Special Trains For Ayodhya: అయోధ్య వెళ్లే వారికి శుభవార్త.

website 6tvnews template 11 1 Special Trains For Ayodhya: అయోధ్య వెళ్లే వారికి శుభవార్త.

Special Trains For Ayodhya: జనవరి 22 వ తేదీ, ఈ రోజు కోసం యావత్ దేశం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఎందుకంటే ఆ రోజునే రామజన్మ భూమి అయిన అయోధ్య (Ayodhya)లో రామ మందిర ప్రారంభోత్సవం జరగబోతోంది.

ఈ కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) తోపాటు అనేక మంది సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, క్రీడా రంగ ప్రముఖులు హాజరు కాబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఇప్పటికే రామ మందిరాన్ని విద్యుత్ దీప కాంతులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.

లక్షల్లో అభిమానులు రానున్న నేపధ్యం లో అయోధ్యలో భద్రతా పరమైన చర్యలు కూడా చేపడుతున్నారు. భక్త జనానికి ఎటువంటి లోటు కలుగకుండా ఉండేందుకు అన్ని సౌకర్యాలను కల్పించనున్నారు.

తెలంగాణ నుండి వెళ్లే రైలు : Train From Telangana

Map of Andhra Pradesh illustrating the three regions Telangana coastal Andhra and 1 Special Trains For Ayodhya: అయోధ్య వెళ్లే వారికి శుభవార్త.

ఇది ఇలా ఉంటె తెలుగు రాష్ట్రాల్లో రామ భక్తులు ఎక్కువగా ఉంటారని చెప్పడంలో సందేహం లేదు, అందుకే వీరిని దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ అటు తెలంగాణ(Telangana) ఇటు ఆంధ్ర ప్రదేశ్(Andhra Pradesh) నుండి అయోధ్య కు ప్రత్యేక రైళ్లు నడపనుంది. అయితే ఈ రైళ్లు ఇక్కడి నుండి మొదలై ఎక్కడ వరకు వెళతాయి తెలుగు రాష్ట్రాల్లో వీటి స్టాపింగ్స్ ఎక్కడ అని చూద్దాం.

యాశ్వంత్ పూర్(Yahvanthpur) నుండి గోరఖ్ పూర్(Gorakhpur) వెళ్లే రైలు అయోధ్య వెళుతుంది. ఈ రైలు కాచిగూడ మీద గానే వెళుతుంది. ఈ రైలు యశవంతపూర్ లో మొదలై ధర్మవరం, అనంతపూర్, కర్నూల్ టౌన్, మీదుగా కాచిగూడ(Kachiguda) చేరుకుంటుంది. ఇది కాచిగూడ వచ్చే సరికి ప్రతి శుక్రవారం ఉదయం పది గంటలకు చేరుకుంటుంది.

కాచిగుండా నుండి ఖాజీపేట(Khajipet), సిర్పూర్ కాగజ్ నగర్, ప్రయాణం చేసి అయోధ్య వెళుతుంది. ఇది మొత్తం 1690 కిలోమీటర్లు ప్రయాణించి అయోధ్య చేరుకుంటుంది.

విజయవాడ లో ట్రైన్ ఎన్నిగంటలకు : Ayodhya Train From Vijayawada


మరో రైలు శ్రద్ధ సేతు ఎక్స్ప్రెస్(Shradha Sethu Express), ఇది రామేశ్వరం నుండి అయోధ్యకు వెళుతుంది. ఈ రైలు ప్రతి సోమవారం రాత్రి 8.10 నిమిషాలకు విజయవాడ(Vijayawada) నుండి కదులుతుంది.

ఇది ఆంధ్ర ప్రదేశ్ లోని గూడూరు(Guduru), విజయవాడ స్టేషన్లతోపాటు తెలంగాణ లోని వరంగల్(Warangal) స్టేషన్లలో ఆగుతుంది. ఇది మొత్తం 1813 కిలోమీటర్లు ప్రయాణించి అయోధ్య చేరుకుంటుంది.

ఇది అయోధ్య కు వెళ్లేసరికి బుధవారం తెల్లవారుఝామున నాలుగు గంటల సమయం అవుతుంది.

Leave a Comment