు.
Sam started podcast: పోడ్కాస్ట్ ప్రారంభించిన సామ్ :
గత సంవత్సర కాలంగా రెస్ట్ మోడ్ లోకి వెళ్లిపోయిన సమంత (Samantha ) ఈ మధ్యనే తన వర్క్‌ను మళ్లీ స్టార్ట్ చేసినట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో అప్డేట్ ఇచ్చింది . ఒక హెల్త్ పోడ్కాస్ట్ (Podcast ) ను స్టార్ట్ చేసినట్లు అనౌన్స్ చేస్తుంది. ఆమె చెప్పినట్లే తన ఫస్ట్ హెల్త్ పోడ్కాస్ట్‌తో అభిమానుల ముందుకు వచ్చింది.
ఆరోగ్యపరమైన అవగాహన, సలహాలు ఇవ్వడం కోసమే ఈ పోడ్కాస్ట్‌ను ప్రారంభించింది. అయినప్పటికీ సామ్ ఇందులో తన పర్సనల్ విషయాలకు సంబంధించి ఏమైనా ఆసక్తికరమైన విషయాలు చెప్తుందో ఏమో అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.