Special Pooja And Abhishekam For Ram lallaa: 125 కలిశాలతో బాలరామునికి మంగళస్నానం

website 6tvnews template 65 Special Pooja And Abhishekam For Ram lallaa: 125 కలిశాలతో బాలరామునికి మంగళస్నానం

ఇప్పటివరకు అయోధ్య(Ayodhya) అనేది కేవలం మాములు నగరం ఇక ఇప్పటి నుండి అయోధ్య మహానగరంగా మారిపోనుంది. రామ మందిర నిర్మాణం తో అయోధ్య దశ దిశ మారిపోనున్నాయి. అయోధ్య కి కొత్త శోభా సంతరించుకుంది.

రామ మందిర నిర్మాణాన్ని పూర్తి చేయక మునుపే అయోధ్య లోని రైల్వే స్టేషన్, ఎయిర్ పోర్ట్ లను పూర్తి స్థాయిలో ఆధునీకరించారు.

అలాగే అయోధ్య లోని బస్టాండ్ల రూపురేఖలు కూడా పూర్తిగా మారిపోయాయి. ఇక కేవలం కొన్ని గంటల మాత్రమే మిగిలి ఉంది అసలు కార్యక్రమానికి, రామ మందిరంలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ట(Ram lalla Idol)) కార్యక్రమ మహోత్సవం కోసం కోట్లాది మంది భారతీయులు ఎంతగానో నిరీక్షిస్తున్నారు.

అయోధ్యకు చేరుకుంటున్న సెలెబ్రెటీలు : Celebrities Coming తో Ayodhya

ఈ నేపథ్యంలోనే బాలరాముడు విగ్రహాన్ని ప్రాణ ప్రతిష్టకు సిద్ధం చేస్తున్నారు. జనవరి 21వ తేదీన బాలరాముడి విగ్రహానికి 125 కలిశాలతో మంగళ స్నానం చేయించనున్నారు. అదే విధంగా తాత్కాలిక మందిరంలో దర్శనాలను కూడా నిలిపివేశారు.

ఈ పూజా కార్యక్రమాలను వేద పండితులు మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. ఇక అసలు కార్యక్రమం అయిన ప్రాణప్రతిష్ట అనేది జనవరి 22వ తేదీ అంటే రేపే కావడంతో సెలెబ్రెటీలు ఒక్కొక్కరుగా అయోధ్యకు చేరుకుంటున్నారు.

ఒకరు కాదు ఇద్దరు కాదు వివిధ రంగాలకు చెందిన 8 వేల మంది ప్రముఖులకు రామ తీర్ధ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానాన్ని పంపించింది. కాబట్టి వారంతా ఈ కార్యక్రమాన్ని వీక్షించి తరించేందుకు అయోధ్యకు చేరుకుంటున్నారు.

Leave a Comment